కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ నిరసన...కోతులు, కుక్కల బెడద నివారించి డంప్ యార్డు సమస్య పరిష్కరించాలని ప్ల కార్డులతో ఆందోళన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్ లో కోతుల, కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ ఫ్లకార్డుతో నిరసన తెలుపుతు సమావేశానికి హాజరయ్యారు. నగరంలో అక్రమ కట్టడాలతో పాటు డంపింగ్ యార్డు సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నిరసన ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కార్పోరేటర్ లు అంజన్ కుమార్, రాజేందర్, కవిత బుచ్చిరెడ్డి, ఆకుల నందిని, భాస్కర్ నాయక్, పడిశెట్టి భూమయ్య పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిరసన ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందని కార్పొరేటర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ తెలిపారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ నిరసన...కోతులు, కుక్కల బెడద నివారించి డంప్ యార్డు సమస్య పరిష్కరించాలని ప్ల కార్డులతో ఆందోళన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్ లో కోతుల, కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ ఫ్లకార్డుతో నిరసన తెలుపుతు సమావేశానికి హాజరయ్యారు. నగరంలో అక్రమ కట్టడాలతో పాటు డంపింగ్ యార్డు సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నిరసన ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కార్పోరేటర్ లు అంజన్ కుమార్, రాజేందర్, కవిత బుచ్చిరెడ్డి, ఆకుల నందిని, భాస్కర్ నాయక్, పడిశెట్టి భూమయ్య పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిరసన ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందని కార్పొరేటర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ తెలిపారు.
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.2
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మార్చి 31. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇందుప్రియల్ గ్రామంలో శ్రీ సీతారామ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి మరియు గ్రామస్తులు అంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించారు. PACS చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మరియు గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మాట్లాడుతూ ఐదు రోజులుగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవం విజయవంతంగా జరిపించినందుకు గ్రామస్తులకు మరియు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు4
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిరసనలు ఆందోళనల మధ్య కొనసాగింది. కాంగ్రెస్ సభ్యులు పలు సమస్యలు ప్రస్తావిస్తూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ సమావేశానికి హాజరయ్యారు. బిజెపికి చెందిన కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి సైకిల్ పై సమావేశానికి హాజరయ్యారు. నగరంలో మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదామనే ప్ల కార్డు తో సైకిల్ పై సమావేశానికి హాజరయ్యారు. కాంక్రీట్ జంగల్ గా మారిన నగరంలో విరివిగా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సైకిల్ పై సమావేశానికి వచ్చినట్లు సత్యనారాయణరెడ్డి తెలిపారు.1