నల్గొండ సెట్విన్‌ను రాష్ట్రంలోనే ఉత్తమ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతా – *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ బ్రేకింగ్: నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి.. నల్గొండ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ! యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపు... మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది... మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు... ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచన... సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచన... నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యం... నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్,న్యాక్ సెంటర్ ఏర్పాటు... సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తాం... *రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.*☝️
నల్గొండ సెట్విన్‌ను రాష్ట్రంలోనే ఉత్తమ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతా – *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ బ్రేకింగ్: నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి.. నల్గొండ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ! యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపు... మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది... మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు... ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచన... సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచన... నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యం... నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్,న్యాక్ సెంటర్ ఏర్పాటు... సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తాం... *రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.*☝️
- నకిరేకల్, ఏప్రిల్ 13:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వార్తలోని ముఖ్యాంశాలు: 20 రోజులుగా నిరీక్షణ: ఐకేపీ కేంద్రాలకు రైతులు వరి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పేరుకు మాత్రమే ఒకటి రెండు సెంటర్లలో కొనుగోలు ప్రారంభించి, మిగిలిన చోట్ల తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పునరావాస కేంద్రాలు: గతంలో ధాన్యం కొనుగోళ్లు PACS (ప్యాక్స్) మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగేవని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కొత్త వారికి కేంద్రాలను కేటాయించిందని ఆరోపించారు.తరుగు పేరుతో దోపిడీ: అనుభవం లేని వ్యక్తులకు కేంద్రాలు అప్పగించడం వల్ల మిల్లర్లు ఆడుకుంటున్నారని, బస్తాకు (40 కేజీలు) 2 నుండి 4 కేజీల వరకు తరుగు తీయాలని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.మిల్లర్ల సిండికేట్: మిల్లర్లతో కుమ్మక్కై, లేని సాకులు వెతుకుతూ రైతుల రక్తాన్ని తాగుతున్నారని, క్వింటాకు భారీగా నష్టం వాటిల్లేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ప్రభుత్వం స్పందించి రాజకీయ జోక్యం లేకుండా, పాత పద్ధతిలో అనుభవం ఉన్న సంఘాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని త చిరుమర్తి లింగయ్య గారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.1
- మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ విద్యతోనే వివక్షను జయించవచ్చని అంబేద్కర్ నిరూపించారని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన సమానత్వమే నేటి స్వేచ్ఛకు పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం చట్టపత్రి చేయడం ఎంతో ఆనందం కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ఎదుగుదలకు ఎన్నో వ్యక్తులు వారి యొక్క కార్యకలాపాలను ఉద్దేశాలను మార్చుకుంటే మంచిది. గతంలో లాగా ఏది చెప్పినా తలకాయలు ఊపే రోజులు పోయాయని తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మావిగన్ అనే ఇంగ్లీషు పదం వద్దు, అమరావతి ముద్దు అని తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని ఏది ఎవరు చెప్పినా నమ్మకుండా నిర్ధారణ చేసిన తర్వాతే నమ్మాలని కోరుకుంటున్నాను .ఎందుకంటే మన యొక్క నిర్ణయాలు ఆలోచనలు మాత్రమే రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాయని తెలియజేస్తున్నాను. ఇట్లు జనసేన నాయకులు పాలెపోగు బాబు కారంపూడి మండలం.1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- Post by Bandi renu1
- Post by Ali ammu1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.1