Shuru
Apke Nagar Ki App…
🌿*రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తుమ్మల....* 🌿 రాష్ట్ర ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను ఆ వినాయకుడు తొలగించాలని పరమ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా మనమందరం ఇళ్లల్లో మట్టి వినాయకుడిని పూజిద్దామని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించటం పర్యావరణానికి మేలు చేయటంతో పాటు మన సంస్కృతిని కాపాడుకుందాం అని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ వినాయక చవితి తెలుగు ప్రజలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని మంత్రి తుమ్మల తన శుభాకాంక్షలు తెలిపారు.
Ajmera Sunitha
🌿*రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తుమ్మల....* 🌿 రాష్ట్ర ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను ఆ వినాయకుడు తొలగించాలని పరమ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా మనమందరం ఇళ్లల్లో మట్టి వినాయకుడిని పూజిద్దామని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించటం పర్యావరణానికి మేలు చేయటంతో పాటు మన సంస్కృతిని కాపాడుకుందాం అని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ వినాయక చవితి తెలుగు ప్రజలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని మంత్రి తుమ్మల తన శుభాకాంక్షలు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.1
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.1
- భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు1
- ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.1
- మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..1
- జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1