logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శతశాతం అక్షరాస్యతే లక్ష్యం. అరసవల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్రీకాకుళం, మార్చి 15: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన 'అక్షర ఆంధ్ర - ఉల్లాస్' కార్యక్రమం ఎంతో కీలకమైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు వీఓఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారని అభినందించారు. పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని, అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే 'అక్షర ఆంధ్ర' యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఐసీడీఎస్, మెప్మా, డ్వామా, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్షర జ్ఞానం ద్వారానే సామాజికాభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పరీక్ష రాయాలని అభ్యాసకులను కోరారు. ఈ పర్యవేక్షణలో వివిధ శాఖల నోడల్ అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు

18 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

శతశాతం అక్షరాస్యతే లక్ష్యం. అరసవల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్రీకాకుళం, మార్చి 15: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన 'అక్షర ఆంధ్ర - ఉల్లాస్' కార్యక్రమం ఎంతో కీలకమైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు వీఓఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారని అభినందించారు. పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని, అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే 'అక్షర ఆంధ్ర' యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఐసీడీఎస్, మెప్మా, డ్వామా, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్షర జ్ఞానం ద్వారానే సామాజికాభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పరీక్ష రాయాలని అభ్యాసకులను కోరారు. ఈ పర్యవేక్షణలో వివిధ శాఖల నోడల్ అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సంతబొమ్మాళి మండలం లో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 3,400 వయోజనులు పరీక్షలు రాశారు. 15 నుంచి 55 సంవత్సరాల వయసుగల 2210 మంది మహిళ అభ్యాసకులు, 1190 పురుష అభ్యాసకులు పరీక్షలలో పాల్గొన్నారు. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఉమ్మిలాడా లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆయన తెలియజేశారు.
    7
    సంతబొమ్మాళి మండలం లో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 3,400 వయోజనులు పరీక్షలు రాశారు. 15 నుంచి 55 సంవత్సరాల వయసుగల 2210 మంది మహిళ అభ్యాసకులు, 1190 పురుష అభ్యాసకులు పరీక్షలలో పాల్గొన్నారు. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఉమ్మిలాడా లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆయన తెలియజేశారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్వహించిన పలాస ఆర్.టి.సి ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించినముఖ్యసమావేశంలోఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎపీజేఏసీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పలాస గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా,డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి , తో కలిసి పాల్గోన్నారు. వారితో...రాష్ట్ర కార్యదర్శి చింతాడ వెంకటరావు , జోనల్ సెక్రటరీ బి.కె. మూర్తి , రీజనల్ అధ్యక్షులు కె. దశరధుడు , రీజనల్ కార్యదర్శి జి. త్రినాథ్ , ఏ.డి. కుమార్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో  పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్వహించిన పలాస ఆర్.టి.సి ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించినముఖ్యసమావేశంలోఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎపీజేఏసీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పలాస గౌరవ అధ్యక్షులు
దువ్వాడ శ్రీధర్ బాబా,డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి , తో కలిసి పాల్గోన్నారు. 
వారితో...రాష్ట్ర కార్యదర్శి చింతాడ వెంకటరావు , జోనల్ సెక్రటరీ బి.కె. మూర్తి , రీజనల్ అధ్యక్షులు కె. దశరధుడు , రీజనల్ కార్యదర్శి జి. త్రినాథ్ , ఏ.డి. కుమార్ , రాజు  తదితరులు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 13 ఏళ్ల చిన్నారి సాహితీ వాహనదారులకు మొక్కలను అందజేసి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, అలాగే మొక్కలు వాహన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షిస్తాయని అవగాహన కల్పించింది గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ కాండ్రేగుల లీల హరిప్రసాద్, జయభారత్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిల్, ట్రాఫిక్ సోల్జర్ స్థానికులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 
13 ఏళ్ల చిన్నారి సాహితీ  వాహనదారులకు మొక్కలను అందజేసి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, అలాగే మొక్కలు వాహన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షిస్తాయని అవగాహన కల్పించింది
గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు పేర్కొన్నారు. 
ఈ  కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్  శాంతారామ్, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్  కాండ్రేగుల లీల హరిప్రసాద్, జయభారత్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిల్, ట్రాఫిక్ సోల్జర్ స్థానికులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
    1
    బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు.
చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు.
18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by GANGADHAR
    1
    Post by GANGADHAR
    user_GANGADHAR
    GANGADHAR
    Social services organisation Paderu, Alluri Sitharama Raju•
    14 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • సంతబొమ్మాళి మండల నౌపడలో ఉన్న 33/11 KV విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో మార్చి 17 విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EE నరసింహ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త బ్రేకర్ కోసం బే ఎక్స్టెన్షన్ కొత్తలైన్ పనులు జరగనున్నందున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉండదన్నారు. నౌపడ,HN పేట, మూలపేట, మేఘవరం, భావనపాడు, యామలపేట,మర్రిపాడు, ఆకాశలక్కవరం, ఎం సున్నపల్లి, ఇజ్జవరం రొయ్యల చెరువులకు సరఫరా ఉండదన్నారు.
    6
    సంతబొమ్మాళి మండల నౌపడలో ఉన్న 33/11 KV  విద్యుత్ ఉపకేంద్రం 
పరిధిలో మార్చి 17 విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EE నరసింహ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త బ్రేకర్ కోసం బే ఎక్స్టెన్షన్ కొత్తలైన్ పనులు జరగనున్నందున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉండదన్నారు. నౌపడ,HN పేట, మూలపేట, మేఘవరం, భావనపాడు, యామలపేట,మర్రిపాడు, ఆకాశలక్కవరం, ఎం సున్నపల్లి, ఇజ్జవరం రొయ్యల చెరువులకు సరఫరా ఉండదన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Rajesh
    1
    Post by Rajesh
    user_Rajesh
    Rajesh
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.