logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రానున్న మూడు సంవత్సరాల్లో నకిరేకల్ ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతాం స్థానిక ఎమ్మెల్యే వేముల నకిరేకల్ నియోజకవర్గం :- నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” అమలు పై సన్నాహక సమావేశం కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారు, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయడానికి 99 రోజుల “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని వివరించారు. ఈ 99 రోజుల కార్యక్రమంలో ప్రతి శాఖకు ప్రత్యేకంగా రోజులు కేటాయించి ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని అన్నారు. సంకల్పంతో పని చేస్తే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో గంజాయి సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పటికే చాలా వరకు కట్టడి చేశామని తెలిపారు. యువత తప్పుదారిలో పడకుండా అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే, నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నామని, అలాగే చిట్యాల పట్టణంలో 30 పడకల ఆసుపత్రి, రామన్నపేటలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని వెల్లడించారు. రేషన్ కార్డు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి తప్పకుండా కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కేటాయిస్తామని అన్నారు. నకిరేకల్ పట్టణ భద్రత దృష్ట్యా తన నిధుల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు ప్రకటించారు.

1 day ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
1 day ago
c21c7caf-7f84-4385-b4e0-510c9fa60ca6

రానున్న మూడు సంవత్సరాల్లో నకిరేకల్ ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతాం స్థానిక ఎమ్మెల్యే వేముల నకిరేకల్ నియోజకవర్గం :- నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” అమలు పై సన్నాహక సమావేశం కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారు, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా

77a1b391-2baf-4a33-9b24-2bb7b59fae97

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయడానికి 99 రోజుల “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని

811f26cf-fdd9-426f-bb0b-74b1b19cfce8

వివరించారు. ఈ 99 రోజుల కార్యక్రమంలో ప్రతి శాఖకు ప్రత్యేకంగా రోజులు కేటాయించి ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని అన్నారు. సంకల్పంతో పని చేస్తే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో గంజాయి సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పటికే చాలా వరకు కట్టడి చేశామని తెలిపారు. యువత తప్పుదారిలో పడకుండా అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల

4fdfd03c-60d0-4cd8-9e9b-c59c1eb9bb43

విషయానికి వస్తే, నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నామని, అలాగే చిట్యాల పట్టణంలో 30 పడకల ఆసుపత్రి, రామన్నపేటలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని వెల్లడించారు. రేషన్ కార్డు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి తప్పకుండా కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కేటాయిస్తామని అన్నారు. నకిరేకల్ పట్టణ భద్రత దృష్ట్యా తన నిధుల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు ప్రకటించారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.
    1
    మహబూబాబాద్ జిల్లా  గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
    1
    మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • Post by డాక్టర్ బాబు 7036445113
    1
    Post by డాక్టర్ బాబు 7036445113
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • దేశాయిపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఓ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన Sonu Sood వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. చదువుపై దృష్టి పెట్టాలని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.
    1
    దేశాయిపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఓ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన Sonu Sood వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. చదువుపై దృష్టి పెట్టాలని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా
    1
    తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • గంగారం మండలం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన చేనులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతు గుండా గాని రాజుకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న కంకులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోవడంతో స్థానికులు గమనించారు. అనంతరం గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంటలో కొంత భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన వల్ల రైతు గుండా గాని రాజుకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. చేనులో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    గంగారం మండలం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన చేనులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతు గుండా గాని రాజుకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
గ్రామానికి సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న కంకులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోవడంతో స్థానికులు గమనించారు. అనంతరం గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంటలో కొంత భాగం పూర్తిగా కాలిపోయింది.
ఈ ఘటన వల్ల రైతు గుండా గాని రాజుకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. చేనులో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.