Shuru
Apke Nagar Ki App…
Puducherry has decided to re-elect the NDA Government. Here are some special moments from yesterday’s roadshow. Puducherry has decided to re-elect the NDA Government. Here are some special moments from yesterday’s roadshow.
M.RAJKIRAN REDDY
Puducherry has decided to re-elect the NDA Government. Here are some special moments from yesterday’s roadshow. Puducherry has decided to re-elect the NDA Government. Here are some special moments from yesterday’s roadshow.
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో రన్ ఫర్ జీసస్( యేసు కొరకే పరుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం సందర్భంగా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు శనివారం ఉదయం జన్నారంలోని బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ సభ్యులు మంద రాజేష్ పాల్గొన్నారు.1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రతను పరిశీలించారు. ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్, సిబ్బందికి సూచనలు చేస్తూ శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాత్రి పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.3
- ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.1
- bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi5
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- * *ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం* భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా1
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు1