సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాలతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ* *కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ* *సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాలతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ* *కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ* *హైదరాబాద్, సెప్టెంబర్ 16:* సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో పాటు 10 కార్మిక సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్ ద్వారా కేసును సమర్థవంతంగా వాదించి, పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాంటీన్ ఏర్పాటు నిబంధనలను ఉల్లంఘిస్తున్న అంశంపై ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఫ్యాక్టరీస్ డైరెక్టర్ నోటీసు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సిర్పూర్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై కార్మిక సంఘాలు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సిర్పూర్‌లో ఏటీసీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. లేబర్ వెల్ఫేర్ సెంటర్‌కు సంబంధించిన స్థలాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.
సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాలతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ* *కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ* *సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాలతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ* *కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ* *హైదరాబాద్, సెప్టెంబర్ 16:* సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో పాటు 10 కార్మిక సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్
ద్వారా కేసును సమర్థవంతంగా వాదించి, పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాంటీన్ ఏర్పాటు నిబంధనలను ఉల్లంఘిస్తున్న అంశంపై ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఫ్యాక్టరీస్ డైరెక్టర్ నోటీసు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సిర్పూర్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై కార్మిక సంఘాలు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సిర్పూర్‌లో ఏటీసీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. లేబర్ వెల్ఫేర్ సెంటర్‌కు సంబంధించిన స్థలాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.
- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.3
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.1
- 56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1