logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా : కాచాపూర్ గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన శ్రీనివాస్ గౌడ్ మల్లేశం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్, మల్లేశం బుధవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో కేంద్రం లేక సర్టిఫికెట్ల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి వెంటనే మీసేవ మంజూరు చేయాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

5 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
5 hrs ago

కామారెడ్డి జిల్లా : కాచాపూర్ గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన శ్రీనివాస్ గౌడ్ మల్లేశం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్, మల్లేశం బుధవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో కేంద్రం లేక సర్టిఫికెట్ల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి వెంటనే మీసేవ మంజూరు చేయాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లా : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విశేష పతకాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యకథాన్ లో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, క్రీడాకారులు,స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. *యువతలో సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని* అన్నారు. క్రీడల్లో పనితీరు,మెరుగుదల,శిక్షణ విధానాలు,ఫ్యాన్ ఎంగేజ్ మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులకు ఈ ఆవిష్కరణలు బాట వేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు అవని రెడ్డి మరియు ఆరాధ్య రెడ్డి *గోల్డ్ మెడల్* అండర్ 17 గర్ల్స్ డబుల్స్,2k రన్ మరియు కరాటె లో ధనుష్ కుమార్ అండర్ 14 లో *గోల్డ్ మెడల్*, శ్రీ వెంకట్ *సిల్వర్ మెడల్* అండర్ 9 boys సింగిల్స్,*జై ప్రీత్ మరియు జిశాన్ కాంస్య పతకం* అండర్ 13 boys డబుల్స్,*విష్ణు మరియు నియాన్ కాంస్య పతకం* అండర్ 15 boys డబుల్స్,చేతన *కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ సింగిల్స్,*అక్షర మరియు చేతన కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ డబుల్స్ లో విజయం సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు. అంతే కాకుండా జిల్లాలో క్రీడాకారులను వెలికి తీసి వారిని స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన (TITA) *తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్* నీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విశేష పతకాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* అభినందించారు.
గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యకథాన్ లో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, క్రీడాకారులు,స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. *యువతలో సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని* అన్నారు. క్రీడల్లో పనితీరు,మెరుగుదల,శిక్షణ విధానాలు,ఫ్యాన్ ఎంగేజ్ మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులకు ఈ ఆవిష్కరణలు బాట వేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గెలుపొందిన షటిల్  బ్యాట్మెంటన్ క్రీడాకారులు అవని రెడ్డి మరియు ఆరాధ్య రెడ్డి *గోల్డ్ మెడల్* అండర్ 17 గర్ల్స్ డబుల్స్,2k రన్ మరియు కరాటె లో ధనుష్ కుమార్ అండర్ 14 లో  *గోల్డ్ మెడల్*, శ్రీ వెంకట్ *సిల్వర్ మెడల్* అండర్ 9 boys సింగిల్స్,*జై ప్రీత్ మరియు జిశాన్ కాంస్య పతకం* అండర్ 13 boys డబుల్స్,*విష్ణు మరియు నియాన్ కాంస్య పతకం* అండర్ 15 boys డబుల్స్,చేతన *కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ సింగిల్స్,*అక్షర మరియు చేతన కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ డబుల్స్ లో విజయం సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు.
అంతే కాకుండా జిల్లాలో క్రీడాకారులను వెలికి తీసి వారిని స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన (TITA) *తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్* నీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, గ్రోస్ స్వచ్ఛంద సంస్థ సేవలు ఎనలేనివని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. మెదక్ పట్టణంలో గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొని, పేదలకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు సహాయ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంపత్, స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి జాయ్ ముర్రే పాల్గొన్నారు
    1
    పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, గ్రోస్ స్వచ్ఛంద సంస్థ సేవలు ఎనలేనివని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. మెదక్ పట్టణంలో గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొని, పేదలకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు సహాయ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంపత్, స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి జాయ్ ముర్రే పాల్గొన్నారు
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలోతేది: 01-04-2025 (బుధవారం) రోజున పదవీ విరమణ పొందుతున్న మరియు బదిలీ అయిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
    1
    శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలోతేది: 01-04-2025 (బుధవారం) రోజున పదవీ విరమణ పొందుతున్న మరియు బదిలీ అయిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    4
    *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి*
కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ 
కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్  ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    user_దయా మదన్
    దయా మదన్
    Metpalli, Jagitial•
    14 hrs ago
  • లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సంగారెడ్డిలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
    1
    లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సంగారెడ్డిలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.
    5
    ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాసవి గార్డెన్ సమీపంలో కుక్కల దాడితో ముగ్గురు గాయపడ్డారు. కుక్కల బెడద తో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన పరువురిని గాయపరచడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం ఆడుకుంటున్న ఓ బాలుడి పై దాడి చేసిన కుక్కలు.. మధ్యాహ్నం సమయంలో అదే బాధితుడి తాత పై దాడి చేసి గాయపరిచింది. ఆ బాలుడిని నెల రోజుల్లో కుక్కలు కరవడం రెండోసారి. అక్కడితో ఆగకుండా, మరో చిన్నారిని, అతని కుటుంబీకులను కూడా కుక్కలు వేటాడి కరిచాయి.​ వరుస ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
    1
    జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాసవి గార్డెన్ సమీపంలో కుక్కల దాడితో ముగ్గురు గాయపడ్డారు. కుక్కల బెడద తో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన పరువురిని గాయపరచడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం ఆడుకుంటున్న ఓ బాలుడి పై దాడి చేసిన కుక్కలు.. మధ్యాహ్నం సమయంలో అదే బాధితుడి తాత పై దాడి చేసి గాయపరిచింది. ఆ బాలుడిని నెల రోజుల్లో కుక్కలు కరవడం రెండోసారి. అక్కడితో ఆగకుండా, మరో చిన్నారిని, అతని కుటుంబీకులను కూడా కుక్కలు వేటాడి కరిచాయి.​ వరుస ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • పత్రిక ప్రకటన. తేది:01.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం. .. ఓటర్ జాబితా ప్రత్యేక సమీక్ష (SIR–2025) కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య సూచనలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన బుధవారం మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో SIR–2025 ప్రక్రియలో భాగంగా ఓటర్ల వర్గీకరణ, నమోదు, ధృవీకరణ చర్యలను సమగ్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించినట్లు వివరించారు: Category–A: 2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, వయస్సు 39 సంవత్సరాల పైబడిన వారు మరియు 2002 ఓటర్ జాబితాలో కూడా నమోదు ఉన్న వ్యక్తులు. Category–B: 2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, వయస్సు 39 సంవత్సరాల పైబడిన వారు అయితే 2002 ఓటర్ జాబితాలో నమోదు లేని వ్యక్తులు. Category–C: 2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, 21 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు. Category–D: 2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ ఓటర్లు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వర్గానికి చెందిన ఓటర్ల వివరాలను ఖచ్చితంగా సేకరించి, ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ జాబితాను నవీకరించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. డూప్లికేట్ నమోదు, మరణించిన వారి పేర్లు, చిరునామా మార్పులు వంటి అంశాలను గుర్తించి సరిచేయాలని సూచించారు. అంతేకాకుండా, రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు)ను తప్పనిసరిగా నియమించాలని, వారితో సమన్వయం చేసుకుంటూ ఓటర్ జాబితా పరిశీలన, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద BLAలు చురుకుగా పనిచేయడం ద్వారా తప్పులు తగ్గి, ఖచ్చితమైన ఓటర్ జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించడంలో రాజకీయ పార్టీల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
    1
    పత్రిక ప్రకటన. తేది:01.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం.                         ..
ఓటర్ జాబితా ప్రత్యేక సమీక్ష (SIR–2025) కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య సూచనలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన బుధవారం మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో SIR–2025 ప్రక్రియలో భాగంగా ఓటర్ల వర్గీకరణ, నమోదు, ధృవీకరణ చర్యలను సమగ్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓటర్లను నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించినట్లు వివరించారు:
Category–A:
2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, వయస్సు 39 సంవత్సరాల పైబడిన వారు మరియు 2002 ఓటర్ జాబితాలో కూడా నమోదు ఉన్న వ్యక్తులు.
Category–B:
2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, వయస్సు 39 సంవత్సరాల పైబడిన వారు అయితే 2002 ఓటర్ జాబితాలో నమోదు లేని వ్యక్తులు.
Category–C:
2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, 21 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు.
Category–D:
2025 సంవత్సరపు ఓటర్ జాబితాలో నమోదై, 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ ఓటర్లు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వర్గానికి చెందిన ఓటర్ల వివరాలను ఖచ్చితంగా సేకరించి, ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ జాబితాను నవీకరించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. డూప్లికేట్ నమోదు, మరణించిన వారి పేర్లు, చిరునామా మార్పులు వంటి అంశాలను గుర్తించి సరిచేయాలని సూచించారు.
అంతేకాకుండా, రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు)ను తప్పనిసరిగా నియమించాలని, వారితో సమన్వయం చేసుకుంటూ ఓటర్ జాబితా పరిశీలన, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద BLAలు చురుకుగా పనిచేయడం ద్వారా తప్పులు తగ్గి, ఖచ్చితమైన ఓటర్ జాబితా సిద్ధమవుతుందని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించడంలో రాజకీయ పార్టీల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.