Shuru
Apke Nagar Ki App…
bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi
Narige Rajkumar
bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో రన్ ఫర్ జీసస్( యేసు కొరకే పరుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం సందర్భంగా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు శనివారం ఉదయం జన్నారంలోని బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ సభ్యులు మంద రాజేష్ పాల్గొన్నారు.1
- తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా1
- Puducherry has decided to re-elect the NDA Government. Here are some special moments from yesterday’s roadshow.1
- Post by KR NEWS 3691
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి ఈ రోజు నిర్వహించారు. 51 రోజులుగా క్యాంపులో ఉన్న బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా బిఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కు బాధ్యతలు అప్పగించడంతో బిఆర్ఎస్ కు చెందిన 10 మంది, సీపీఐకి చెందిన 4 గురు కౌన్సిలర్లతో కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. ఈసందర్భంగా మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావణకాష్టంలా, పోలీస్ రాజ్యంలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రజాతీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన కాదు, పాపపుపాలన దోపిడీ దొంగల పాలన సాగుతుందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, దోపిడి జరుగుతుందని, దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు ఉరివేయక తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.1
- బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.1