Shuru
Apke Nagar Ki App…
కుక్కలతో ఎంత ప్రమాదమో చూడండి కుక్కలతో జాగ్రత్త గా ఉండాలి
Shyam sunder Yadav Pulapally
కుక్కలతో ఎంత ప్రమాదమో చూడండి కుక్కలతో జాగ్రత్త గా ఉండాలి
- Venkaiah ManemBapatla, Andhra Pradesh💣on 16 December
- User6063Telangana😂on 16 December
More news from తెలంగాణ and nearby areas
- -లోక్ సభ సీట్లలో మాదిగలకు ఒక్క స్థానం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోనైన ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఒకటి కచ్చితంగా మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ, మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పల్లెర్ల సుధాకర్ మాదిగ మాట్లాడుతూ.. ఈ ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింగ్వి మరియు సురేష్ కుమార్ రెడ్డిల పదవి కాలం ముగియడంతో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీలు ఏర్పడుతున్నాయని వాటి భర్తీకి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల అయిందని ఈనెల 16న ఆ రెండిటికీ ఎన్నిక జరగనుందని అందులో ఒకటి తెలంగాణలో అత్యధిక జన సంఖ్య గల మాదిగలకు కచ్చితంగా కేటాయించాలని అన్నారు. తెలంగాణలో మూడు లోక్ సభ స్థానాలు ఎస్సీ రిజర్వుడు ఉంటే అందులో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఈ రాజ్యసభ స్థానాలలోనైనా ఒకటికి మాదిగలకు కేటాయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల మాదిగలను మోసం చేసిన పార్టీలకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ మాదిగ జాతి నా ఎదుగుదలకు ఎంతో సహకరించారని వారి పట్ల నేను చిత్తశుద్ధితో ఉంటానని ప్రగల్బాలు పలుకుతూ లోక్ సభ స్థానాలలో మాత్రం ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి కేటాయించకుండా పార్లమెంటులో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి లోక్ సభలో ముగ్గురు తన రెడ్డి కులస్తులు ఉన్నా కూడా ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో ఒకటి రెడ్డిలకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడని ఆ స్వార్థపర ఆలోచన మానుకొని తను అన్యాయం చేసిన మాదిగ జాతికి రాజ్యసభలో సీటు కేటాయించి తన తప్పును సరిదిద్దుకోవాలని హితబు పలికారు. మునుపెన్నడు మాదిగ జాతికి పార్లమెంటులో అవకాశం లేని సందర్భం లేదని గత ప్రభుత్వాల హయాంలో ప్రతి సందర్భంలో పార్లమెంటులో మాదిగ ప్రాతినిధ్యం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి హయాంలోనే మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కనీసం ఈ రాజ్యసభలోనైనా సీటు ఇవ్వకుంటే రేపు ఏ మొహం పెట్టుకొని మాదిగల వద్దకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వస్తుందో చూస్తామని మాదిగల ఆవేదనకు, ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో 40 సీట్లకు పైగా ఉన్న శాసనమండలిలో కూడా లేదని మాదిగలకు ఒక్క సీటు కూడా లేదని ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేస్తే అందులో ఒకటి కూడా మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఈ రాజ్యసభ సీట్లలో ఒకటి కేటాయించి నమో మాదిగలకు చేసిన మోహన్ సార్ తిప్పుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో MSF జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ, రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఈదుల రాజీవ్ ప్రదీప్ మాదిగ, ఓయూ నాయకులు అందుగుల హరిప్రసాద్ మాదిగ, కనికపూడి మహేంద్ర మాదిగ, సగ్గుర్తి పుల్లయ్య మాదిగ, గాదేపక సాయి చరణ్ మాదిగ, ఎలకొండ శ్రీనాథ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- हैदराबाद में ममता नामक महिला ने अपने 2-महीने के बच्चे की हत्या कर दी है. पुलिस के अनुसार, सुबह बच्चे का पिता घर लौटा तो उसने देखा कि ममता बच्चे को जलते चूल्हे में जला रही थी. बच्चे के मुंह में कपड़ा और आंखों पर पट्टी थी. रिपोर्ट्स के मुताबिक बच्चे के लगातार रोने से परेशान होकर उसने यह कदम उठाया.1
- BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి1
- హైదరాబాద్ నగర పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించని కార్మికుల మరో వీడియో వైరల్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కార్మికులకు, వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. నిర్మాణ సంస్థలు, అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని శంభులోంగేశ్వర కాలనీ లో రేపు హోళీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామ దహనానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చురుకుగా పాల్గొన్నారు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ అందించాలని వారు తెలిపారు3
- విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి: సంగారెడ్డి సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య శాఖ అధికారులు1
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సంఘం అధ్యక్షుడు అయినటువంటి లింగశేఖర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో గల ముదిరాజ్ సభ్యులమంతా కలిసి సొంతంగా ఎవరి ప్రమేయం లేకుండా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించుకున్నాము. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముదిరాజులను గుర్తించలేదు, ఇప్పటికైనా మా గ్రామంలో ముదిరాజులను గుర్తించి మాకు ముదిరాజ్ భవనము నిర్మించుకోవడానికి నిధులను సమకూర్చాలని కోరారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ప్రత్యేక గుర్తింపు లేదని ముదిరాజులందరినీ ఐక్యతతో ఉండాలని సూచించారు. ముదిరాజులను BC-D నుంచి BC-A కు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సంగం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1. లింగ కిష్టయ్య (సలహాదారు) 2. నీరుడి చంద్రం (ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు) 3. కిచ్చుగారి స్వామి (సొసైటీ అధ్యక్షుడు) 4. కిచ్చుగారి రమేష్ (మాజీ గుడి చైర్మన్, వార్డ్ మెంబర్ ) 5. లింగ నాగరాజు (మాజీ వైస్ చైర్మన్) 6. జగ్గారి కుమార్ 7. నీరుడి బిక్షపతి (వార్డ్ మెంబర్) 8. జగ్గారి జానీ (కోశాధికారి) 9. నీరుడి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.4