Shuru
Apke Nagar Ki App…
శ్రీరాం అమ్మాజీ జన్మదిన సందర్బoగా అంగన్వాడి కేంద్రంలో పిల్లలకుపలకలు పంపిణి జగ్గయ్యపేట పట్టణం లోని 14వ వార్డులోని అంగన్వాడి కేంద్రంలో మంగళవారం జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సతీమణి శ్రీరాం అమ్మాజీ (శ్రీదేవి ) జన్మదిన సందర్బoగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు పలకలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ రాష్ట్ర ప్రతినిదిలు పేరూరి వెంకట లక్ష్మి నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు చేతుల మీదగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా నేతలు స్వామి కృష్ణ, పెనుగొండ రామకృష్ణ, రాయపూడి రమేష్, మహిళా విభాగం జిల్లా ప్రతినిధులు వాసా నాగమణి, రాయపూడి నాగలక్ష్మి రమేష్, వుటుకూరి అలేఖ్య మరియు అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.
Kakaraparthi someswarao

More news from తెలంగాణ and nearby areas
- Post by 91241
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- * Delhi: * ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. * ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. * ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు. * జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.1
- గుంటూరు అమరావతిని సందర్శించిన పలకరించిన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు.సోమవారం అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన బిల్ గేట్స్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్కు CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.1
- *కొండపల్లి అరుణ నగర్ లో నిరసన* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* కొండపల్లిలోని అరుణ నగర్ కాలనీ వాసులు క్వారీ, క్రషర్ లారీల రాకపోకల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.లారీల వల్ల వెలువడే దుమ్ము, ధూళి కారణంగా నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, అధికారులు వెంటనే స్పందించి కాలనీలోకి లారీల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.1