*ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా* ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు. భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,
*ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా* ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర
వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు. భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,
- జన్నారంలో ముందస్తు రక్షాబంధన్, రాఖీలు కట్టిన అక్క చెల్లెళ్లు జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా వారు జన్నారం పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోదరులకు స్వీట్లను తినిపించి పండుగను ఘనంగా నిర్వహించారు.1
- “నిజామాబాద్‌లో కాంగ్రెస్ గెలవదనడం పచ్చి అబద్ధం” — ధర్మపురి సంజయ్ “కష్టపడి పనిచేసే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించండి.. కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తాం” నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవదని జరుగుతున్న ప్రచారాన్ని ధర్మపురి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కష్టపడి, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని మరింత బలోపేతం చేసి, విజయపథంలో పరుగులు పెట్టిస్తామని ఆయన అన్నారు.1
- ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన కోడెలు మృతి చెందుతున్నాయి దానిపై విచారణ జరిపించాలన్న ప్రతాప రామకృష్ణ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు చనిపోతున్నాయి దానిపైన విచారణ జరిపించాలని ప్రతాప రామకృష్ణ కోరారు ఎందుకు చనిపోతున్నాయి ఎలా చనిపోతున్నాయి అని టెంపుల్ వారిని అడిగారు దానిపై కచ్చితంగా విచారణ జరిపించాలని ఆలయాన్ని కోరారు వేములవాడ వచ్చే ప్రతి భక్తులు కోడెలను దేవునిగా కొలుస్తూ కోడలు కడతారు దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నారు1
- ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు. 1250 ఎకరాల్లో కూరగాయల సాగు ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు. రెండు ఎకరాల్లో బంతి పూల సాగు గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది. జిల్లా కలెక్టర్ అభినందన గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.1
- ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- Banswada government junior college student strike (dharna)1
- డీ అరవింద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి: డీ సంజయ్ నిజామాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మేయర్ డీ సంజయ్ ఎంపీ డీ అరవింద్‌ను తీవ్రంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. డీ అరవింద్ రాజకీయ గుర్తింపు మాజీ మంత్రి, దివంగత డీ శ్రీనివాస్ వల్లే వచ్చిందని డీ సంజయ్ అన్నారు. నిజామాబాద్ ఎప్పటి నుంచో హిందూ–ముస్లిం ఐక్యత, మత సామరస్యానికి ప్రతీకగా ఉందని పేర్కొన్నారు. డీ అరవింద్ విద్వేష, రెచ్చగొట్టే రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే నిజామాబాద్‌లో బీజేపీకి గట్టి రాజకీయ సమాధానం ఇస్తామని డీ సంజయ్ స్పష్టం చేశారు.1
- విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్ పరిశీలించి, తరగతి గదులు, వసతి, తదితర అంశాలపై వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి, గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయంలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సందర్శనలో సర్పంచ్ మల్లుగారి పద్మ, పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈ లు అన్వర్, సుమలత, ఎంపీడీఓ రాజేందర్, జీసీడీఓ పద్మజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1