Shuru
Apke Nagar Ki App…
“నిజామాబాద్‌లో కాంగ్రెస్ గెలవదనడం పచ్చి అబద్ధం” — ధర్మపురి సంజయ్ “కష్టపడి పనిచేసే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించండి.. కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తాం” నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవదని జరుగుతున్న ప్రచారాన్ని ధర్మపురి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కష్టపడి, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని మరింత బలోపేతం చేసి, విజయపథంలో పరుగులు పెట్టిస్తామని ఆయన అన్నారు.
Mirza Hassan Baig
“నిజామాబాద్‌లో కాంగ్రెస్ గెలవదనడం పచ్చి అబద్ధం” — ధర్మపురి సంజయ్ “కష్టపడి పనిచేసే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించండి.. కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తాం” నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవదని జరుగుతున్న ప్రచారాన్ని ధర్మపురి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కష్టపడి, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని మరింత బలోపేతం చేసి, విజయపథంలో పరుగులు పెట్టిస్తామని ఆయన అన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కామారెడ్డి జిల్లా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి: అదనపు కలెక్టర్ విక్టర్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామం లో డీఎఫ్‌ఓ నీరజ్, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముకుంద రెడ్డి, అధికారులు, గీత కార్మికులతో కలిసి అదనపు కలెక్టర్ విక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాఘవపూర్‌లో 1,200 ఈత మొక్కలను నాటారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వన మహోత్సవం కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాఘవపూర్‌లో 1,200 ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు. జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రవి తేజ, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, పీడీ మెప్మా శ్రీధర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, గీత కార్మికులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్ పరిశీలించి, తరగతి గదులు, వసతి, తదితర అంశాలపై వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి, గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయంలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సందర్శనలో సర్పంచ్ మల్లుగారి పద్మ, పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈ లు అన్వర్, సుమలత, ఎంపీడీఓ రాజేందర్, జీసీడీఓ పద్మజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1
- ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తున్న సమయంలో ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఖరీదైన ఫోన్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించారు. చదువు లేకపోవడంతో ఆన్‌లైన్ విధానంలో బుకింగ్ చేసుకోవడం తమకు కష్టంగా మారిందన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ప్రక్రియతో ఇబ్బంది పెట్టకుండా నేరుగా యూరియా అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.1
- *ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా* ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు. భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,2
- pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder1
- పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.1
- పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. అటవీ శాఖ ఆద్వర్యంలో గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ పరిధి గజ సింగవరం శివారులో మంగళవారం వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అడవులను అందరూ సంరక్షించాలని పిలుపు నిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించారు. జిల్లా మొత్తం లక్ష్యం 8,65,200 కాగా, 6,89, 212 మొక్కలు నాటి.. 79.66 శాతం లక్ష్యం పూర్తి చేశామని వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా రెండు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని, అందరూ నాటి సంరక్షించాలని పిలుపు నిచ్చారు. మునగ మొక్కలు నాటాలని, దీంతో ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఇంటికి ఇచ్చిన తడి, పొడి చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నుంచే చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు వాడటంతో పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మార్కెట్, షాపుకి వెళ్లినప్పుడు బట్ట సంచితో వెళ్లాలని తెలిపారు. ప్రతి ఇంట్లో, అన్ని ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమురిశెట్టి విజయ, సర్పంచ్ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.1
- కౌడిపల్లి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కౌడిపల్లి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఢీకొన్న వెంటనే బైకుల్లో ఒకదానికి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో పాటు రైలాపూర్‌కు చెందిన బిక్షపతికి గాయాలయ్యాయి. రోడ్డుపై అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.1