బాన్సువాడలో అనుమతులు లేని పాఠశాలపై విద్యాశాఖ అధికారుల చర్యలు AIPSU పిర్యాదుతో శ్రీ ఛైతన్య పాఠశాలలో తనిఖీలు .... బాన్సువాడ, ఆగస్టు 27: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా 8వ, 9వ తరగతులను నిర్వహిస్తున్న బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మండల విద్యాశాఖ కార్యాలయం (MEO) సిబ్బంది భాను పాఠశాలను తనిఖీ చేసి, అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించడాన్ని గుర్తించి తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సంబంధిత పాఠశాలకు 8వ, 9వ తరగతులు నిర్వహించేందుకు డీఈఓ కార్యాలయం లేదా సంబంధిత విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు ఫీజుల పేరుతో వసూలు చేస్తూ అక్రమంగా తరగతులు నిర్వహించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ, అనుమతులు లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తును ప్రమాదంలో పడవేయవద్దని, ప్రభుత్వ అనుమతులు ఉన్న విద్యాసంస్థల్లోనే ప్రవేశాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, తమ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం స్వాగతించదగ్గ విషయమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను, అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. అలాగే, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను వడ్డీతో సహా తిరిగి చెల్లించి, విద్యార్థులను ప్రభుత్వ అనుమతులు కలిగిన ఇతర పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా విద్యాసంస్థలను నిర్వహించే యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో RYF ఉమ్మడి జిల్లా కార్యదర్శి పిట్ల నరేష్, AIPSU నాయకులు సూర్యపాల్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

- నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు1
- వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు మరోసారి ఫిర్యాదు – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో రాకాసిపేట్‌లోని వివిధ వార్డులకు చెందిన బాధ్యత వహిస్తున్న కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి మరోసారి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్‌లోని 38 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అయితే వార్డుల్లోని ప్రజలు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోకపోతే బోధన్‌లోని వీధి కుక్కలను పట్టుకుని బోధన్ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి వదిలిపెట్టాల్సి వస్తుందని జునైద్ అహ్మద్ ఖలీల్ హెచ్చరించారు. అలాగే బోధన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా స్పందించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియా ద్వారా కోరారు. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు1
- చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.1
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1