Shuru
Apke Nagar Ki App…
SS NEWS
More news from తెలంగాణ and nearby areas
- ప్రజాప్రాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ SPF యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్,డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, SPF అడిషనల్ కమాండెంట్, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ 41 వ డివిజన్ లోని రాతి చెరువు సమీప ప్రాంతాలలో నెలకొన్న చెత్తాచెదారం తో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ... పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని తెలిపారు. అనంతరం శానిటేషన్, వాటర్ సప్లై, మురికి కాలువల నిర్మాణం,రోడ్ల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.4
- Post by Sampathkumar neerudu1
- మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో *అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,* జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం, కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలను కచ్చితంగా అమలుపరచాలని, పరిష్కరించిన ఫైళ్ళ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల అధికారులు, క్షేత్రస్థాయి మండల అధికారులకు సూచించారు, సీనియర్ సిటిజన్స్, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, దివ్యాంగుల పెన్షన్, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు, *మండల ప్రధాన కార్యాస్థానం నుండి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత ఇనుగుర్తి, గార్ల, డోర్నకల్, కేసముద్రం, చిన్న గూడూరు, తహసిల్దార్లతో భూ సమస్య పరిష్కారం చేయుటకు ఆదేశాలు జారీ చేశారు,* ఈ సోమవారం దంతాలపల్లి మండలం తూర్పు తండ గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోతు నాగమణి తనకు చెందిన భూమిని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా భవన నిర్మాణానికి మంజూరి ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాలక వర్గం అట్టి భవన నిర్మాణం మరొక స్థలంలో నిర్మించుచున్నారని, ఇట్టి విషయంలో హైకోర్ట్ వారిని సంప్రదించామని, విచారణ చేసి హైకోర్టు నుండి తీర్పు వెలువడే వరకు అట్టి గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయకుండా నిలుపుదల చేయమని కోరారు. డోర్నకల్ మండల కేంద్రంలోని యాదవ నగర్ కు చెందిన బొల్లం విజయ తన పేరు మీద మహబూబాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన ఇంటి పట్టా భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసారని అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని పరిశీలించి తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు. నెల్లికుదురు మండలం శ్రీరాం నగర్ గ్రామం శివారు వెంకటాపూరు కు చెందిన బుర్ర కర్ణాకర్ తాను దివ్యాంగుడినని వికలాంగుల స్కూటి ఇప్పించగలరని కోరారు. కురవి మండల కేంద్రానికి చెందిన నిమ్మల భిక్షం తనకు ఉన్న సర్వే నెంబర్ లో గల భూమి రోడ్డు అని చూపిస్తుందని దానిని సరిచేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా పాసు పుస్తకము ఇప్పించగలరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వివిధ శాఖలకు సంబంధించి ( 156 ) వచ్చిన దరఖాస్తులకు సంబందిత అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు.1
- విజయనగరం జిల్లా గుర్ల స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ప్రజలు ఎస్ ఎస్ ఆర్ పేటగ్రామం రైతు పెట్టుబడి సాయం సభకు వచ్చిన స్థానిక MLA కళా వెంకటరావు ను సోమవారం అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.1
- జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమారుడు మణితేజ (8) కుక్కకాటుకు గురై 15 నెలల పాటు చికిత్స పొందుతూ చివరికి మృతిచెందాడు. 2024 డిసెంబర్ 26న ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క బాలుడిని కరిచింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి టీకా వేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అనంతరం జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు వెన్నుముక నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు తెలిపారు. అప్పటి నుంచి బాలుడు శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడిన మణితేజ చివరకు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.1
- పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ను విజయవంతంగా దాటి భారతదేశానికి చెందిన LPG ట్యాంకర్ Shivalik సురక్షితంగా గుజరాత్‌లోని Mundra Port కు చేరుకుంది. ఈ నౌక సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల LPG ను తీసుకువచ్చింది. � The Economic Times +1 పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ సముద్ర మార్గంలో నౌకాయానానికి ప్రమాదం ఉన్నప్పటికీ, భారతదేశం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసింది. � Reuters ఈ LPG సరుకు దేశంలోని గృహ వినియోగానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణంతో గ్యాస్ సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. � The Economic Times ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలో భారతదేశం దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను భద్రపరచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీకు కావాలంటే ఇదే వార్తను మరింత చిన్నగా (వాట్సాప్/సోషల్ మీడియా పోస్టు స్టైల్) కూడా తయారు చేసి ఇస్తాను.1
- అమలాపురం మానేపల్లి వారి వీధి లో గోధుమ త్రాచు కలకలం... వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది....కావున ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందిగా కోరుచున్నాం.... ఇట్లు, మీ వర్మ (9949956232)1
- అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నట్రాజ్ సెంటర్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడులు ప్రపంచ శాంతికి విఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం విమర్శించారు. ట్రంప్‌ను ఒక యుద్ధోన్మాదిగా ఆయన అభివర్ణించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగి కేంద్రం మౌనం వహించడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని, ఇరాన్ నౌక కూల్చివేతను ఖండించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Sampathkumar neerudu1