Shuru
Apke Nagar Ki App…
బాన్సువాడ మండలం : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని నియంత్రణ విధానాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అగ్నిని ఆర్పే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఓ మధన్, సునీల్ కుమార్, హరిసింగ్ పాల్గొన్నారు.
Narmala Swapna
బాన్సువాడ మండలం : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని నియంత్రణ విధానాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అగ్నిని ఆర్పే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఓ మధన్, సునీల్ కుమార్, హరిసింగ్ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం బజరంగ్దళ్ పరిషత్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మేల్కొనండి జిహాద్ వలలో పడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గోరక్ష చేయాలని గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమకు వినతిపదిక సమర్పించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- Post by Vishwamber Rao1
- కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.1