Shuru
Apke Nagar Ki App…
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు జగిత్యాల జిల్లా..... RTC నాయకులు, ప్రభుత్వ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలం..... సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన RTC JAC..... కోరుట్ల, మెట్టుపల్లి పట్టణాల్లో డిపోలకే పరిమితమైన RTC బస్సులు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు జగిత్యాల జిల్లా..... RTC నాయకులు, ప్రభుత్వ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలం..... సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన RTC JAC..... కోరుట్ల, మెట్టుపల్లి పట్టణాల్లో డిపోలకే పరిమితమైన RTC బస్సులు.
More news from తెలంగాణ and nearby areas
- కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు.1
- జగిత్యాల జిల్లా..... RTC నాయకులు, ప్రభుత్వ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలం..... సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన RTC JAC..... కోరుట్ల, మెట్టుపల్లి పట్టణాల్లో డిపోలకే పరిమితమైన RTC బస్సులు.1
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ బిజెపి నిర్వహించిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. బిజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. డంపింగ్ యార్డు ను రద్దు చేయాలని వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై పై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు బిజెపి శ్రేణులకు సముదాయించిన ఆందోళన విరమించకపోవడంతో పోలీసులకు బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు బిజేపి జిల్లా అధ్యక్షుడితో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.1
- బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం అరుదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, శిరీష, హరీష పాల్గొన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.1
- ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- కరీంనగర్ లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...* జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....2
- ఆర్టీసీ లో రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.వారు ఉద్యోగ రీత్యా,విద్యా,వైద్య అవసరాలకు ప్రయాణం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నాం.. మేము రాగానే వేసిన మొట్ట మొదటి కమిటీ సీనియర్ ఐఏఏస్ లతో వేశాం.. అధికారుల కమిటీ తో ఐదు గంటలపైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మద్యలో వెళ్లిపోవడం ఇది కుట్ర లో భాగమే ఇటీవల జగిత్యాల సభలో మహా లక్ష్మీ ప్రయాణం కేసీఆర్ అవహేళన గా మాట్లాడారు ... వెంటనే ఆర్టీసీ పై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గా ఉన్న హరీష్ రావు సమ్మె పై కార్మికులను ప్రోత్సహించారు.. మహా లక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు ఆర్టీసీ డిమాండ్స్ పై చర్చిస్తున్నాని అధికారులు చెప్పారు.. అయిన వినకూడనే ఎవరితో ఫోన్ లో మాట్లాడి సమ్మె కి వెళ్ళారు ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం..1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చాం.. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పని భారం లేకుండా కార్మిక చట్టాలు లోపలే చేశాం.. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు హాఫ్ ఉండేది.. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. మేమే పని భారం లేకుండా చేయాలని చూస్తున్నాం.. మేము శ్రమ దోపిడి చేయదలచుకోలేదు విలీనం ,యూనియన్ ల అంశాలపై ప్రభుత్వం పరిగణన లో ఉంది ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి 300 కోట్ల ,అవసరమైనప్పుడు 400 కోట్లు ఎంత అవసరం ఉంటే అంత ఇస్తుంది ఆర్టీసీ లో సర్వీసు నుండి రిమూవ్ అయిన వారికి 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నాం.. పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ ..ఆర్టీసీ నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దు. పేద ప్రజల రవాణా వ్యవస్థ బాగుండాలి ,పని చేస్తున్న 40 వేల కుటుంబాల ఉద్యోగుల బాగుండాలి నిరసనలు చెప్పే వారు బస్ డిపో లు చేసుకోండి.. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు మేము ఏర్పడిన తరువాత మొదటి కమిటీ వేశాం..మేము కమిటీ కి 4 వారాల సమయం అడిగాం.. ప్రభుత్వం తో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలు నాయకత్వం వహించిన వారు రిటైర్డ్ అయిన వారు ,ఉద్యోగాలు చేయని వారు ఉన్నారు.. గత ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించింది.. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎండీ కి , ప్రిన్సిపల్ సెక్రటరీ కి తెలియకుండా ఆదరభదార గా విలీనం అంశాన్ని తెచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు రండి కూర్చొని మాట్లాడడం.. మహా లక్ష్మీ పథకం నచ్చినంత మాత్రాన మీరు ఆర్టీసీ పై కుట్రలు చేస్తున్నారు రాజకీయ వ్యూహంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించి ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న వారు సంస్థ పరిరక్షణ దృశ్య ,ప్రయోజన దృశ్య సమ్మె విరమించాలి. అధికారులు ఆర్టీసీ కార్మికులు సమ్మె కి పోతున్నారని ఊహించలేదు.. డిప్యూటీ సీఎం చెన్నై లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయం.. డిపో వారిగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్న దగ్గర తగ్గించేందుకు సిద్ధం.. మేము కింది స్థాయి నుండి వచ్చాం..ఆర్టీసీ కుటుంబాల తో 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక సార్లు ఇంటరాక్ట్ అయ్యారు.. ఉద్యోగస్థులు అక్కా చెల్లెలు ,అన్న దమ్ములు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలి.. 29 అంశాలపై వెంటనే మేము టేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం..ఆర్థిక పరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉంది.. విలీనం ,సంఘాల ఏర్పాటు , పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది..మూడు సాంకేతిక అంశాలపై కమిటి రిపోర్ట్ అందిస్తుంది అధికారుల సంప్రదింపులు కొనసాగుతుండగానే కమిటీ లోని వికాస్ రాజ్ ,దాన కిషోర్ ,సందీప్ కుమార్ సుల్తానియ మీ అంశాలపై సానుకూల దృక్పథంతో ఉండేవారు. ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం.. పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నాం.. సమ్మె దృశ్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.. గత ప్రభుత్వం యూనియన్ లను రద్దు చేసినప్పుడు ఎందుకు అడగలేదు ఈవీ బస్సులు 2018 లో స్టార్ట్ అయ్యాయి.. అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్..ముఖ్యమంత్రి లేఖ రాశారు.. ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టిసి ఉద్యోగి నీ కూడా తొలగించం .. దేశ వ్యాప్తంగా 14 వేల బస్సులు ఇస్తుండగా తెలంగాణ కి 2 వేల బస్సులు ఇస్తున్నారు.. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు తీసుకొస్తున్నారు.. ఆర్టీసీ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది.. బేషరతుగా సమ్మె విరమించండి.. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధం ఉన్నాం.. ప్రతిపక్ష పార్టీకి కావాల్సింది దోపిడీ మేము వచ్చిన తర్వాత 2800 బస్సులు కొనుగోలు చేశాం.. 2017 పీఆర్సీ ఇచ్చాం.. 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం.. సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వారికి 250 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.. మూడు సంవత్సరాల పిరియడ్ ను 2 సంవత్సరాలకు తగ్గించాం.. ఆర్టీసీ డిపో లు ఎవరి సొత్తు కాదు .. హైదరాబాద్ లో ఇబ్బందులు కలగకుండా ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులు ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పాం.. ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రి గా కోరుతున్న..మీ నిరసన ప్రజాస్వామికంగా ప్రభుత్వం గురించే విధంగా ఉండాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,హరీష్ రావు ఆర్టీసీ సమ్మె తో రాక్షసానందం పొందడం ,మహిళా ప్రయాణికులను ఇబ్బంది కలగజేయవద్దు.. తెలంగాణ అక్కా చెల్లలు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు.1