తెలుగుదేశం ప్రభుత్వంలోనే కార్యకర్తలకు పెద్ద పేట - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలం బసవయ్య పాళెం గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ముఖ్యంమత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తేగానే స్పందించి సివిల్ సప్లయ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ని కోవూరు పంపారన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి స్థానిక పరిస్థితులు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గోనె సంచుల కొరత, లారీల కొరత తదితర సమస్యలు పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలినిచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భముగా ప్రస్తావించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సివిల్ సప్లయ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ధన్యవాదాలు తెలియచేసారు. అనంతరం ఆమె స్థానిక తెలుగుదేశం నాయకులకు దిశానిర్దేశం చేస్తూ నాయకులు కార్యకర్తల కృషి ఫలితంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిందనన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గతంలో మండల వ్యాప్తంగా గ్రామాల్లో గుంతల మయమై వున్న రోడ్లను పునరుద్ధరించామన్నారు. రెండు రోజుల క్రితం కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో 90 లక్షలతో వేసిన సిసి రోడ్డు గురించి మాట్లాడుతూ దాదాపు 40 ఏళ్లకు ముందు నిర్మించిన ఆ రోడ్డును తాను ఎమ్మెల్యే అయ్యాకే పునర్నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారన్నారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో బసవయ్య పాళెం గ్రామాభివృద్ధికి 45 లక్షల 87 వేల 722 వెచ్చించామన్నారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తేవాలని కోరారు. నాయకులు విభేదాలు వీడి ఐకమత్యంగా వుంటూ గ్రామాభివృద్ధికి పాటు పడాలని క్యాడర్ కు హితోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలోనే కార్యకర్తలకు పెద్ద పేట - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలం బసవయ్య పాళెం గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ముఖ్యంమత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తేగానే స్పందించి సివిల్ సప్లయ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ని కోవూరు పంపారన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి స్థానిక పరిస్థితులు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గోనె సంచుల కొరత, లారీల కొరత తదితర సమస్యలు పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలినిచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భముగా ప్రస్తావించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సివిల్ సప్లయ్ మంత్రి
నాదెండ్ల మనోహర్ కి ధన్యవాదాలు తెలియచేసారు. అనంతరం ఆమె స్థానిక తెలుగుదేశం నాయకులకు దిశానిర్దేశం చేస్తూ నాయకులు కార్యకర్తల కృషి ఫలితంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిందనన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గతంలో మండల వ్యాప్తంగా గ్రామాల్లో గుంతల మయమై వున్న రోడ్లను పునరుద్ధరించామన్నారు. రెండు రోజుల క్రితం కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో 90 లక్షలతో వేసిన సిసి రోడ్డు గురించి మాట్లాడుతూ దాదాపు 40 ఏళ్లకు ముందు నిర్మించిన ఆ రోడ్డును తాను
ఎమ్మెల్యే అయ్యాకే పునర్నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారన్నారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో బసవయ్య పాళెం గ్రామాభివృద్ధికి 45 లక్షల 87 వేల 722 వెచ్చించామన్నారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తేవాలని కోరారు. నాయకులు విభేదాలు వీడి ఐకమత్యంగా వుంటూ గ్రామాభివృద్ధికి పాటు పడాలని క్యాడర్ కు హితోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.1
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.2
- Post by T.Shiva Krishna1
- Post by SS NEWS1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.1
- ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఆశ వర్కర్ల డిమాండ్లు: 1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. 2. ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.4
- బద్వేలు, మార్చి 30:శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్పటిక శివాలయం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి , గౌరవ అధ్యక్షులు వంకెల పెద్ద పోలిరెడ్డి మరియు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు రాజగోపాల్ రెడ్డి, బద్వేలు జడ్పిటిసి పోలి రెడ్డి, డిఎ డి ఎల్ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, పద్మావతి, సర్పంచ్ జయరాం రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు ప్రిన్సిపాల్ దాష్టికం విద్యార్థినులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్ నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని.. విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.1