Shuru
Apke Nagar Ki App…
టెక్స్‌టైల్ పార్క్ వల్ల నష్టపోయిన రైతులకు ఇంటి స్థలాలు అందజేత వరంగల్ జిల్లా గీసుగోండ మండలం కొనయమాకులలోని పిఎస్ఆర్ గార్డెన్‌లో బుధవారం సంగెం, గీసుగోండ మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్క్ కారణంగా భూములు కోల్పోయిన రైతులకు రాజీవ్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు సంబంధించిన ఇంటి స్థలాల పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇది ఉపశమనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
M D Azizuddin
టెక్స్‌టైల్ పార్క్ వల్ల నష్టపోయిన రైతులకు ఇంటి స్థలాలు అందజేత వరంగల్ జిల్లా గీసుగోండ మండలం కొనయమాకులలోని పిఎస్ఆర్ గార్డెన్‌లో బుధవారం సంగెం, గీసుగోండ మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్క్ కారణంగా భూములు కోల్పోయిన రైతులకు రాజీవ్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు సంబంధించిన ఇంటి స్థలాల పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇది ఉపశమనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల గండి తండాకు చెందిన బోడ వెంకన్న, తేజావత్ శ్రీహరి అనే ఇద్దరు యువకులు బ్యాంకు పనుల నిమిత్తం గంగారం మండలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మడగూడెం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, వారిని గంగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.1
- శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- 4,000 కిలోగ్రాములకు పైగా కల్తీ పేస్ట్ మరియు 6,000 కిలోగ్రాముల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హసన్ అలీ (55) అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ మరియు హెచ్-ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్పత్తి కేంద్రం అత్యంత అపరిశుభ్రంగా ఉందని నివేదించబడటంతో, దుకాణాల్లో అమ్మే పేస్ట్‌ను కొనుగోలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు••£1
- సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రామీణ ప్రజలు మూఢనమ్మకాలను తేలుతున్నారు. వరస మరణాలతో గ్రామానికి కీడు సోకిందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామస్థులు ఊరు బయట వంట వార్పుతో రోజంతా గడిపారు. గత రెండు ,మూడు నెలల నుండి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామ పురోహితున్ని సంప్రదించగా గ్రామానికి కీడు సోకిందని సెలవిచ్చాడట. ఇంకేముంది గ్రామం లో ఉన్న ప్రజలు ఒక రోజు ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్ళాలని సూచించారు. అయితే ఒక రోజు ముందు గ్రామం లో డప్పు చాటింపు చేశారు. ఈరోజు తెల్లవారుఝామున ఇండ్లకు తాళాలు వేసి కీడు వంటలకు వెళ్ళారు. ఊరు బయట వంటావార్పు తో విందు భోజనాలు ఆరగించి రోజంతా గడిపారు. సూర్యోదయాన్ని కంటే ముందే బయటికి వెళ్లిన గ్రామస్తులు సూర్యాస్తమయం అయ్యాక ఇళ్లకు చేరారు. కీడు వంటలకు వెళ్తతామని చెప్పినప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగాయని అంటున్నారు.1
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- వరంగల్ జిల్లా గీసుగోండ మండలం కొనయమాకులలోని పిఎస్ఆర్ గార్డెన్‌లో బుధవారం సంగెం, గీసుగోండ మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్క్ కారణంగా భూములు కోల్పోయిన రైతులకు రాజీవ్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు సంబంధించిన ఇంటి స్థలాల పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇది ఉపశమనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.2