logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెట్రోల్, డీజిల్ కొరతను చూపించి రేట్లు పెంచాలన్న ఆలోచన విరమించుకోవాలి సిపిఐ డిమాండ్ . పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ మాఫియా అరికట్టాలి- సిపిఐ. బద్వేలు , ఏప్రిల్ 22:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్,పెట్రోలు గ్యాస్ కొరత ఉన్నదని బూచిగా చూపించి రేట్లు పెంచి ప్రజలపై భారం మోపాలన్న ఆలోచన ను విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీర శేఖర్, ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ లు పాలక ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం స్థానిక జెవి భవనం నందు విలేకరుల సమావేశంలో రెండు దేశాల యుద్ధం జరిగిన సందర్భంగా పెట్రోల్,డీజిల్ వంట గ్యాస్ లేకుంటే లేదని చెప్పాలి, ఉంటే తక్కువ లేకుండా ఇవ్వాలి. కొరత రూపంలో ప్రజల పైన పెనుబారం మోపేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న దోబూజులాటను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. డీజిల్ కొరత వలన, ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ రోజుకు వాహనాలు ఇంటిదగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది ఈ విధంగా అయితే ఏ విధంగా ఫైనాన్సుల కంతులు కట్టాలనో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఆటో, టాక్సీ, కారు జీపు, మినీ లారీ, ఆల్ వ్యాన్, లారీల వంటి వాహనాలు ఫైనాన్స్ వాళ్లకు అప్ప చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది దీనిపైన కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేశ ప్రజల కోసం పనిచేసే పాలక ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, గతంలో మేము నెలకు ఎన్ని ట్యాంకర్ అమ్మగలిగితే అన్ని ట్యాంకర్లు సగం మాత్రమే ఇస్తాము మీరు డీడీలు కట్టిన ఉపయోగం లేదని తేల్చి చెప్పడం ఒక ఎత్తైతే, డీజిల్ పెట్రోల్ లేదు అని పెట్రోల్ పంపు వద్ద బోర్డు పెట్టుకొని రాత్రి సమయంలో అదనపు రేట్లతో బ్లాక్ మార్క్ అమ్ముకోవడం మరొక వ్యక్తి అయింది. ప్రతినిత్యం రోడ్డు మీద బ్రతికే వాళ్ళు, ఐస్ లు అమ్ముకునే వాళ్ళు, చిరు వ్యాపారస్తులైన , బైకులు, ఆటోలు, ప్రతిరోజు జనం బారులు తీరి ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని ఐఓసీ అధికారులు, అలాగే రాత్రి సమయంలో బస్సులు మిస్సై ఆటోలో వెళ్లాలంటే మాకు డీజిల్ లేదు, లేకపోతే అదనపుగా వందల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న ఐఓసీ డీలర్లపై చర్యలు తీసుకొని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి పెట్రోల్ డీజిల్ తీసుకురాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు, ఏరియా సహాయ కార్యదర్శి ఇమ్మానియేల్, కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ,, నాగరాజు, జి ఎల్ నరసింహ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు

17 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
17 hrs ago
294879fd-fdec-4223-8a75-02ba09685a5e

పెట్రోల్, డీజిల్ కొరతను చూపించి రేట్లు పెంచాలన్న ఆలోచన విరమించుకోవాలి సిపిఐ డిమాండ్ . పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ మాఫియా అరికట్టాలి- సిపిఐ. బద్వేలు , ఏప్రిల్ 22:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్,పెట్రోలు గ్యాస్ కొరత ఉన్నదని బూచిగా చూపించి రేట్లు పెంచి ప్రజలపై భారం మోపాలన్న ఆలోచన ను విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీర శేఖర్, ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ లు పాలక ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం స్థానిక జెవి భవనం నందు విలేకరుల సమావేశంలో రెండు దేశాల యుద్ధం జరిగిన సందర్భంగా పెట్రోల్,డీజిల్ వంట గ్యాస్ లేకుంటే లేదని చెప్పాలి, ఉంటే తక్కువ లేకుండా ఇవ్వాలి. కొరత రూపంలో ప్రజల పైన పెనుబారం మోపేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న దోబూజులాటను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. డీజిల్ కొరత వలన, ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ రోజుకు వాహనాలు ఇంటిదగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది ఈ విధంగా అయితే ఏ విధంగా ఫైనాన్సుల కంతులు కట్టాలనో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఆటో, టాక్సీ, కారు జీపు, మినీ లారీ, ఆల్ వ్యాన్, లారీల వంటి వాహనాలు ఫైనాన్స్ వాళ్లకు అప్ప చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది దీనిపైన కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేశ ప్రజల కోసం పనిచేసే పాలక ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, గతంలో మేము నెలకు ఎన్ని ట్యాంకర్ అమ్మగలిగితే అన్ని ట్యాంకర్లు సగం మాత్రమే ఇస్తాము మీరు డీడీలు కట్టిన ఉపయోగం లేదని తేల్చి చెప్పడం ఒక ఎత్తైతే, డీజిల్ పెట్రోల్ లేదు అని పెట్రోల్ పంపు వద్ద బోర్డు పెట్టుకొని రాత్రి సమయంలో అదనపు రేట్లతో బ్లాక్ మార్క్ అమ్ముకోవడం మరొక వ్యక్తి అయింది. ప్రతినిత్యం రోడ్డు మీద బ్రతికే వాళ్ళు, ఐస్ లు అమ్ముకునే వాళ్ళు, చిరు వ్యాపారస్తులైన , బైకులు, ఆటోలు, ప్రతిరోజు జనం బారులు తీరి ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని ఐఓసీ అధికారులు, అలాగే రాత్రి సమయంలో బస్సులు మిస్సై ఆటోలో వెళ్లాలంటే మాకు డీజిల్ లేదు, లేకపోతే అదనపుగా వందల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న ఐఓసీ డీలర్లపై చర్యలు తీసుకొని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి పెట్రోల్ డీజిల్ తీసుకురాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు, ఏరియా సహాయ కార్యదర్శి ఇమ్మానియేల్, కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ,, నాగరాజు, జి ఎల్ నరసింహ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు.. రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు విషయం తెలుసుకుని డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..! పనుల ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరికీ ప్రోటోకాల్ లేని టీడీపీ నేతల రచ్చ ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..
    2
    బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు..
రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్  సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి  డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు
విషయం తెలుసుకుని  డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..!
పనుల ప్రారంభోత్సవానికి ఏ  ఒక్కరికీ ప్రోటోకాల్  లేని టీడీపీ నేతల రచ్చ
ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    46 min ago
  • సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    1
    సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి ఈ tidko apartments పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    1
    ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి  ఈ tidko apartments  పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి  వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు  కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు  గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    user_PR
    PR
    Gudur, Tirupati•
    7 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు, నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress Party - YSRCP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు  వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు  కాటసాని రాంభూపాల్ రెడ్డి  గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్  పెద్దిరెడ్డి
రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు,  నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress  Party - YSRCP  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పెద్దపల్లి మండలం తురుకల మద్దికుంట గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా మైనింగ్ శాఖ అనుమతితో మట్టి విక్రయాలు జరుపుతున్నానని ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని ఇస్తూ పదుల సంఖ్యలో అందరికీ ఉపాధులు కల్పిస్తూ తను ఉపాధి పొందుతున్న క్రమంలో మద్దికుంట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భయాందోళన గురిచేస్తూ ఐదు లక్షల 40 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ లేదంటే మట్టి విక్రయాలు జరిపించేది లేదంటూ అడ్డుకుంటున్నారని వారిపై చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారంటూ రామ్ రెడ్డి తెలిపారు
    1
    పెద్దపల్లి మండలం తురుకల మద్దికుంట గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా మైనింగ్ శాఖ అనుమతితో మట్టి విక్రయాలు జరుపుతున్నానని ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని ఇస్తూ పదుల సంఖ్యలో అందరికీ ఉపాధులు కల్పిస్తూ తను ఉపాధి పొందుతున్న క్రమంలో మద్దికుంట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భయాందోళన గురిచేస్తూ ఐదు లక్షల 40 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ లేదంటే మట్టి విక్రయాలు జరిపించేది లేదంటూ అడ్డుకుంటున్నారని వారిపై చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారంటూ రామ్ రెడ్డి తెలిపారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • బీజేపీ ఆధ్వర్యంలో భగీరథ జయంతి
    1
    బీజేపీ ఆధ్వర్యంలో భగీరథ జయంతి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 min ago
  • నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు
    1
    నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.