logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దాచారం అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య.దాచారం రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడి కేంద్రాలను భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహార కార్యక్రమాలు, చిన్నారుల ఆరోగ్యం, ప్రాథమిక విద్య వంటి అంశాలను ఆమె పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, పోషకాహార పథకాల గురించి అంగన్వాడి సిబ్బందికి మరియు స్థానికులకు వివరించారు. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, విద్యాభివృద్ధికి ఎంతో కీలకమైనవని మారవేణి దివ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం దాచారం గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాల అంగన్వాడి టీచర్లు, ఆయాలను మారవేణి దివ్య శాలువాలతో సత్కరించి అభినందించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మొదటి అంగన్వాడి సెంటర్ గౌరవేణి ముతవ్వ ,రెండవ అంగన్వాడి సెంటర్ కొడిముంజా అరుణ ఆయా నరిగే గౌరవ్వ, అంగన్వాడి కేంద్రాల సిబ్బంది. అల్వాల భారతి, బర్ల బాబాయి, నరిగె వర్షిణి మరియు తదుపరి గ్రామానికి చెందిన పిల్లల తల్లిదండ్రులందరూ పాల్గొన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

4 hrs ago
user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
Bollam Saireddy జయం న్యూస్ మీడ
Interior designer Manakondur, Karimnagar•
4 hrs ago
6ba14b78-420f-4021-9296-2d8ff9c25213

దాచారం అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య.దాచారం రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడి కేంద్రాలను భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహార కార్యక్రమాలు, చిన్నారుల ఆరోగ్యం, ప్రాథమిక విద్య వంటి అంశాలను ఆమె పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, పోషకాహార పథకాల గురించి అంగన్వాడి సిబ్బందికి మరియు స్థానికులకు వివరించారు. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, విద్యాభివృద్ధికి ఎంతో కీలకమైనవని మారవేణి దివ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం దాచారం గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాల అంగన్వాడి టీచర్లు, ఆయాలను మారవేణి దివ్య శాలువాలతో సత్కరించి అభినందించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మొదటి అంగన్వాడి సెంటర్ గౌరవేణి ముతవ్వ ,రెండవ అంగన్వాడి సెంటర్ కొడిముంజా అరుణ ఆయా నరిగే గౌరవ్వ, అంగన్వాడి కేంద్రాల సిబ్బంది. అల్వాల భారతి, బర్ల బాబాయి, నరిగె వర్షిణి మరియు తదుపరి గ్రామానికి చెందిన పిల్లల తల్లిదండ్రులందరూ పాల్గొన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి! హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.
    1
    కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌ మాట్లాడుతూ..
హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి!
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు.
ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    25 min ago
  • కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.
    1
    కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు.‌ కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
    1
    నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన
గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ  సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు.‌ కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 min ago
  • వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.
    3
    వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు.
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు.
వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు  కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి.
కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల 50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
    1
    సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల

50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి  ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    14 min ago
  • 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]
    1
    𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]
    user_𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    Tour operator Hanamkonda, Hanumakonda•
    18 hrs ago
  • అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని MRPS, నాయకులు దళిత సంఘాలు మరియు 1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ గోదావరిఖని, సెప్టెంబర్ 14 (జన తెలంగాణ ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్): GDK-2 ఇన్క్లైన్‌లో శిక్షణార్థిగా పనిచేస్తున్న తాండ్ర అక్షిత రాణి తనపై అత్యాచారం జరిగిందని సూసైడ్ నోట్‌లో పేర్కొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని MRPS, దళిత సంఘాలు మరియు 1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ పులి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికెల కృష్ణ, సెంట్రల్ నాయకుడు ఆరెపల్లి రామచందర్, సెంట్రల్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపల్లి రాజేష్ కుమార్ MRPS,నాయకులు దళిత సంఘాలతో పాటు పలువురు నాయకులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. “అక్షిత రాణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. బాధ్యులను చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని MRPS,నాయకులు అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.
    1
    అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని  MRPS, నాయకులు దళిత సంఘాలు మరియు 1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
గోదావరిఖని, సెప్టెంబర్ 14 (జన తెలంగాణ ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్):
GDK-2 ఇన్క్లైన్‌లో శిక్షణార్థిగా పనిచేస్తున్న తాండ్ర అక్షిత రాణి తనపై అత్యాచారం జరిగిందని సూసైడ్ నోట్‌లో పేర్కొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని  MRPS, దళిత సంఘాలు మరియు  1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ పులి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని  విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికెల కృష్ణ, సెంట్రల్ నాయకుడు ఆరెపల్లి రామచందర్, సెంట్రల్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపల్లి రాజేష్ కుమార్   MRPS,నాయకులు దళిత సంఘాలతో పాటు పలువురు నాయకులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
“అక్షిత రాణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. బాధ్యులను చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని MRPS,నాయకులు అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.
    user_RAJESH KUMAR (GODsSON)
    RAJESH KUMAR (GODsSON)
    Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    22 hrs ago
  • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    3
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు.
ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు.
అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.