logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్ ఉన్ నబి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన బుద్ధ ప్రసాద్ మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని స్మరించుకుంటూ జరుపుకునే మిలాద్ ఉన్ నబి పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, మానవతా విలువలు, సమాజ సేవ వంటి గొప్ప సందేశాలను మనకు అందిస్తుందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ బోధనలు న్యాయం, సమానత్వం, దయ, సహనం, పరస్పర గౌరవం, శాంతి వంటి విలువలను ప్రతి ఒక్కరిలో పెంపొందించేలా మార్గ నిర్దేశం చేస్తాయని అన్నారు. ఈ విలువలను మన జీవితాల్లో ఆచరించడం ద్వారా సమాజంలో ప్రేమ, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, ప్రతి హృదయంలో శాంతిని నింపాలని, ప్రజల మధ్య పరస్పర విశ్వాసం, ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్రము లోని ప్రజలందరూ మత సామరస్యాన్ని, శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

6 hrs ago
user_దాసరి నటరాజు
దాసరి నటరాజు
ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
58683a1b-cfd7-42c7-9dda-9424dd1184dd

ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్ ఉన్ నబి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన బుద్ధ ప్రసాద్ మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని స్మరించుకుంటూ జరుపుకునే మిలాద్ ఉన్ నబి పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, మానవతా విలువలు, సమాజ సేవ వంటి గొప్ప సందేశాలను మనకు అందిస్తుందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ బోధనలు న్యాయం, సమానత్వం, దయ, సహనం, పరస్పర గౌరవం, శాంతి వంటి విలువలను ప్రతి ఒక్కరిలో పెంపొందించేలా మార్గ నిర్దేశం చేస్తాయని అన్నారు. ఈ విలువలను మన జీవితాల్లో ఆచరించడం ద్వారా సమాజంలో ప్రేమ, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, ప్రతి హృదయంలో శాంతిని నింపాలని, ప్రజల మధ్య పరస్పర విశ్వాసం, ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్రము లోని ప్రజలందరూ మత సామరస్యాన్ని, శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి  దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఆర్ డబ్ల్యూ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన గుంటూరు జిల్లా మంగళగిరి.. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలి.. మా అసోసియేషన్ లో ఆరుగురు తో కమిటీ వేసి బకాయిలు విడుదల చేపిస్తామన్నారు ఇంతవరకు నెరవేరలేదు.. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా కోసం పనులు చేసాము.. 2024 నవంబర్ నుంచి ఇప్పటివరకు మా నిధులు ఇంతవరకు చెల్లించలేదు.. ఈ విషయంపై కాంట్రాక్టర్లు ధర్నాలు వినతి పత్రాలు ద్వారా తెలియజేశాము.. పవన్ కళ్యాణ్ కొత్త ప్లాట్ ఫామ్ లోకి బిల్లులు అప్లోడ్ చేయించుకుంటే పాత బకాయిలు సత్వరమే చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.. 2026 జులై నాటికి దాదాపు 90 శాతం నుండి 95 శాతం వరకు తప్పకుండా కొత్త సిస్టంలో అప్లోడ్ చేయాలి.. ప్రస్తుతం ఫిట్టింగ్ బకాయి ఉన్న నాలుగువేల 133 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. మా సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటాము అంటూ తెలియజేశారు..
    2
    ఆర్ డబ్ల్యూ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన 
గుంటూరు జిల్లా మంగళగిరి..
ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలి..
మా అసోసియేషన్ లో ఆరుగురు తో కమిటీ వేసి బకాయిలు విడుదల చేపిస్తామన్నారు ఇంతవరకు నెరవేరలేదు..
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెల్  జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా కోసం పనులు చేసాము..
2024 నవంబర్ నుంచి ఇప్పటివరకు మా నిధులు ఇంతవరకు చెల్లించలేదు..
ఈ విషయంపై కాంట్రాక్టర్లు ధర్నాలు వినతి పత్రాలు ద్వారా తెలియజేశాము..
పవన్ కళ్యాణ్ కొత్త ప్లాట్ ఫామ్ లోకి బిల్లులు అప్లోడ్ చేయించుకుంటే పాత బకాయిలు సత్వరమే చెల్లిస్తామని భరోసా ఇచ్చారు..
2026 జులై నాటికి దాదాపు 90 శాతం నుండి 95 శాతం వరకు తప్పకుండా కొత్త సిస్టంలో అప్లోడ్ చేయాలి..
ప్రస్తుతం ఫిట్టింగ్ బకాయి ఉన్న నాలుగువేల 133 కోట్ల రూపాయలు విడుదల చేయాలి.
మా సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటాము అంటూ తెలియజేశారు..
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    1
    ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం
మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    1 hr ago
  • అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా...
బస్సులో 80 మంది.. 🚍
ఇద్దరే పురుషులు.. 
కండక్టర్ వీడియో వైరల్

TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    2
    సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • Writing హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    1
    Writing
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    1
    *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర  బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి*
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.