వర్షాకాలం మధ్య భానుడి భగభగలు... వ్యవసాయ కూలీలకు నరకయాతన ఎండ వేడిమితో కూలీలు కుప్పకూలుతున్న వైనం వరి నాట్లకు అంతరాయం సూర్యాపేట జిల్లా, ఆగస్ట్ 5: వర్షాకాలం నడుమా ఎండలు మండిపోతుండటంతో వ్యవసాయ రంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పగటి వేళల్లో భానుడి భగభగలు చల్లబడే ఆసరా లేకుండా మండిపోతుండటంతో, పొలాల్లో పని చేస్తున్న కూలీలు ఒకరొక్కరు సమ్మసిల్లి కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా వరి నాట్ల సమయం కావడంతో పనులు అత్యవసరంగా సాగాల్సిన పరిస్థితిలో రైతులు అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రతతో ఒక్క పూట పని చేయడమే అసాధ్యమైపోతోంది. సాధారణంగా 10–12 మందితో చేసే వరి నాట్లు ఇప్పుడు గుంపుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మిగలుతున్నారు. పలువురు తీవ్ర వడదెబ్బకు గురై చికిత్స తీసుకుంటుండగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అయితే పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. వర్షాకాలంలోనూ మామూలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడాన్ని చూసి ప్రజానీకం ఆశ్చర్యపోతున్నారు. వాతావరణ విపరీత పరిస్థితులు ఉచిత సేవలతో అందుతున్నప్పటికీ, ఆయా హెచ్చరికలను అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
వర్షాకాలం మధ్య భానుడి భగభగలు... వ్యవసాయ కూలీలకు నరకయాతన ఎండ వేడిమితో కూలీలు కుప్పకూలుతున్న వైనం వరి నాట్లకు అంతరాయం సూర్యాపేట జిల్లా, ఆగస్ట్ 5: వర్షాకాలం నడుమా ఎండలు మండిపోతుండటంతో వ్యవసాయ రంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పగటి వేళల్లో భానుడి భగభగలు చల్లబడే ఆసరా లేకుండా మండిపోతుండటంతో, పొలాల్లో పని చేస్తున్న కూలీలు ఒకరొక్కరు సమ్మసిల్లి కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా వరి నాట్ల సమయం కావడంతో పనులు అత్యవసరంగా సాగాల్సిన పరిస్థితిలో రైతులు అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రతతో ఒక్క పూట
పని చేయడమే అసాధ్యమైపోతోంది. సాధారణంగా 10–12 మందితో చేసే వరి నాట్లు ఇప్పుడు గుంపుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మిగలుతున్నారు. పలువురు తీవ్ర వడదెబ్బకు గురై చికిత్స తీసుకుంటుండగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అయితే పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. వర్షాకాలంలోనూ మామూలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడాన్ని చూసి ప్రజానీకం ఆశ్చర్యపోతున్నారు. వాతావరణ విపరీత పరిస్థితులు ఉచిత సేవలతో అందుతున్నప్పటికీ, ఆయా హెచ్చరికలను అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.