logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

9 hrs ago
user_Shaikshada
Shaikshada
Dancer ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
9 hrs ago

More news from తెలంగాణ and nearby areas
  • ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి : శ్రీకాంత్ రెడ్డి తాంసి: మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, ప్రాథమిక విద్యతో పాటు వివిధ సంక్షేమ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ గణేష్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి : శ్రీకాంత్ రెడ్డి
తాంసి: మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, ప్రాథమిక విద్యతో పాటు వివిధ సంక్షేమ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ గణేష్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Shaikshada
    1
    Post by Shaikshada
    user_Shaikshada
    Shaikshada
    Dancer ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • వాడవాడలా కొలువు తీరిన గణనాథులు.. భక్తుల ప్రత్యేక పూజలు.. నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా చిన్న పెద్ద అంతా కలిసి భారీ గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండపాలను విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.
    1
    వాడవాడలా కొలువు తీరిన గణనాథులు..
భక్తుల ప్రత్యేక పూజలు..
నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా చిన్న పెద్ద అంతా కలిసి భారీ గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండపాలను విద్యుత్  దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • నిర్మల్ జిల్లా లో భక్తిశ్రద్ధల మధ్య ఇంట్లో కొలువుదీరిన గణనాథుడికి నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక్ సాగర్ లో కుటుంబ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. నిర్మల్ జిల్లా: ఆనందం.. ఆధ్యాత్మికతో గణపయ్యకు వీడ్కోలు.. యాంకర్ పార్ట్: భక్తిశ్రద్ధల మధ్య ఇంట్లో కొలువుదీరిన గణనాథుడికి నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక్ సాగర్ లో కుటుంబ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేక పూజలు, మంగళహారతులు, నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తి నినాదాల మధ్య వినాయకుడి నిమజ్జనం నిర్వహించారు. గణపతి బప్పా మోరియా… వచ్చే ఏడాది త్వరగా రావయ్యా…” అంటూ కుటుంబ సభ్యులు గణపయ్యను భక్తి భావంతో సాగనంపారు.
    1
    నిర్మల్ జిల్లా లో భక్తిశ్రద్ధల మధ్య ఇంట్లో కొలువుదీరిన గణనాథుడికి నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక్ సాగర్ లో కుటుంబ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు.
నిర్మల్ జిల్లా:
ఆనందం.. ఆధ్యాత్మికతో గణపయ్యకు వీడ్కోలు..
యాంకర్ పార్ట్:
భక్తిశ్రద్ధల మధ్య ఇంట్లో కొలువుదీరిన గణనాథుడికి నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక్ సాగర్ లో కుటుంబ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేక పూజలు, మంగళహారతులు, నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తి నినాదాల మధ్య వినాయకుడి నిమజ్జనం నిర్వహించారు. గణపతి బప్పా మోరియా… వచ్చే ఏడాది త్వరగా రావయ్యా…” అంటూ కుటుంబ సభ్యులు గణపయ్యను భక్తి భావంతో సాగనంపారు.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
  • మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని బిఆర్ఎస్ నాయకుడి వినతి జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుందన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందన్నారు. దీంతో చిరు వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
    1
    మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని బిఆర్ఎస్ నాయకుడి వినతి
జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుందన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందన్నారు. దీంతో చిరు వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • ఉద్యోగ రిజర్వేషన్లలో మాలలకు న్యాయం చేయాలి : రోస్టర్‌ పాయింట్లు సవరించాలని డిమాండ్‌ ఆదిలాబాద్: ఉద్యోగ రిజర్వేషన్లలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని మాల ఉద్యోగుల జిల్లా కన్వీనర్‌ కె. సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌లో యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు సున్నా పోస్టులు రావడంతో నష్టపోతున్నారని తెలిపారు. విద్యార్థుల అడ్మిషన్లలోనూ అన్యాయం జరుగుతోందని, భవిష్యత్‌ నోటిఫికేషన్లలో న్యాయం జరిగేలా రోస్టర్‌ పాయింట్లను వెంటనే సవరించాలని కోరారు. కార్యక్రమంలో అల్లూరి భూమన్న, కుమ్మరి సత్యనారాయణ, శశికాంత్‌, బొంకటి సుభాష్‌, మెట్టపల్లి భీమ్‌రావు, దువాస రాజేశ్వర్‌, వేల్పుల భూమన్న తదితరులు పాల్గొన్నారు.
    1
    ఉద్యోగ రిజర్వేషన్లలో మాలలకు న్యాయం చేయాలి : రోస్టర్‌ పాయింట్లు సవరించాలని డిమాండ్‌
ఆదిలాబాద్: ఉద్యోగ రిజర్వేషన్లలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని మాల ఉద్యోగుల జిల్లా కన్వీనర్‌ కె. సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌లో యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు సున్నా పోస్టులు రావడంతో నష్టపోతున్నారని తెలిపారు. విద్యార్థుల అడ్మిషన్లలోనూ అన్యాయం జరుగుతోందని, భవిష్యత్‌ నోటిఫికేషన్లలో న్యాయం జరిగేలా రోస్టర్‌ పాయింట్లను వెంటనే సవరించాలని కోరారు. కార్యక్రమంలో అల్లూరి భూమన్న, కుమ్మరి సత్యనారాయణ, శశికాంత్‌, బొంకటి సుభాష్‌, మెట్టపల్లి భీమ్‌రావు, దువాస రాజేశ్వర్‌, వేల్పుల భూమన్న తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 15 :– *పూజల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు – నకిలీ బాబా అరెస్టు* *బ్లాక్ మ్యాజిక్ పేరుతో కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ భయపెట్టిన నిందితులు* *పత్రికా ప్రకటన* *పూజా సామగ్రి పేరుతో బాధితుడి నుంచి డబ్బులు వసూలు* *భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు* *ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి* ఆదిలాబాద్ మావాల పోలీస్ స్టేషన్ పరిధిలో పూజలు చేస్తే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మించి, బ్లాక్ మ్యాజిక్ తొలగించకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోతారని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. *వివరాలలో* నిందితుడు సలీం సయ్యద్ పూజల ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని బాధితుడిని నమ్మించి ఇంటి వద్ద పూజలు నిర్వహించాడు. అనంతరం బంగారం, వెండి కొనుగోలు చేయించి, మరిన్ని పూజా సామగ్రి అవసరమని చెప్పి యవత్మాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భస్మం తదితర పూజా సామగ్రి పేరుతో రూ.81,600 చెల్లింపజేశాడు. అనంతరం మరో రూ.1.32 లక్షలు అవసరమని, పూజలు చేయకపోతే కుటుంబ సభ్యుడి ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని భయపెట్టాడు. నిందితుల మాటలపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు. *నిందితుల వివరాలు:* A1) సలీం సయ్యద్ @ సలీం బషీర్ సయ్యద్, ( 40) s/o బషీర్, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. A2) సయ్యద్ షమా, ( 46) w/o సలీం, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని ఆదిలాబాద్ డిఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో మావలా సీఐ బి డి ప్రేమ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా,
సెప్టెంబర్ 15 :–

*పూజల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు – నకిలీ బాబా అరెస్టు*

*బ్లాక్ మ్యాజిక్ పేరుతో కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ భయపెట్టిన నిందితులు*

*పత్రికా ప్రకటన*
*పూజా సామగ్రి పేరుతో బాధితుడి నుంచి డబ్బులు వసూలు*
*భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు*
*ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి*
ఆదిలాబాద్ మావాల పోలీస్ స్టేషన్ పరిధిలో పూజలు చేస్తే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మించి, బ్లాక్ మ్యాజిక్ తొలగించకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోతారని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. 
*వివరాలలో* 
నిందితుడు సలీం సయ్యద్ పూజల ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని బాధితుడిని నమ్మించి ఇంటి వద్ద పూజలు నిర్వహించాడు. అనంతరం బంగారం, వెండి కొనుగోలు చేయించి, మరిన్ని పూజా సామగ్రి అవసరమని చెప్పి యవత్మాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భస్మం తదితర పూజా సామగ్రి పేరుతో రూ.81,600 చెల్లింపజేశాడు. అనంతరం మరో రూ.1.32 లక్షలు అవసరమని, పూజలు చేయకపోతే కుటుంబ సభ్యుడి ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని భయపెట్టాడు.
నిందితుల మాటలపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు.
*నిందితుల వివరాలు:* 
A1) సలీం సయ్యద్ @ సలీం బషీర్ సయ్యద్, ( 40) s/o బషీర్, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర.
A2) సయ్యద్ షమా, ( 46) w/o సలీం, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర.
ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని ఆదిలాబాద్ డిఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో మావలా సీఐ బి డి ప్రేమ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • నిర్మల్ కొయ్య బొమ్మల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. గోదావరి పుష్కరాల్లో విక్రయాలకు ప్రదర్శనకు స్టాళ్లు.. నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలలో నిర్మల్ కొయ్య బొమ్మల మార్కెటింగ్‌కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాసరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొయ్య బొమ్మల కళ అభివృద్ధి, కళాకారులకు మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాల పెంపు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    నిర్మల్ కొయ్య బొమ్మల సంరక్షణకు ప్రత్యేక చర్యలు.
గోదావరి పుష్కరాల్లో విక్రయాలకు ప్రదర్శనకు స్టాళ్లు..
నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలలో నిర్మల్ కొయ్య బొమ్మల మార్కెటింగ్‌కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 
బాసరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొయ్య బొమ్మల కళ అభివృద్ధి, కళాకారులకు మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాల పెంపు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से काटा हैदराबाद: 15 सितंबर मेचल जिले के नागशोल (नागोल) पुलिस स्टेशन के अंतर्गत आने वाले बंडलागुडा इलाके में सोमवार रात कुछ अज्ञात हमलावरों ने एक राउडी शीटर की बेरहमी से हत्या कर दी। मृतक की पहचान भद्राद्री कोठागुडेम जिले के इलेन्दु निवासी राउडी शीटर नईम के रूप में हुई है। पुलिस से मिली जानकारी के अनुसार, हमलावरों से जान बचाकर भागने की कोशिश कर रहा नईम पास ही स्थित 'सुप्रीम वाइन शॉप' के अंदर घुस गया था। लेकिन, बेखौफ हमलावरों ने उसे बख्शा नहीं और वाइन शॉप के अंदर ही धारदार हथियारों से ताबड़तोड़ वार कर उसकी हत्या कर दी। इस सनसनीखेज वारदात को अंजाम देने के बाद आरोपी मौके से एक कार में सवार होकर फरार हो गए। पुरानी रंजिश हो सकती है वजह घटना की सूचना मिलते ही नागगोल पुलिस तुरंत हरकत में आई और मौके पर पहुंचकर स्थिति का जायजा लिया तथा साक्ष्य जुटाए। पुलिस का शुरुआती तौर पर मानना है कि इस हत्या के पीछे पुरानी रंजिश मुख्य कारण हो सकती है। विशेष टीमों का गठन पुलिस ने बताया कि घटनास्थल और आसपास लगे सीसीटीवी कैमरों के फुटेज खंगाले जा रहे हैं। इसके साथ ही, आरोपियों द्वारा इस्तेमाल की गई कार का पता लगाने और फरार हमलावरों को दबोचने के लिए विशेष टीमों (स्पेशल पुलिस टीमों) का गठन कर सघन तलाशी अभियान शुरू कर दिया गया है।
    1
    हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से 
हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से काटा
हैदराबाद: 15 सितंबर मेचल जिले के नागशोल (नागोल) पुलिस स्टेशन के अंतर्गत आने वाले बंडलागुडा इलाके में सोमवार रात कुछ अज्ञात हमलावरों ने एक राउडी शीटर की बेरहमी से हत्या कर दी। मृतक की पहचान भद्राद्री कोठागुडेम जिले के इलेन्दु निवासी राउडी शीटर नईम के रूप में हुई है।
पुलिस से मिली जानकारी के अनुसार, हमलावरों से जान बचाकर भागने की कोशिश कर रहा नईम पास ही स्थित 'सुप्रीम वाइन शॉप' के अंदर घुस गया था। लेकिन, बेखौफ हमलावरों ने उसे बख्शा नहीं और वाइन शॉप के अंदर ही धारदार हथियारों से ताबड़तोड़ वार कर उसकी हत्या कर दी। इस सनसनीखेज वारदात को अंजाम देने के बाद आरोपी मौके से एक कार में सवार होकर फरार हो गए।
पुरानी रंजिश हो सकती है वजह घटना की सूचना मिलते ही नागगोल पुलिस तुरंत हरकत में आई और मौके पर पहुंचकर स्थिति का जायजा लिया तथा साक्ष्य जुटाए। पुलिस का शुरुआती तौर पर मानना है कि इस हत्या के पीछे पुरानी रंजिश मुख्य कारण हो सकती है।
विशेष टीमों का गठन पुलिस ने बताया कि घटनास्थल और आसपास लगे सीसीटीवी कैमरों के फुटेज खंगाले जा रहे हैं। इसके साथ ही, आरोपियों द्वारा इस्तेमाल की गई कार का पता लगाने और फरार हमलावरों को दबोचने के लिए विशेष टीमों (स्पेशल पुलिस टीमों) का गठन कर सघन तलाशी अभियान शुरू कर दिया गया है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.