గుంటూరు జిల్లా తాడేపల్లి లో శుక్రవారం ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ వారి కార్యాలయం లో ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ లకు కొత్తగా అమలులోకి వచ్చిన ఇన్ కం టాక్స్ యాక్ట్ 2025 మరియు రూల్స్ ను స్థిరాస్తి అమ్మకం కొనుగోలు అంశంలో ఎలా అమలు పరుచాలి, ఫైల్ చేయాలని అంశాలపై నాలుగు జిల్లాల సబ్ రిజిస్ట్రర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సు లో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్ పి శంకర్ పాండే వారిని ఉద్దేశించి కొత్త గా అమలు లోకి వచ్చిన చట్టం 2025 మరియు రూల్స్ గురించి తెలియజేశారు .1961 పాత చట్టం ప్రకారం 30 లక్షల లోపు ఆస్తి లావాదేవీలు జరిగితే ఇన్కమ్ టాక్స్ వారికి తెలియజేయాల్సిందని కొత్త చట్టం ప్రకారం 45 లక్షల ట్రాన్సాక్షన్ జరిగితే తెలియజేయాలని ప్రతి లావాదేవిలో విధిగా పాన్ కార్డును సమర్పించాలని తెలియజేశారు ముందుగా కృష్ణ, యన్టీఆర్ ,గుంటూరు ప్రకాశం జిల్లాల అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని నెమ్మదిగా రాష్ట్రంలో అన్ని జిల్లాల సబ్ రిజిస్టర్లకు అవగాహన కల్పిస్తామని ప్రభుత్వం ఆదాయం రావడం లో వీరి పాత్ర ఎక్కువ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ అధికారి పి శంకర్ పాండే అడిషనల్ ఐజీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విజయవాడ పి రవికుమార్ మరియు డి ఐ జి రామారావు ,శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు..
గుంటూరు జిల్లా తాడేపల్లి లో శుక్రవారం ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ వారి కార్యాలయం లో ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ లకు కొత్తగా అమలులోకి వచ్చిన ఇన్ కం టాక్స్ యాక్ట్ 2025 మరియు రూల్స్ ను స్థిరాస్తి అమ్మకం కొనుగోలు అంశంలో ఎలా అమలు పరుచాలి, ఫైల్ చేయాలని అంశాలపై నాలుగు జిల్లాల సబ్ రిజిస్ట్రర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సు లో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్ పి శంకర్ పాండే వారిని ఉద్దేశించి కొత్త గా అమలు లోకి వచ్చిన చట్టం 2025 మరియు రూల్స్ గురించి తెలియజేశారు .1961 పాత చట్టం ప్రకారం 30 లక్షల లోపు ఆస్తి లావాదేవీలు జరిగితే ఇన్కమ్ టాక్స్ వారికి తెలియజేయాల్సిందని కొత్త చట్టం ప్రకారం 45 లక్షల ట్రాన్సాక్షన్ జరిగితే తెలియజేయాలని ప్రతి లావాదేవిలో విధిగా పాన్ కార్డును సమర్పించాలని తెలియజేశారు ముందుగా కృష్ణ, యన్టీఆర్ ,గుంటూరు ప్రకాశం జిల్లాల అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని నెమ్మదిగా రాష్ట్రంలో అన్ని జిల్లాల సబ్ రిజిస్టర్లకు అవగాహన కల్పిస్తామని ప్రభుత్వం ఆదాయం రావడం లో వీరి పాత్ర ఎక్కువ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ అధికారి పి శంకర్ పాండే అడిషనల్ ఐజీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విజయవాడ పి రవికుమార్ మరియు డి ఐ జి రామారావు ,శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు..
- rentapalla2
- దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఒక పౌరుడికి ఒకటే ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.1
- నల్గొండ నల్ల రిబ్బన్లతో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు... తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గ రాజకీయమని మండిపడ్డ పున్న కైలాష్ నేత.! సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కల సాకారం చేసింది... బిజెపి తెలంగాణపై విషం చిమ్ముతుంది.. అనేకమంది బలిదానాలు పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తుంది... ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా! తెలంగాణలో బిజెపి పార్టీని భూస్థాపితం చేస్తాం అంటూ హెచ్చరిక.. మహిళా బిల్లు ముసుకులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చలు పక్క ద్రోవ పట్టిస్తుంది... త్వరలో తెలంగాణలో బిజెపి గద్దెలు కూలుతాయని హెచ్చరిక... డిలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకే బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శ... తేజస్వి సూర్య చేసిన వాక్యాలపై మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.. కార్యక్రమంలో ఎండి ముంతాజ్ అలీ, పేరిక వెంకటేశ్వర్లు, నోముల జనార్ధన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, వేముల గోపీనాథ్, అంబల హరీష్, పల్లా రవితేజతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.1
- నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై *నేషనల్ హైవే అధికారులు* హుటాహుటిన రంగంలోకి.. *బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి* ఫిర్యాదుతో శుక్రవారం చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు... పరిశీలించిన అధికారులు పనుల్లో లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం... అధికారులు పలు ప్రాంతాల నుంచి మట్టి,మెటీరియల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం... నివేదికలో అవకతవకలు తేలితే పెద్దఎత్తున చర్యలు తప్పవని, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ.? నాణ్యత లేని మట్టితో రోడ్లు నిర్మిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరుస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు... నల్లగొండ చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని తరలించి హైవే పనులకు వినియోగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రోడ్డు కుంగిపోవడానికి దారితీస్తుందని వర్షిత్ రెడ్డి ఫైర్... "రాష్ట్రానికి ఆర్ అండ్ బీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా జరుగుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి" అంటూ ఘాటు విమర్శలు... ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారగా, మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్... సమాధానం రాకపోతే హైవే పనుల వద్ద మహాధర్నా, చలో కలెక్టరేట్, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని *బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి* హెచ్చరిక చేశారు...☝️1
- Post by Bondhu Suresh1
- పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఇట్స్ మై ఎడిటింగ్ వీడియో1