ఎస్‌ఐఆర్ కార్యకలాపాలపై బోధన్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్డు సభ బోధన్ : ( ఆగస్టు 27): నిజామాబాద్ జిల్లా; ప్రతినిధి రాహుల్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ పట్టణ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో రెంజల్‌బేస్ పరిధిలోని బీటీ నగర్, ఉద్మీర్‌గల్లీ పోలింగ్ కేంద్రాల పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) కార్యకలాపాలపై వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొని స్థానిక ఓటర్లతో మాట్లాడి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్ విచారణకు హాజరయ్యే సమయంలో ఓటర్లు తమ వద్ద ఉన్న చెల్లుబాటు అయ్యే ఆధార పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని కమిషనర్ జాదవ్ కృష్ణ సూచించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను సరిచూసుకోవాలని తెలిపారు. మృతిచెందిన వ్యక్తుల పేర్ల తొలగింపు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన ఓటర్ల వివరాల సవరణ, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదై ఉంటే వాటి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించే విచారణకు అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలతో హాజరై తమ వివరాలను ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా ఉండేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలోవార్డు సభ్యులు, మునిసిపల్ సిబ్బంది, ఓటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ కార్యకలాపాలపై బోధన్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్డు సభ బోధన్ : ( ఆగస్టు 27): నిజామాబాద్ జిల్లా; ప్రతినిధి రాహుల్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ పట్టణ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో రెంజల్‌బేస్ పరిధిలోని బీటీ నగర్, ఉద్మీర్‌గల్లీ పోలింగ్ కేంద్రాల పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) కార్యకలాపాలపై వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొని స్థానిక ఓటర్లతో మాట్లాడి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్ విచారణకు హాజరయ్యే సమయంలో ఓటర్లు తమ వద్ద ఉన్న చెల్లుబాటు అయ్యే ఆధార పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని కమిషనర్ జాదవ్ కృష్ణ సూచించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు,
చిరునామా, ఇతర వివరాలను సరిచూసుకోవాలని తెలిపారు. మృతిచెందిన వ్యక్తుల పేర్ల తొలగింపు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన ఓటర్ల వివరాల సవరణ, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదై ఉంటే వాటి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించే విచారణకు అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలతో హాజరై తమ వివరాలను ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా ఉండేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలోవార్డు సభ్యులు, మునిసిపల్ సిబ్బంది, ఓటర్లు, తదితరులు పాల్గొన్నారు.
- వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు మరోసారి ఫిర్యాదు – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో రాకాసిపేట్‌లోని వివిధ వార్డులకు చెందిన బాధ్యత వహిస్తున్న కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి మరోసారి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్‌లోని 38 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అయితే వార్డుల్లోని ప్రజలు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోకపోతే బోధన్‌లోని వీధి కుక్కలను పట్టుకుని బోధన్ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి వదిలిపెట్టాల్సి వస్తుందని జునైద్ అహ్మద్ ఖలీల్ హెచ్చరించారు. అలాగే బోధన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా స్పందించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియా ద్వారా కోరారు. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు1
- చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.1
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు1
- స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోరుట్లలో డా. రఘు టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1