Shuru
Apke Nagar Ki App…
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ ఇచ్చోడ మండలం మదాపూర్ గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ షేక్ ఇమ్రాన్, షాదుల్లా పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
AlluriMahesh
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ ఇచ్చోడ మండలం మదాపూర్ గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ షేక్ ఇమ్రాన్, షాదుల్లా పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆగస్టు 26, 2026_ఆదిలాబాదు: *అదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రిక ప్రకటన కేరళ తరహాలోనే బెల్లూరి అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాదు గ్రామీణ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో, అదే రీతిలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చరిత్ర కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది తాను ఓనం పండుగలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. భగవంతుని దర్శనం చేసుకుని, ఆశీస్సులు తీసుకుని జిల్లా అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, చదువులోనూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, భగవంతుడు అందరికీ శక్తినివ్వాలని కోరారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని, మరిన్ని వసతులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రమేష్, గురుస్వాములు గొర్ల కృష్ణ, చంద్ర గణేష్, తిప్పరి సత్యం, గాలి లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder1
- ఆంక్షలతో మేకలను గొర్రెలను అమ్ముకుంటున్నామని ఆవేదన....... కవ్వాల్ అభయారణ్యంలో అమలు చేస్తున్న ఆంక్షలతో తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా గ్రామ పెద్ద చిన్నన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం జన్నారంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల మందతో ఒకప్పుడు తాము అడవికి వెళ్లే వాళ్ళమని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. అటవీ ఆంక్షలు తమ ఉపాధిని పూర్తిగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.1
- పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.1
- బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు... బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు.... అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు .... ఎమ్మెల్యే గెలవక ముందు హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- *ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా* ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు. భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,2