Shuru
Apke Nagar Ki App…
రామప్ప దేవాలయంను సందర్శించిన నెదర్లాండ్ దేశస్తులు రామప్ప, : మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని ఆదివారం నెదర్లాండ్ దేశానికీ చెందిన సైమన్, జూలీయన్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప చరిత్ర శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ శిల్పకళ చాలా బ్యుటిపుల్ గా ఉందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, బద్రు, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.
User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
రామప్ప దేవాలయంను సందర్శించిన నెదర్లాండ్ దేశస్తులు రామప్ప, : మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని ఆదివారం నెదర్లాండ్ దేశానికీ చెందిన సైమన్, జూలీయన్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప చరిత్ర శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ శిల్పకళ చాలా బ్యుటిపుల్ గా ఉందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, బద్రు, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.2
- ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*1
- bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi5
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిస్టులు కోరుతున్నారు.1