logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జన్నారంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించిన క్రైస్తవులు జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో రన్ ఫర్ జీసస్( యేసు కొరకే పరుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం సందర్భంగా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు శనివారం ఉదయం జన్నారంలోని బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ సభ్యులు మంద రాజేష్ పాల్గొన్నారు.

13 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
13 hrs ago

జన్నారంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించిన క్రైస్తవులు జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో రన్ ఫర్ జీసస్( యేసు కొరకే పరుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం సందర్భంగా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు శనివారం ఉదయం జన్నారంలోని బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ సభ్యులు మంద రాజేష్ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రతను పరిశీలించారు. ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్, సిబ్బందికి సూచనలు చేస్తూ శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాత్రి పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.
    3
    కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రతను పరిశీలించారు.
ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్, సిబ్బందికి సూచనలు చేస్తూ శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాత్రి పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.
    1
    బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    4
    కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో  మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో  కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్* నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
    1
    *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్*
నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు.
జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :04.04.2026
కామారెడ్డి జిల్లా శనివారం 
రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం
రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం:
గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389
సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369
అని తెలియజేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్,  చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు   కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • * *ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం* భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
    3
    *
*ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం*
భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి 
భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం 
ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి 
ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం 
తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం 
ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు.
    1
    తెలంగాణలో 6 గ్యారంటీలను  అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన  అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 
6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని  బండి సంజయ్ కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.