Shuru
Apke Nagar Ki App…
రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధిలో అందరూ ఒక్కటే : షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా : ఎన్నికల వరకే రాజకీయాలు.. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలి అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి రూ.300 కోట్ల ప్రత్యేక నిధులకు హామీ ఇచ్చారని షబ్బీర్ అలీ వెల్లడించారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ తరహాలోనే కామారెడ్డిని తీర్చిదిద్దుతామన్నారు. కొత్త పాలకవర్గం ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలని కోరారు.
Narmala Swapna
రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధిలో అందరూ ఒక్కటే : షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా : ఎన్నికల వరకే రాజకీయాలు.. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలి అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి రూ.300 కోట్ల ప్రత్యేక నిధులకు హామీ ఇచ్చారని షబ్బీర్ అలీ వెల్లడించారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ తరహాలోనే కామారెడ్డిని తీర్చిదిద్దుతామన్నారు. కొత్త పాలకవర్గం ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- మెదక్ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.మాజీడిప్యూటీస్పికర్ పద్మదేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు.జ, రిగాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్,జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం పద్మ దేవేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంపార్టీ శ్రేణులు ఒకరికొకరు కేకు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా యం. పద్మ దేవేందర్ రెడ్డిమాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలు నోచుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేరించింది కెసిఆర్ అని అన్నారు.10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుండి నెంబర్ వన్ స్థాయికి తెచ్చిన ఘనత కేసిఆర్ దే అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరఫున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని,మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,సెక్రటరీ. కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు లలిత,స్వరూప,గంగామణి,ఉదయ్ కుమార్,జుబేర్ అహ్మద్, దీపక్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,ఆర్కే శ్రీనివాస్,మాయ.మల్లేశం, చంద్రకళ,విజయలక్ష్మి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి ,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజా గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు లింగ రెడ్డి,సురేందర్ గౌడ్,సంతోష్, మోచి. కిషన్,సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప.సాయిలు, ఇలియాజ్ ,నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్,రవి,మాజీ సర్పంచ్ లతోపాటు, మెదక్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రత్యేక ఎన్నికల అధికారి ఎంపిక నిర్వహించగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలిపాడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.2
- Post by పట్లోల్ల శివాజీ రావ్1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ రైతు వేదికలో ఫార్మర్ ఐడీ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అదే విధంగా పంట సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ కిష్టవ్వ దిల్ రాజ్, పులిగుండు సర్పంచ్ రామారావు, రైతులు పాల్గొన్నారు.1