Shuru
Apke Nagar Ki App…
కొండగట్టులో తృటిలో తప్పిన ప్రమాదం...తలనీలాలు సమర్పించే ప్రదేశంలో కూలిన తడకల పందిరి...ముగ్గురికి స్వల్ప గాయాలు కొండగట్టు లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల కోసం వేసిన తడకల పందిరి కూలిపోయింది. తలనీలాలు సమర్పించే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పలువురు భక్తులు, నాయి బ్రాహ్మణులు ఉండగా ఐదారుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పందిరి కూలడంతో నాయి బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా అటు భక్తులను ఇటు నాయి బ్రాహ్మణులను ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన పందిరిని అధికారులు తొలగించి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. గాలి వల్ల పందిరి కూలిందని భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
K.V.REDDY
కొండగట్టులో తృటిలో తప్పిన ప్రమాదం...తలనీలాలు సమర్పించే ప్రదేశంలో కూలిన తడకల పందిరి...ముగ్గురికి స్వల్ప గాయాలు కొండగట్టు లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల కోసం వేసిన తడకల పందిరి కూలిపోయింది. తలనీలాలు సమర్పించే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పలువురు భక్తులు, నాయి బ్రాహ్మణులు ఉండగా ఐదారుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పందిరి కూలడంతో నాయి బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా అటు భక్తులను ఇటు నాయి బ్రాహ్మణులను ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన పందిరిని అధికారులు తొలగించి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. గాలి వల్ల పందిరి కూలిందని భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్)ను తెలంగాణ ఎన్పీడీసీఎల్ టేకోవర్ చేసింది. సెస్ నే కొనసాగించాలని సెస్ పాలకవర్గం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. మెరుగైన విద్యుత్తును అందించేందుకు సిరిసిల్ల జిల్లాలో కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ ఏర్పడి గత కొంతకాలంగా సెస్ పరిధిలోనే విద్యుత్తు సప్లై కొనసాగుతుంది. సెస్ లైసెన్స్ మార్చి 31 తో ముగియడంతో NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి సిరిసిల్ల సెస్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. దాదాపు మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష అనంతరం వరుణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సెస్ లైసెన్స్ కాలం ముగియడంతో టి.జి.ఆర్.సీ ఆదేశాల మేరకు ఎన్పీడిసియల్ ను టెకోవర్ చేశామని చెప్పారు. తదుపరి ప్రభుత్వం ఆదేశాలు వచ్చేవరకు ఎంపీడీసీఎల్ పరిధిలోనే సెస్ ఉద్యోగులు పని పనిచేస్తారని, ఇది తాత్కాలికమేనని తెలిపారు. విద్యుత్ వినియోగదారులైన రైతులు, గృహస్థులు పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు తో పాటు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. సి.ఎస్.సి సెంటర్లతో పాటు మీ సేవాలో అన్ని రకాల సేవలు అందిచబడుతాయని, రైతులు వినియోగించే కరెంట్ మోటార్లకు యూనిఫాం సర్వీస్ లైన్ చార్జీల ద్వారా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తే అధిక సర్వీస్ పొందే అవకాశం ఉందని తెలిపారు. ఆన్ లైన్ లో కనెక్షన్ ఇవ్వడం ద్వారా అవినీతికి ఆస్కారం ఉండదని చెప్పారు. సెస్ ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్నామని, కోటి రూపాయల ప్రమాద భీమా, పది లక్షల రుపాయల ప్రొఫెషన్ భీమా అందించడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు పెండింగ్ లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చే జూన్ వరకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని సీఎండి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- వరంగల్ జిల్లా గీసుగోండ మండలం కొనయమాకులలోని పిఎస్ఆర్ గార్డెన్‌లో బుధవారం సంగెం, గీసుగోండ మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్క్ కారణంగా భూములు కోల్పోయిన రైతులకు రాజీవ్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు సంబంధించిన ఇంటి స్థలాల పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇది ఉపశమనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.2
- సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మార్చి 31. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇందుప్రియల్ గ్రామంలో శ్రీ సీతారామ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి మరియు గ్రామస్తులు అంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించారు. PACS చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మరియు గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మాట్లాడుతూ ఐదు రోజులుగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవం విజయవంతంగా జరిపించినందుకు గ్రామస్తులకు మరియు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- 4,000 కిలోగ్రాములకు పైగా కల్తీ పేస్ట్ మరియు 6,000 కిలోగ్రాముల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హసన్ అలీ (55) అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ మరియు హెచ్-ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్పత్తి కేంద్రం అత్యంత అపరిశుభ్రంగా ఉందని నివేదించబడటంతో, దుకాణాల్లో అమ్మే పేస్ట్‌ను కొనుగోలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు••£1
- కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులపాటు జరిగే హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణశోబితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి మూడు రోజులపాటు నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా చలవ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేశఖండన, మాల విరమణ, ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే కొనసాగించబడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4 నుండి అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆలయ పూజారులు కపీంద్రశర్మ స్పష్టం చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా వెయ్యి మంది పోలీసులతో పకడ్బందీ చర్యలు చేపట్టారు.4