logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణ అరసవిల్లిలో పల్లెనిద్ర శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలోని 26వ డివిజన్ అరస వల్లిలో వన్ టౌన్ పోలీస్స్టేషన్ ఎస్ఐ హరికృష్ణ పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో రాత్రి బస చేసిన ఆయన స్థానిక యువత, గ్రామస్తులతో సమావేశమై చట్టాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, రాత్రి వేళల్లో గుమిగూడడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొ రేషన్ క్లస్టర్ ఇన్చార్జ్ ఉంగటి రమణమూర్తి, పట్టణ ఆర్గనైజర్ సెక్రట రీ దండసి జ్యోతి భాస్కర్, బీసీ సెల్ సెక్రటరీ ఉంగటి రామ్మోహన్, డబ్బీరు వెంకట్రావు, స్థానిక యువకులు పాల్గొన్నారు.

12 hrs ago
user_Venkata Ramana Murthy K
Venkata Ramana Murthy K
Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago
dbf9a5cc-61fd-4bd6-a38b-d15e466df473

శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణ అరసవిల్లిలో పల్లెనిద్ర శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలోని 26వ డివిజన్ అరస వల్లిలో వన్ టౌన్ పోలీస్స్టేషన్ ఎస్ఐ హరికృష్ణ పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో రాత్రి బస చేసిన ఆయన స్థానిక యువత, గ్రామస్తులతో సమావేశమై చట్టాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, రాత్రి వేళల్లో గుమిగూడడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొ రేషన్ క్లస్టర్ ఇన్చార్జ్ ఉంగటి రమణమూర్తి, పట్టణ ఆర్గనైజర్ సెక్రట రీ దండసి జ్యోతి భాస్కర్, బీసీ సెల్ సెక్రటరీ ఉంగటి రామ్మోహన్, డబ్బీరు వెంకట్రావు, స్థానిక యువకులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్ ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.
    1
    శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్
ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    1
    సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్  మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్
రాజాం /సంతకవిటి, షురూ
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు  నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి  సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్  దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    1
    విజయవాడ గురించి వర్ణిస్తున్న  అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 min ago
  • పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం
పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో  సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    1
    నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ
నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని  సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    1
    బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు
విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు.
ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు..
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు.
ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపoడి : కలెక్టర్ శ్రీకాకుళం : ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణ పై ఆయన వారాంతపు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మ్ 6,7,8 క్లైయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పైన వాటి వివరాలు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యంతరలేమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈనెల 22 మరియు 23వ తేదీలలో స్వీకరించిన ఫారాలు యొక్క వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. ప్రత్యేక జాబితా సరవణకు సంబంధించి నోటీసులు, ఇప్పటి వరకు జరిగిన వివరాలను ఆయన తెలిపారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బిఎల్ ద్వారా డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు
    1
    శ్రీకాకుళం జిల్లా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపoడి : కలెక్టర్ 
శ్రీకాకుళం : ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణ పై ఆయన వారాంతపు సమావేశం మంగళవారం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మ్ 6,7,8 క్లైయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పైన వాటి వివరాలు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యంతరలేమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈనెల 22 మరియు 23వ తేదీలలో స్వీకరించిన ఫారాలు యొక్క వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. ప్రత్యేక జాబితా సరవణకు సంబంధించి నోటీసులు, ఇప్పటి వరకు జరిగిన వివరాలను ఆయన తెలిపారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బిఎల్ ద్వారా డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.