Shuru
Apke Nagar Ki App…
బొగత జలపాతం వద్ద తగ్గిన వరద ఉద్ధృతి.. పర్యాటకుల సందడి.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గత కొన్ని రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన జలపాతం ప్రస్తుతం కొంత శాంతించింది. జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తుండగా, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
M D Azizuddin

More news from తెలంగాణ and nearby areas
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.1
- మావోయిజం అంతం.. లొంగిపోయిన వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: డీజీపీ సీవీ ఆనంద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మావోయిజం అంతమైందని, ప్రధాన క్యాడర్ మొత్తం లొంగిపోయిందని తెలిపారు. లొంగిపోయిన వారి సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. గ్రామస్థాయిలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని, వాటి నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాల్లో హైవేలపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. పోలీస్ కుటుంబాల రక్షణకు కట్టుబడి ఉన్నామని, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో 100కు బదులుగా �112కు డయల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- మాజీ ఎమ్మెల్యే విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో ధర్నాకు దిగిన మాజీ మంత్రి వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉద్రిక్తత. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు.ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.1