logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా : ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విశేష పతకాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యకథాన్ లో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, క్రీడాకారులు,స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. *యువతలో సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని* అన్నారు. క్రీడల్లో పనితీరు,మెరుగుదల,శిక్షణ విధానాలు,ఫ్యాన్ ఎంగేజ్ మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులకు ఈ ఆవిష్కరణలు బాట వేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు అవని రెడ్డి మరియు ఆరాధ్య రెడ్డి *గోల్డ్ మెడల్* అండర్ 17 గర్ల్స్ డబుల్స్,2k రన్ మరియు కరాటె లో ధనుష్ కుమార్ అండర్ 14 లో *గోల్డ్ మెడల్*, శ్రీ వెంకట్ *సిల్వర్ మెడల్* అండర్ 9 boys సింగిల్స్,*జై ప్రీత్ మరియు జిశాన్ కాంస్య పతకం* అండర్ 13 boys డబుల్స్,*విష్ణు మరియు నియాన్ కాంస్య పతకం* అండర్ 15 boys డబుల్స్,చేతన *కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ సింగిల్స్,*అక్షర మరియు చేతన కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ డబుల్స్ లో విజయం సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు. అంతే కాకుండా జిల్లాలో క్రీడాకారులను వెలికి తీసి వారిని స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన (TITA) *తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్* నీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

కామారెడ్డి జిల్లా : ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విశేష పతకాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యకథాన్ లో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, క్రీడాకారులు,స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. *యువతలో సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని* అన్నారు. క్రీడల్లో పనితీరు,మెరుగుదల,శిక్షణ విధానాలు,ఫ్యాన్ ఎంగేజ్ మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులకు ఈ ఆవిష్కరణలు బాట వేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు అవని రెడ్డి మరియు ఆరాధ్య రెడ్డి *గోల్డ్ మెడల్* అండర్ 17 గర్ల్స్ డబుల్స్,2k రన్ మరియు కరాటె లో ధనుష్ కుమార్ అండర్ 14 లో *గోల్డ్ మెడల్*, శ్రీ వెంకట్ *సిల్వర్ మెడల్* అండర్ 9 boys సింగిల్స్,*జై ప్రీత్ మరియు జిశాన్ కాంస్య పతకం* అండర్ 13 boys డబుల్స్,*విష్ణు మరియు నియాన్ కాంస్య పతకం* అండర్ 15 boys డబుల్స్,చేతన *కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ సింగిల్స్,*అక్షర మరియు చేతన కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ డబుల్స్ లో విజయం సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు. అంతే కాకుండా జిల్లాలో క్రీడాకారులను వెలికి తీసి వారిని స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన (TITA) *తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్* నీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఫోల్ట్రీ కంపెనీలు చికెన్ దుకాణాల నిర్వాహకులకు తగ్గించిన కమిషన్ సరిచేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రం లో చికెన్ దుకాణాలను బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద చికెన్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చికెన్ వ్యాపారులకు కమిషన్ సరిపడ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల చేస్తున్న పౌల్ట్రీ కంపెనీ ఆగడాలకు చికెన్ వ్యాపారులు బలవుతున్నారని అన్నారు. లాభాలు లేక వ్యాపారాలు చేయలేని స్థితికి వెళ్తున్నామని అన్నారు. వెంటనే పౌల్ట్రీ కంపెనీ లు తమ కు తగ్గించిన కమిషన్ ను పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చికన్ వ్యాపారులు ఇందాద్, నర్సగౌడ్, ఇతియాజ్ అలీ, షఫీ, మురళీధర్ రావు, అనిల్, నాగరాజు, జిత్తు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఫోల్ట్రీ కంపెనీలు చికెన్ దుకాణాల నిర్వాహకులకు తగ్గించిన కమిషన్ సరిచేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రం లో చికెన్ దుకాణాలను బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద చికెన్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చికెన్ వ్యాపారులకు కమిషన్ సరిపడ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల చేస్తున్న పౌల్ట్రీ కంపెనీ ఆగడాలకు చికెన్ వ్యాపారులు బలవుతున్నారని అన్నారు. లాభాలు లేక వ్యాపారాలు చేయలేని స్థితికి వెళ్తున్నామని అన్నారు. వెంటనే పౌల్ట్రీ కంపెనీ లు తమ కు తగ్గించిన  కమిషన్ ను పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చికన్ వ్యాపారులు ఇందాద్, నర్సగౌడ్, ఇతియాజ్ అలీ, షఫీ, మురళీధర్ రావు, అనిల్, నాగరాజు, జిత్తు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దక్షిణ కాశిగా పేరుగాంచిన తెలంగాణ అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన డీఈఓగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దక్షిణ కాశిగా పేరుగాంచిన తెలంగాణ అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన డీఈఓగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    45 min ago
  • హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ ఈ మధ్యకాలంలో పదవీ విమరణ పొందారు. పెన్షన్ డబ్బుల కోసం పరిపాలన భవనం చుట్టూ తిరుగుతుండగా బిల్ సెక్షన్ లోని సీనియర్ అసిస్టెంట్ అయిన రమేష్ 15000 లంచం అడిగాడు. దానితో బాధితులు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. దీంతో రంగంలో ఏసిబి అధికారులు. ఇద్దరు పైన నిగ వేశారు. బాధితులు తాను 15000 ఇవ్వలేను అని చెప్పగా మరొక సీనియర్ అసిస్టెంట్ అరవింద్ మధ్యవర్తిగా వచ్చి 13,000 కు లంచం కుదుర్చుకొని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఓయూ బస్టాప్ వద్ద బాధితుల దగ్గర నుండి 13,000 తీసుకొని ఓయూ పరిపాలన భవనం వచ్చాడు. పరిపాలన భవనం సెక్షన్ లోకి రాగానే ఏసీబీ అధికారి అరవింద్ మరియు రమేష్ లోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫైల్ కోసం సోదాలు నిర్వహించారు అనంతరం రమేష్ అరవింద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు రేపు ఉదయం కోర్ట్ లో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ పరిపాల భవనంలోనే ఉన్నారు.
    2
    హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ ఈ మధ్యకాలంలో పదవీ విమరణ  పొందారు. పెన్షన్ డబ్బుల కోసం పరిపాలన భవనం చుట్టూ తిరుగుతుండగా బిల్ సెక్షన్ లోని సీనియర్ అసిస్టెంట్ అయిన రమేష్ 15000 లంచం అడిగాడు. దానితో బాధితులు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. దీంతో రంగంలో ఏసిబి అధికారులు. ఇద్దరు పైన నిగ వేశారు. బాధితులు తాను 15000 ఇవ్వలేను అని చెప్పగా మరొక సీనియర్ అసిస్టెంట్ అరవింద్  మధ్యవర్తిగా వచ్చి 13,000 కు లంచం కుదుర్చుకొని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఓయూ బస్టాప్ వద్ద బాధితుల దగ్గర నుండి 13,000 తీసుకొని ఓయూ పరిపాలన భవనం వచ్చాడు. పరిపాలన భవనం సెక్షన్ లోకి రాగానే ఏసీబీ అధికారి అరవింద్ మరియు రమేష్ లోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫైల్ కోసం సోదాలు నిర్వహించారు అనంతరం రమేష్ అరవింద్  లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు రేపు ఉదయం కోర్ట్ లో హాజరు పరుస్తామని  ఏసీబీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ పరిపాల భవనంలోనే ఉన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    54 min ago
  • జగిత్యాల జిల్లాలో అకాల వర్షం వడగళ్ల వానతో పంట నష్టాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. సారంగాపూర్ మండలం అర్పపల్లి , పెంబట్ల గ్రామంలో అకాల వర్షంతో నెలకొరిగిన మొక్కజొన్న, నువ్వుల పంటలను లక్ష్మీదేవిపల్లెలో రవి నాయక్ బీరకాయ తోటను రైతులతో కలిసి పరిశీలించారు. అక్కడినుంచే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జీవన్ రెడ్డి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాలో అకాల వర్షంతో జగిత్యాల నియోజకవర్గంతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. జన్మదిన కానుకగా రైతులు ఎవరు అధైర్యాపడొద్దు అని ప్రకటన చేసి కలెక్టర్ తో నివేదిక తెప్పించుకొని ప్రభుత్వ పరంగా త్వరగా పరిహారం అందేలా చూడాలని కోరారు. పంటల బీమా పథకం అమలు చేస్తే కొంత రైతుకు ఊరట కలుగుతుండేనని ప్రభుత్వం వెంటనే పంటల బీమా పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకున్నప్పుడే రైతాంగం పై ఆధారపడి ఉన్న రైతు కూలీలకు ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతామని తెలిపారు. పంటల పెట్టుబడి రైతు భరోసా రైతుకు కల్పింపచేయటంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందన లేకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
    4
    జగిత్యాల జిల్లాలో అకాల వర్షం వడగళ్ల వానతో పంట నష్టాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. సారంగాపూర్ మండలం అర్పపల్లి , పెంబట్ల గ్రామంలో అకాల వర్షంతో  నెలకొరిగిన మొక్కజొన్న, నువ్వుల పంటలను లక్ష్మీదేవిపల్లెలో రవి నాయక్ బీరకాయ తోటను రైతులతో కలిసి పరిశీలించారు. అక్కడినుంచే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జీవన్ రెడ్డి  ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాలో అకాల వర్షంతో జగిత్యాల నియోజకవర్గంతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. జన్మదిన కానుకగా రైతులు ఎవరు అధైర్యాపడొద్దు అని ప్రకటన చేసి కలెక్టర్ తో నివేదిక తెప్పించుకొని ప్రభుత్వ పరంగా త్వరగా పరిహారం అందేలా చూడాలని కోరారు. పంటల బీమా పథకం అమలు చేస్తే కొంత రైతుకు ఊరట కలుగుతుండేనని ప్రభుత్వం వెంటనే పంటల బీమా పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకున్నప్పుడే రైతాంగం పై ఆధారపడి ఉన్న రైతు కూలీలకు ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతామని తెలిపారు. పంటల పెట్టుబడి రైతు భరోసా రైతుకు కల్పింపచేయటంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందన లేకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ / (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    3
    సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ /
(హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ...
కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ....
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో  ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • వికారాబాద్, పరిగి : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిగి మండల కేంద్రంలో మెరుపు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా అక్రమంగా నిలువ ఉంచిన 12 సిలిండర్లను స్వాధీనం చేసుకొని, మమ్మల్ని కలగానే వ్యక్తి కూలిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి దానిని సీజ్ చేశారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా గరువు గరువు ముగిసిన ముడుసరుకులు పారిశ్రామిక రంగులు ఉపయోగించి తయారు చేస్తున్న నిత్య ఐస్క్రీమ్ యూనిట్ పై దాడి చేసి కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు నిలువ ఉంచడం చట్టరీత్యా నీరమని వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు నాణ్యత పై అధికారులు మరింత కఠినంగా ఉంచుతున్నారని ఇలాంటి చట్ట వివిధ కార్యక్రమాలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని హెచ్చరించారు
    1
    వికారాబాద్, పరిగి : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిగి మండల కేంద్రంలో మెరుపు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా అక్రమంగా నిలువ ఉంచిన 12 సిలిండర్లను స్వాధీనం చేసుకొని, మమ్మల్ని కలగానే వ్యక్తి కూలిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి దానిని సీజ్ చేశారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా గరువు గరువు ముగిసిన ముడుసరుకులు పారిశ్రామిక రంగులు ఉపయోగించి తయారు చేస్తున్న నిత్య ఐస్క్రీమ్ యూనిట్ పై దాడి చేసి కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు నిలువ ఉంచడం చట్టరీత్యా నీరమని వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు నాణ్యత పై అధికారులు మరింత కఠినంగా ఉంచుతున్నారని ఇలాంటి చట్ట వివిధ కార్యక్రమాలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని హెచ్చరించారు
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    3 hrs ago
  • కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్, మల్లేశం బుధవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో కేంద్రం లేక సర్టిఫికెట్ల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి వెంటనే మీసేవ మంజూరు చేయాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్, మల్లేశం బుధవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో కేంద్రం లేక సర్టిఫికెట్ల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి వెంటనే మీసేవ మంజూరు చేయాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రామీణ ప్రజలు మూఢనమ్మకాలను తేలుతున్నారు. వరస మరణాలతో గ్రామానికి కీడు సోకిందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామస్థులు ఊరు బయట వంట వార్పుతో రోజంతా గడిపారు. గత రెండు ,మూడు నెలల నుండి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామ పురోహితున్ని సంప్రదించగా గ్రామానికి కీడు సోకిందని సెలవిచ్చాడట. ఇంకేముంది గ్రామం లో ఉన్న ప్రజలు ఒక రోజు ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్ళాలని సూచించారు. అయితే ఒక రోజు ముందు గ్రామం లో డప్పు చాటింపు చేశారు. ఈరోజు తెల్లవారుఝామున ఇండ్లకు తాళాలు వేసి కీడు వంటలకు వెళ్ళారు. ఊరు బయట వంటావార్పు తో విందు భోజనాలు ఆరగించి రోజంతా గడిపారు. సూర్యోదయాన్ని కంటే ముందే బయటికి వెళ్లిన గ్రామస్తులు సూర్యాస్తమయం అయ్యాక ఇళ్లకు చేరారు. కీడు వంటలకు వెళ్తతామని చెప్పినప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగాయని అంటున్నారు.
    1
    సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రామీణ ప్రజలు మూఢనమ్మకాలను తేలుతున్నారు. వరస మరణాలతో గ్రామానికి కీడు సోకిందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్  గ్రామస్థులు ఊరు బయట వంట వార్పుతో రోజంతా గడిపారు. గత రెండు ,మూడు నెలల నుండి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామ పురోహితున్ని సంప్రదించగా గ్రామానికి కీడు సోకిందని సెలవిచ్చాడట. ఇంకేముంది గ్రామం లో ఉన్న ప్రజలు ఒక రోజు ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్ళాలని సూచించారు. అయితే ఒక రోజు ముందు గ్రామం లో డప్పు చాటింపు చేశారు. ఈరోజు తెల్లవారుఝామున ఇండ్లకు తాళాలు వేసి కీడు వంటలకు వెళ్ళారు. ఊరు బయట వంటావార్పు తో విందు భోజనాలు  ఆరగించి రోజంతా గడిపారు. సూర్యోదయాన్ని కంటే ముందే బయటికి వెళ్లిన గ్రామస్తులు సూర్యాస్తమయం అయ్యాక ఇళ్లకు చేరారు. కీడు వంటలకు వెళ్తతామని చెప్పినప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగాయని అంటున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం మండలాల్లో బుధవారం మ.3 గంటలకు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే లక్షెట్టిపేటలో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. అన్ని మండలాల్లో ఒకవైపు మబ్బు వాతావరణం ఉంటున్న ఎండ తీవ్రత కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం మండలాల్లో బుధవారం మ.3 గంటలకు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే లక్షెట్టిపేటలో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. అన్ని మండలాల్లో ఒకవైపు మబ్బు వాతావరణం ఉంటున్న ఎండ తీవ్రత కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.