logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మైన్స్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా దారులతో చేతులు కలిపారనే ఆరోపణల నేపథ్యంలో... భూపాలపల్లి, హైదరాబాద్ బోడుప్పల్, సూర్యాపేట, తాండూరు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

3 hrs ago
user_Reporter Gaddam Kiran
Reporter Gaddam Kiran
ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
3 hrs ago
0d27f1c5-4233-4e72-9931-81cf732dc2e9

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మైన్స్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా దారులతో చేతులు కలిపారనే ఆరోపణల నేపథ్యంలో... భూపాలపల్లి, హైదరాబాద్ బోడుప్పల్, సూర్యాపేట, తాండూరు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

More news from తెలంగాణ and nearby areas
  • నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    13 hrs ago
  • మర్రి చెట్టుకు ‘మర్రి కల్లు’.. వేరు నుంచి జాలువారుతున్న కల్లు! మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని చిన్నాలకుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుంచి కల్లు జాలువారడం వింతగా మారింది. నాలుగైదు రోజులుగా దీనిని గమనించిన గీత కార్మికుడు ఆకుల శ్రీను, వేరుకు గీతలు పెట్టి లొట్టి కట్టారు. లొట్టిలో కల్లు పడటంతో పలువురు ఆసక్తిగా అక్కడికి చేరుకుంటున్నారు. మర్రి చెట్టు పక్కనే ఉన్న వ్యవసాయ బావి పూడికతీత పనుల్లో చెట్టు ప్రధాన వేరు తెగిపోవడంతో మూడు, నాలుగు రోజులుగా కల్లు జాలువారుతున్నట్లు శ్రీను తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెట్టును చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. గీత కార్మికుడు కల్లును సేకరించి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
    1
    మర్రి చెట్టుకు ‘మర్రి కల్లు’.. వేరు నుంచి జాలువారుతున్న కల్లు!
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని చిన్నాలకుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుంచి కల్లు జాలువారడం వింతగా మారింది. నాలుగైదు రోజులుగా దీనిని గమనించిన గీత కార్మికుడు ఆకుల శ్రీను, వేరుకు గీతలు పెట్టి లొట్టి కట్టారు. లొట్టిలో కల్లు పడటంతో పలువురు ఆసక్తిగా అక్కడికి చేరుకుంటున్నారు.
మర్రి చెట్టు పక్కనే ఉన్న వ్యవసాయ బావి పూడికతీత పనుల్లో చెట్టు ప్రధాన వేరు తెగిపోవడంతో మూడు, నాలుగు రోజులుగా కల్లు జాలువారుతున్నట్లు శ్రీను తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెట్టును చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. గీత కార్మికుడు కల్లును సేకరించి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    3
    మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు


హైదరాబాద్ (ఆగస్టు 26):
మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు.
​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    19 hrs ago
  • గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
    1
    గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • వేములవాడలో రంగు నీళ్ళ డబ్బాలతో కుక్కల బెడదకు చెక్...గాంధీనగర్ వాసుల వినూత్న ఆలోచన భేష్ కుక్కల బెడదతో విసిగిపోయిన వేములవాడ గాంధీనగర్ వాసులు రంగు నీళ్ళ డబ్బాలతో చెక్ పెట్టారు. వినూత్న ఆలోచనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. వేములవాడలో లో గాంధీ నగర్ వీధిలో ఏ ఇంటి ముందు చూసినా రంగు నీళ్ల డబ్బాలే కనిపిస్తున్నాయి. ఇదేమిటని చూసిన వారంతా ఆశ్చర్యపోతుండగా, వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు కాలనీవాసులు వినూత్నంగా ప్రయోగం చేశారని స్థానికులు తెలిపారు. కాలనీలో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, విధులు అపశుభ్రంగా చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కుక్కలు ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఇంటి ముందు రంగు నీళ్లతో నింపిన డబ్బాలను ఏర్పాటు చేశారు. రంగు నీళ్ల డబ్బాలు పెట్టిన తర్వాత కుక్కలు ఇళ్ల వైపు రావడం తగ్గిందని, ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. వీధి కుక్కల సమస్య నుంచి రక్షణ పొందేందుకు రంగు నీళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో, ప్రస్తుతం గాంధీ నగర్ వీధిలోని ప్రతి ఇంటి ముందు రంగు నీళ్ల డబ్బాలు దర్శనమిస్తుండడం ఆశ్చర్యాన్ని అంతకు మించి వినూత్న ఆలోచనలకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
    1
    వేములవాడలో రంగు నీళ్ళ డబ్బాలతో కుక్కల బెడదకు చెక్...గాంధీనగర్ వాసుల వినూత్న ఆలోచన భేష్
కుక్కల బెడదతో విసిగిపోయిన వేములవాడ గాంధీనగర్ వాసులు రంగు నీళ్ళ డబ్బాలతో చెక్ పెట్టారు.  వినూత్న ఆలోచనపై  సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. వేములవాడలో లో గాంధీ నగర్ వీధిలో ఏ ఇంటి ముందు చూసినా రంగు నీళ్ల డబ్బాలే కనిపిస్తున్నాయి. ఇదేమిటని చూసిన వారంతా ఆశ్చర్యపోతుండగా, వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు కాలనీవాసులు వినూత్నంగా ప్రయోగం చేశారని స్థానికులు తెలిపారు. కాలనీలో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, విధులు అపశుభ్రంగా చేస్తున్నాయని  స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కుక్కలు ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఇంటి ముందు రంగు నీళ్లతో నింపిన డబ్బాలను ఏర్పాటు చేశారు. రంగు నీళ్ల డబ్బాలు పెట్టిన తర్వాత కుక్కలు ఇళ్ల వైపు రావడం తగ్గిందని, ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. వీధి కుక్కల సమస్య నుంచి రక్షణ పొందేందుకు రంగు నీళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో, ప్రస్తుతం గాంధీ నగర్ వీధిలోని ప్రతి ఇంటి ముందు రంగు నీళ్ల డబ్బాలు దర్శనమిస్తుండడం ఆశ్చర్యాన్ని అంతకు మించి వినూత్న ఆలోచనలకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    1
    ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. 
నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... 
కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.
    1
    జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు
జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    18 hrs ago
  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఫ్యాన్లు లేవు.. సెలైన్‌కు స్టాండ్ లేదు.. తల్లిపాల గదికి తాళం.. ఎంజీఎంలో రోగుల అవస్థలు! వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరతపై రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పలు వార్డుల్లో ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడంతో గాలి సౌకర్యం కోసం కొందరు రోగుల బంధువులు ఇంటి నుంచే ఫ్యాన్లు తీసుకొచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ చిన్నారి ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించగా, మరోవైపు సెలైన్ బాటిల్‌ను గోడకు వేలాడదీసి చికిత్స అందిస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఆస్పత్రిలో వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతుల సమస్యలు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. తల్లిపాల గది ఉన్నా.. తాళమే మరోవైపు బాలింతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తల్లిపాల గది అందుబాటులో లేకపోవడంపై కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. గదికి తరచూ తాళం వేసి ఉండటంతో ఓపీకి వచ్చే బాలింతలు శిశువులకు బహిరంగ ప్రదేశాల్లో పాలు పట్టించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న సమయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది వినియోగానికి అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎంజీఎం వంటి ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. వార్డుల్లో ఫ్యాన్ల కొరతను వెంటనే పరిష్కరించాలని, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలని, బాలింతల తల్లిపాల గదిని నిరంతరం అందుబాటులో ఉంచాలని రోగులు, వారి బంధువులు అధికారులను కోరుతున్నారు.
    1
    వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఫ్యాన్లు లేవు.. సెలైన్‌కు స్టాండ్ లేదు.. తల్లిపాల గదికి తాళం.. ఎంజీఎంలో రోగుల అవస్థలు!
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరతపై రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పలు వార్డుల్లో ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడంతో గాలి సౌకర్యం కోసం కొందరు రోగుల బంధువులు ఇంటి నుంచే ఫ్యాన్లు తీసుకొచ్చినట్లు ఆరోపిస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ చిన్నారి ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించగా, మరోవైపు సెలైన్ బాటిల్‌ను గోడకు వేలాడదీసి చికిత్స అందిస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఆస్పత్రిలో వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతుల సమస్యలు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.
తల్లిపాల గది ఉన్నా.. తాళమే
మరోవైపు బాలింతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తల్లిపాల గది అందుబాటులో లేకపోవడంపై కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. గదికి తరచూ తాళం వేసి ఉండటంతో ఓపీకి వచ్చే బాలింతలు శిశువులకు బహిరంగ ప్రదేశాల్లో పాలు పట్టించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న సమయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది వినియోగానికి అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఎంజీఎం వంటి ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. వార్డుల్లో ఫ్యాన్ల కొరతను వెంటనే పరిష్కరించాలని, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలని, బాలింతల తల్లిపాల గదిని నిరంతరం అందుబాటులో ఉంచాలని రోగులు, వారి బంధువులు అధికారులను కోరుతున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.