శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అభయాంజనేయ స్వామి. బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణం నెల్లూరు రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి చౌడమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాసం మూడవ మంగళవారం సందర్భంగా స్వామివారికి పలు రకాల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసం స్వామివారికి ప్రీతికరమని, పచ్చదనం అంటే స్వామికి ఎంతో ఇష్టమని, ఈ అలంకరణలో స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, భయ, గండ దోషాలు తొలగిపోతాయని తెలిపారు.అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అలంకరణ కూరగాయలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు శ్రీ పెంచలయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పెంచలయ్య ధర్మపత్ని చంద్రకళ కుటుంబ సభ్యులు, విజయ ఇన్ ఫ్రా అధినేత ముమ్మడి రెడ్డి నాగేంద్ర రెడ్డి, పలువురు ప్రముఖులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అభయాంజనేయ స్వామి. బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణం నెల్లూరు రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి చౌడమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాసం మూడవ మంగళవారం సందర్భంగా స్వామివారికి పలు రకాల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసం స్వామివారికి ప్రీతికరమని, పచ్చదనం అంటే స్వామికి ఎంతో ఇష్టమని, ఈ అలంకరణలో స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, భయ, గండ దోషాలు తొలగిపోతాయని తెలిపారు.అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అలంకరణ కూరగాయలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు శ్రీ పెంచలయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పెంచలయ్య ధర్మపత్ని చంద్రకళ కుటుంబ సభ్యులు, విజయ ఇన్ ఫ్రా అధినేత ముమ్మడి రెడ్డి నాగేంద్ర రెడ్డి, పలువురు ప్రముఖులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీడ్ బాల్స్ పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం బద్వేలు, సెప్టెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేలులో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు ఎఫ్.ఆర్.ఓ కె.ఎం. నయీమ్ అలీ ఆధ్వర్యంలో, వారి సిబ్బంది, శ్రీ లలితమ్మ ఆలయ కమిటీ చైర్మన్, కొత్త చెరువు గ్రామ పెద్దలు, బద్వేలు పబ్లిక్ స్కూల్, కొత్తవారిపేట ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ (విత్తనపు ఉండలు) తయారీ మరియు తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. "తరగతి గదిలో ఒక చెట్టు" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరినీ శ్రీ లలితమ్మ అభయకారిణి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాటి చెట్ల ప్రాముఖ్యత, సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అడవుల పెంపకం ఆవశ్యకతపై క్లుప్తంగా వివరించారు. విద్యార్థులు, ప్రజలతో కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.3
- నేపాల్ భారత్‌లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్‌లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳1
- ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు1
- మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.2
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.1
- ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన వైయస్ షర్మిల రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.1
- రైతుల కోసం గొడ్డల పార్టీ నాయకులు డ్రామా అంటున్న MLA గిత్తజయసూర్య వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ డ్రామాలు – నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల: వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ నేతలు చేస్తున్నది రైతుల కోసం పోరాటం కాదని, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న డ్రామాలని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు తీవ్రంగా విమర్శించారు. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్లే సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. నీటి లభ్యతపై ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పటికీ, ఇప్పుడు రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి డ్రామాలు హడావుడి చేయడం సరికాదన్నారు. “రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారో ముందుగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలను వైసీపీ నేతలు మరిచిపోయారా?” అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను మరియు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం నెలకొన్న సాగునీటి సమస్యపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, రైతులకు సాధ్యమైనంత మేర సాగునీరు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్టిలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు పేర్కొన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు, ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. రైతుల కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.1
- బద్వేలులో దుకాణంలో చోరీ - రూ.34 వేల సరుకు అపహరణ....... బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణంలోని కెనరా బ్యాంక్ సమీపంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. జిరాక్స్, చిల్లర అంగడి నిర్వహిస్తున్న అంకయ్యకు చెందిన దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న సుమారు రూ.34 వేల విలువైన సీక్రెట్ ప్యాకెట్లనుఅపహరించినట్లు బాధితుడుఆరోపిస్తున్నాడు. ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, సొత్తును ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. పరిసర సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.2