logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.వన మహోత్సవంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, గుండ్లపల్లి గ్రామంలో రహదారికిరువైపులా 800 మొక్కలు నాటగా, ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవం కింద జిల్లాలో ఈ సంవత్సరం 57 లక్షల 70000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇప్పటివరకు దాదాపు 60 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశామని,తక్కిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం వనమహోత్సవం కింద రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ,ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీలలో మొక్కలు నాటడం జరుగుతున్నదని, అన్ని ప్రభుత్వ సంస్థలు,ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, స్థలం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడ తుంపర వర్షాలు కురుస్తున్నందున దీన్ని సద్వినియోగం చేసుకొని మొక్కలు నాటాలని, జిల్లాకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కకు నిరంతరం నీరందించాలని, ఇందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని,అవసరమైతే విబిజీరామ్ జీ కింద వాచర్ ను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కలకు నీరు అందించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వినియోగించుకోవాలని చెప్పారు. గ్రామ సర్పంచ్ వి. రమేష్, డి ఎఫ్ ఓ రాజశేఖర్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి , జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్,ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీందర్, ఉపసర్పంచ్ జే .కే .సతీష్,మాజీ జెడ్పిటిసిలు, గుమ్మల మోహన్ రెడ్డి ,వంగురు లక్ష్మయ్య, కోదండపూర్ సర్పంచ్ రాణి వెంకన్న, ఎంపీడీవో యాకూబ్, తదితరులు ఉన్నారు.

9 hrs ago
user_Praneeth
Praneeth
చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
9 hrs ago
e158e586-b173-4ff7-b211-57482333d872

వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.వన మహోత్సవంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, గుండ్లపల్లి గ్రామంలో రహదారికిరువైపులా 800 మొక్కలు నాటగా, ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవం కింద జిల్లాలో ఈ సంవత్సరం 57 లక్షల 70000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇప్పటివరకు దాదాపు 60 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశామని,తక్కిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం వనమహోత్సవం కింద రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ,ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీలలో మొక్కలు నాటడం జరుగుతున్నదని, అన్ని ప్రభుత్వ సంస్థలు,ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, స్థలం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడ తుంపర వర్షాలు కురుస్తున్నందున దీన్ని సద్వినియోగం చేసుకొని మొక్కలు నాటాలని, జిల్లాకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కకు నిరంతరం నీరందించాలని, ఇందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని,అవసరమైతే విబిజీరామ్ జీ కింద వాచర్ ను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కలకు నీరు అందించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వినియోగించుకోవాలని చెప్పారు. గ్రామ సర్పంచ్ వి. రమేష్, డి ఎఫ్ ఓ రాజశేఖర్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి , జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్,ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీందర్, ఉపసర్పంచ్ జే .కే .సతీష్,మాజీ జెడ్పిటిసిలు, గుమ్మల మోహన్ రెడ్డి ,వంగురు లక్ష్మయ్య, కోదండపూర్ సర్పంచ్ రాణి వెంకన్న, ఎంపీడీవో యాకూబ్, తదితరులు ఉన్నారు.

More news from Nalgonda and nearby areas
  • స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    1
    స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ  మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    12 hrs ago
  • **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    2
    **విద్యార్థులలో  విద్య సామర్థ్యాలను
పెంపొందించాలి***
*- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి..
*- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
*- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..

*- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్.
విద్యార్థులలో  కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం  విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు.  ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో  పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని,  ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స  తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ  కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    9 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
వారి నిత్య ఆదాయ వివరాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం
వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం..................
గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    22 hrs ago
  • అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా... జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    1
    అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా...
జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    14 hrs ago
  • అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ
    1
    అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం

రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు

గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి

గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం

దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్

తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
    1
    పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.