Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి : ప్రజావాణి కార్యక్రమానికి 97 దరఖాస్తులు: కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 97 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు భూ సమస్యలు, వ్యక్తిగత, సంక్షేమ పథకాలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
Narmala Swapna
కామారెడ్డి : ప్రజావాణి కార్యక్రమానికి 97 దరఖాస్తులు: కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 97 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు భూ సమస్యలు, వ్యక్తిగత, సంక్షేమ పథకాలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి: ఐదు రోజుల పాటు నీటి సరఫరా మార్పులు, కల్వారల్ సమీపంలో జీఆర్పీ పైప్లాన్ మార్పిడి, గ్యాప్ క్లోజింగ్, 3.20 కి.మీ. పైప్లాన్ కమిషనింగ్ పనుల నేపథ్యంలో మార్చి 9 నుంచి ఐదు రోజుల పాటు పైప్లాన్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్ మండలాలు, కామారెడ్డి మున్సిపాలిటీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి సరఫరాను కొత్త లైన్ ద్వారా అందించనున్నారు.1
- మంచిర్యాల జిల్లా// దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- నిర్మల్ జిల్లా లోని ఖానాపూర్ మున్సిపాలిటీ లొ 5 k రన్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వం కళాశాల మైదానం నుండి కొమురం భీమ్ చౌరస్తా వరకు మళ్ళీ కాలేజ్ వరకు 5k రన్ చేపట్టారు. యువత, ప్రజలు, విద్యార్థులు, అధికారుల, నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని స్లొగన్స్ తో యువత పరుగులు తీసారు.1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.1
- కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో పదో తరగతి విద్యార్థులకు పిట్లం లయన్స్ క్లబ్ బాసటగా నిలిచింది. మండలంలోని చిన్న కొడఫ్గల్, గొద్మేగాం | ప్రభుత్వ పాఠశాలల్లో 10th విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి మండల కీర్తిని చాటాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి బాలు, రీజియన్ కో-ఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు.1