logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీ చేసిన...నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్. నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఐఏఎస్ శనివారం నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అందిస్తున్న సేవలు,రిజిస్ట్రేషన్ ప్రక్రియ,పత్రాల నిర్వహణతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన డిజిటల్ సేవల పనితీరును నిశితంగా పరిశీలించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయసిబ్బందికి సూచించారు.అనంతరం కార్యాలయంలో అమలవుతున్న ఆన్‌లైన్ సేవలు,పౌరులకు కల్పిస్తున్న సౌకర్యాలు,రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలపై అధికారులను అడిగి తెలుసుకొని,రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు,మార్గదర్శకాల ప్రకారమే ప్రతి సేవను పారదర్శకంగా నిర్వహించాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం,నిర్లక్ష్యం లేదా నిబంధనలకు విరుద్ధంగా జరిగే చర్యలు ఏవైనా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలీకరించడం ద్వారా అవినీతి,జాప్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు సులభమైన,పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ తనిఖీలలో సబ్ రిజిస్టర్ అజిమియా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

2 hrs ago
user_D. శ్రీధర్ బాబు
D. శ్రీధర్ బాబు
Local News Reporter Gadivemula, Nandyal•
2 hrs ago
88df634b-d51d-4484-9821-d45ac36caedf

సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీ చేసిన...నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్. నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఐఏఎస్ శనివారం నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అందిస్తున్న సేవలు,రిజిస్ట్రేషన్ ప్రక్రియ,పత్రాల నిర్వహణతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన డిజిటల్ సేవల పనితీరును నిశితంగా పరిశీలించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయసిబ్బందికి సూచించారు.అనంతరం కార్యాలయంలో అమలవుతున్న ఆన్‌లైన్ సేవలు,పౌరులకు కల్పిస్తున్న సౌకర్యాలు,రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలపై అధికారులను అడిగి తెలుసుకొని,రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు,మార్గదర్శకాల ప్రకారమే ప్రతి సేవను పారదర్శకంగా నిర్వహించాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం,నిర్లక్ష్యం లేదా నిబంధనలకు విరుద్ధంగా జరిగే చర్యలు ఏవైనా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలీకరించడం ద్వారా అవినీతి,జాప్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు సులభమైన,పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ తనిఖీలలో సబ్ రిజిస్టర్ అజిమియా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు
    1
    వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు
జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.
    1
    జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి  కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు

కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు  రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో  ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి  వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు.
తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం  పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పలుకూరు విద్యార్థులకు నగదు పురస్కారాలు బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనిపించిన సాయి దీపిక ఎస్ చంద్ర హసన్ 1200 ప్రకారం 3600 ఇవ్వడం జరిగినది అలాగే అచ్చిత రేష్మ చరిత కమ్మరి శరణ్య అనే విద్యార్థులకు ₹1000 ప్రకారం 3000 రూపాయలు నగదు పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్య యొక్క విశిష్టత పై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందప్ప పరమేశ్వరుడు కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హెచ్ఎం గౌరీ శంకర్ ను బ్రహ్మానంద చారి ఘనంగా సన్మానించి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    2
    పలుకూరు విద్యార్థులకు నగదు పురస్కారాలు బ్రహ్మానంద చారి 
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు  జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనిపించిన సాయి దీపిక ఎస్ చంద్ర హసన్ 1200 ప్రకారం 3600 ఇవ్వడం జరిగినది అలాగే అచ్చిత రేష్మ చరిత కమ్మరి శరణ్య అనే విద్యార్థులకు ₹1000 ప్రకారం 3000 రూపాయలు నగదు పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్య యొక్క విశిష్టత పై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందప్ప పరమేశ్వరుడు కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హెచ్ఎం గౌరీ శంకర్ ను బ్రహ్మానంద చారి ఘనంగా సన్మానించి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ​పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: ​టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.​15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ​పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ​నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ​సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.​ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ​పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. 
ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.
​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ:
​టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.​15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ​పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
​నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
​సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల:  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.​ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు, ఆగస్టు 01:
స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు.  బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు.  స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు.  ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు
    1
    ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం
ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు
    user_Palla  karunakar
    Palla karunakar
    Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
    8 hrs ago
  • ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    1
    ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం.. నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని,ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి "నివృత్తి సంగమేశ్వరాలయం" గా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించగా, ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాకపోవడంతో,రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు.దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు.భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి,భీమలింగంగా దానికి పేరు పెట్టాడు.భక్తులు భీమలింగాన్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని స్థల పురాణం చెప్తోంది.ఈ ఆలయం శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది.2003 తరువాత శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేక వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన "వేపదారులింగం" ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ,భద్ర,కృష్ణ,వేణి,భీమ,మలాపహరిణి,భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరమని పిలుస్తున్నారు.ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడు పేరున్న నది,మిగిలినవన్నీ స్త్రీల పేర్లున్న నదులే.భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.నంద్యాల జిల్లాలోని నందికోట్కూరు,ఆత్మకూరు మండలాల మీదుగా బస్సులు,ఆటోలు,జీపులలో సంగమేశ్వరానికి చేరుకోవచ్చు.
    1
    ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం.. నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం.
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని,ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి "నివృత్తి సంగమేశ్వరాలయం" గా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించగా, ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాకపోవడంతో,రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు.దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు.భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి,భీమలింగంగా దానికి పేరు పెట్టాడు.భక్తులు భీమలింగాన్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని స్థల పురాణం చెప్తోంది.ఈ ఆలయం శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది.2003 తరువాత శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేక వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన "వేపదారులింగం" ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ,భద్ర,కృష్ణ,వేణి,భీమ,మలాపహరిణి,భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరమని పిలుస్తున్నారు.ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడు పేరున్న నది,మిగిలినవన్నీ స్త్రీల పేర్లున్న నదులే.భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.నంద్యాల జిల్లాలోని నందికోట్కూరు,ఆత్మకూరు మండలాల మీదుగా బస్సులు,ఆటోలు,జీపులలో సంగమేశ్వరానికి చేరుకోవచ్చు.
    user_D. శ్రీధర్ బాబు
    D. శ్రీధర్ బాబు
    Local News Reporter Gadivemula, Nandyal•
    37 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.