Shuru
Apke Nagar Ki App…
ప్రజ్ఞాపూర్ లోని క్యాసారం రింగ్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు మరియు లారీ ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరమార్సించిన గజ్వేల్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 12 ప్రజా తెలంగాణ న్యూస్/ ప్రజ్ఞాపూర్ లోని క్యాసారం రింగ్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు మరియు లారీ ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రులను గాయపడిన వారిని పరామర్శించి మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్య సిబ్బందిని కోరుతూ గాయపడిన వారిని ధైర్యంగా ఉండాలని చెప్పిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప రెడ్డి గారు
GOUSE BEURO REPORTER
ప్రజ్ఞాపూర్ లోని క్యాసారం రింగ్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు మరియు లారీ ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరమార్సించిన గజ్వేల్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 12 ప్రజా తెలంగాణ న్యూస్/ ప్రజ్ఞాపూర్ లోని క్యాసారం రింగ్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు మరియు లారీ ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రులను గాయపడిన వారిని పరామర్శించి మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్య సిబ్బందిని కోరుతూ గాయపడిన వారిని ధైర్యంగా ఉండాలని చెప్పిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప రెడ్డి గారు
More news from తెలంగాణ and nearby areas
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు1
- చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- నేటి యువతరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 165 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత, గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కోన లక్ష్మి(72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ లో నివాసం ఉండే లక్ష్మీ గొంతులో కత్తి ఘాట్లు ఉండడంతో హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. గతంలో వృధ్ధురాలిపై దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చి చూసేసరికి, రక్తం మడుగులో పడిఉన్న తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహం ఏరియా ఆసుపత్రికి తరలించారు.3
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయబడింది. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. _రహదారి భద్రతా ప్రతిజ్ఞ_ నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.1
- సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.1
- నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.1