logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దపల్లి ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామరాజు రైతుల పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే సంకల్పంతో ఎల్లమ్మ కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఆదివారం రామగుండం మండలంలోని గర్రెపల్లి, బొంతకుంటపల్లి, రంగంపల్లి, కోమండ్లపల్లి గ్రామాలలో, రైతుల సాగునీటి అవసరాల కోసం ₹20 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లమ్మ కాలువ 15 నుండి 20 సంవత్సరాలుగా పూడికతో నిండిపోయిందని, దీనివల్ల వేలాది ఎకరాలలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇంతకాలం ఏ నాయకుడూ దీనిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. బొంతకుంటపల్లి సర్పంచ్ రైతులను వెంటబెట్టుకుని వచ్చి ఈ సమస్యను తన దృష్టికి తీసుకురాగా, తక్షణమే స్పందించి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ₹20 లక్షలు మంజూరు చేయించి పనులు మొదలుపెట్టించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో మరో ₹10 నుండి ₹15 లక్షల రూపాయలు అందజేసి కాలువను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తానని విజయరామరాజు హామీ ఇచ్చారు. వర్షాలు ప్రారంభమయ్యే లోపే రెండు, మూడు జేసీబీలను ఏర్పాటు చేసి ఐదు కిలోమీటర్ల పొడవున ఉన్న కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ, ఎస్సారెస్పీ అధికారులు, పోలీసుల సహకారంతో పనులు చేపట్టాలని, కాలువను ఆక్రమించుకున్న రైతులను సైతం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సాగునీటి సరఫరాను అడ్డుకునే ఒక్కరిద్దరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి పంటలు పండిస్తున్నారని, అటువంటి అన్నదాతలకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాగునీటి కాలువలను ఎల్లప్పుడూ పరిరక్షిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_SRAVAN KUMAR
SRAVAN KUMAR
Astrologer రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
2 hrs ago
08334a8c-5d8d-4750-b08d-2ea1d1889656

పెద్దపల్లి ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామరాజు రైతుల పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే సంకల్పంతో ఎల్లమ్మ కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఆదివారం రామగుండం మండలంలోని గర్రెపల్లి, బొంతకుంటపల్లి, రంగంపల్లి, కోమండ్లపల్లి గ్రామాలలో, రైతుల సాగునీటి అవసరాల కోసం ₹20 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లమ్మ కాలువ 15 నుండి 20 సంవత్సరాలుగా పూడికతో నిండిపోయిందని, దీనివల్ల వేలాది ఎకరాలలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇంతకాలం ఏ నాయకుడూ దీనిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. బొంతకుంటపల్లి సర్పంచ్ రైతులను వెంటబెట్టుకుని వచ్చి ఈ సమస్యను తన దృష్టికి తీసుకురాగా, తక్షణమే స్పందించి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ₹20 లక్షలు మంజూరు చేయించి పనులు మొదలుపెట్టించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో మరో ₹10 నుండి ₹15 లక్షల రూపాయలు అందజేసి కాలువను

76ce86b2-bd7f-42d4-9b25-3233ba0d35f4

పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తానని విజయరామరాజు హామీ ఇచ్చారు. వర్షాలు ప్రారంభమయ్యే లోపే రెండు, మూడు జేసీబీలను ఏర్పాటు చేసి ఐదు కిలోమీటర్ల పొడవున ఉన్న కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ, ఎస్సారెస్పీ అధికారులు, పోలీసుల సహకారంతో పనులు చేపట్టాలని, కాలువను ఆక్రమించుకున్న రైతులను సైతం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సాగునీటి సరఫరాను అడ్డుకునే ఒక్కరిద్దరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి పంటలు పండిస్తున్నారని, అటువంటి అన్నదాతలకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాగునీటి కాలువలను ఎల్లప్పుడూ పరిరక్షిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ నస్పూర్ మండలంలో గల సింగరేణి కాలరీస్ కంపెనీలో ఉపరితలంపై పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, జీఎం శ్రీనివాస్ వారికి ఎండ తీవ్రత నుండి ఉపశమనం కల్పించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరియు గొడుగులు అందజేశారు. ఈ చర్య కార్మికులకు వేడి నుండి రక్షణ కల్పించడానికి ఉద్దేశించబడింది. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపరితలంపై పనిచేసే కార్మికులకే కాకుండా, మ్యానువే దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రంజాన్ మాసంలో ఉపరితలంపై పనిచేస్తున్న కార్మికుల కోసం నీటి నిల్వను తగినంతగా ఉంచాలని, కార్మికులు ఎల్లప్పుడూ నీరు తాగుతూ, వారి కోసం ఏర్పాటు చేసిన నీడలో ఉండాలని ఆయన సూచించారు. ఎండ తీవ్రత నుండి కార్మికులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
    1
    మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ నస్పూర్ మండలంలో గల సింగరేణి కాలరీస్ కంపెనీలో ఉపరితలంపై పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, జీఎం శ్రీనివాస్ వారికి ఎండ తీవ్రత నుండి ఉపశమనం కల్పించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరియు గొడుగులు అందజేశారు. ఈ చర్య కార్మికులకు వేడి నుండి రక్షణ కల్పించడానికి ఉద్దేశించబడింది.

ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపరితలంపై పనిచేసే కార్మికులకే కాకుండా, మ్యానువే దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రంజాన్ మాసంలో ఉపరితలంపై పనిచేస్తున్న కార్మికుల కోసం నీటి నిల్వను తగినంతగా ఉంచాలని, కార్మికులు ఎల్లప్పుడూ నీరు తాగుతూ, వారి కోసం ఏర్పాటు చేసిన నీడలో ఉండాలని ఆయన సూచించారు. ఎండ తీవ్రత నుండి కార్మికులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
    user_RAJESH KUMAR (GODsSON)
    RAJESH KUMAR (GODsSON)
    Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాధారణ ప్రయాణికుడి మాదిరిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక వాహనం లేదా ఆర్భాటం లేకుండా, ఆయన సామాన్య ప్రయాణికుడిలా ట్రైన్‌లో ప్రయాణించడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి జూపల్లి శనివారం హైదరాబాద్ నుండి వందే భారత్ ట్రైన్‌లో ఆసిఫాబాద్ జిల్లాకు బయలుదేరారు. ప్రయాణం మధ్యలో, మంత్రి తోటి ప్రయాణికులతో కలిసి ట్రైన్‌లో అందించిన భోజనం చేశారు. మంత్రి చూపిన ఈ నిరాడంబరతను చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోగా, కొందరు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో జూపల్లి కృష్ణారావు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకుని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
    1
    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాధారణ ప్రయాణికుడి మాదిరిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక వాహనం లేదా ఆర్భాటం లేకుండా, ఆయన సామాన్య ప్రయాణికుడిలా ట్రైన్‌లో ప్రయాణించడం గమనార్హం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి జూపల్లి శనివారం హైదరాబాద్ నుండి వందే భారత్ ట్రైన్‌లో ఆసిఫాబాద్ జిల్లాకు బయలుదేరారు. ప్రయాణం మధ్యలో, మంత్రి తోటి ప్రయాణికులతో కలిసి ట్రైన్‌లో అందించిన భోజనం చేశారు. మంత్రి చూపిన ఈ నిరాడంబరతను చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోగా, కొందరు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో జూపల్లి కృష్ణారావు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకుని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కొందరు యువకులు బైక్ ర్యాలీలతో పెద్ద హంగామా సృష్టించారు. నగరంలోని ప్రధాన బస్టాండ్ మార్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న ఒక లారీపైకి ఎక్కి, ఏకంగా దాని అద్దంపై నిలబడి విన్యాసాలు చేయడం స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ నిర్లక్ష్యపు సంబరాలపై వాహనదారులు, స్థానికులు స్పందిస్తూ, గెలుపు సంబరాలు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.
    1
    ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కొందరు యువకులు బైక్ ర్యాలీలతో పెద్ద హంగామా సృష్టించారు. నగరంలోని ప్రధాన బస్టాండ్ మార్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న ఒక లారీపైకి ఎక్కి, ఏకంగా దాని అద్దంపై నిలబడి విన్యాసాలు చేయడం స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ నిర్లక్ష్యపు సంబరాలపై వాహనదారులు, స్థానికులు స్పందిస్తూ, గెలుపు సంబరాలు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలోని హనుమాజిపల్లి గ్రామ రైతులు స్థానిక డీసీఎంఎస్ కేంద్రంలో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంగపల్లిలోని ఐకేపీ కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు ఉన్నప్పటికీ, సిబ్బంది కమీషన్ల కోసం అక్కడ వడ్లు కొనుగోలు చేయవద్దని చెబుతున్నారని రైతులు తీవ్రంగా ఆరోపించారు. ఈ నెల 20న తూకం వేయాల్సిన వడ్లు సైతం ఇప్పటికీ కొలవలేదని, దీనివల్ల వర్షాలు కురిస్తే తమ పంట పూర్తిగా నష్టపోతామని రైతులు వాపోయారు. తమ పంటలకు నష్టం వాటిల్లకముందే వడ్ల కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని హనుమాజిపల్లి గ్రామ రైతులు గట్టిగా డిమాండ్ చేశారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలోని హనుమాజిపల్లి గ్రామ రైతులు స్థానిక డీసీఎంఎస్ కేంద్రంలో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంగపల్లిలోని ఐకేపీ కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు ఉన్నప్పటికీ, సిబ్బంది కమీషన్ల కోసం అక్కడ వడ్లు కొనుగోలు చేయవద్దని చెబుతున్నారని రైతులు తీవ్రంగా ఆరోపించారు. ఈ నెల 20న తూకం వేయాల్సిన వడ్లు సైతం ఇప్పటికీ కొలవలేదని, దీనివల్ల వర్షాలు కురిస్తే తమ పంట పూర్తిగా నష్టపోతామని రైతులు వాపోయారు.

తమ పంటలకు నష్టం వాటిల్లకముందే వడ్ల కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని హనుమాజిపల్లి గ్రామ రైతులు గట్టిగా డిమాండ్ చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • హాజీపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6:30 గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమై, ఈదురు గాలులు వీచాయి. మండలంలోని ముల్కల, రాపల్లి, గుడిపేట తదితర గ్రామాలలో దంచి కొట్టిన భారీ వర్షం ఒక్కసారిగా కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ముఖ్యంగా, హాజీపూర్ మండలంలోని ముల్కలలో వర్ష బీభత్సం అధికంగా ఉంది.
    1
    హాజీపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6:30 గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమై, ఈదురు గాలులు వీచాయి. మండలంలోని ముల్కల, రాపల్లి, గుడిపేట తదితర గ్రామాలలో దంచి కొట్టిన భారీ వర్షం ఒక్కసారిగా కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ముఖ్యంగా, హాజీపూర్ మండలంలోని ముల్కలలో వర్ష బీభత్సం అధికంగా ఉంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • కరీంనగర్‌లో టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, టీయూడబ్ల్యూజే హెచ్143 కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం కోసం మరో పోరాటం అనివార్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాల తిరుమల్, కోశాధికారి జేరిపోతుల సంపత్, ఎలక్ట్రానిక్ మీడియా కో కన్వీనర్ హృషీకేష్, అలాగే జిల్లా నాయకులు శ్రీనివాస్, వెంకటరమణ, ప్రశాంత్, సుధాకర్, శ్రీధర్, సురేందర్, దేవేందర్ తదితరులు పాలుపంచుకున్నారు.
    1
    కరీంనగర్‌లో టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, టీయూడబ్ల్యూజే హెచ్143 కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం కోసం మరో పోరాటం అనివార్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాల తిరుమల్, కోశాధికారి జేరిపోతుల సంపత్, ఎలక్ట్రానిక్ మీడియా కో కన్వీనర్ హృషీకేష్, అలాగే జిల్లా నాయకులు శ్రీనివాస్, వెంకటరమణ, ప్రశాంత్, సుధాకర్, శ్రీధర్, సురేందర్, దేవేందర్ తదితరులు పాలుపంచుకున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    12 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలోని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న ఈత వనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈదురు గాలుల కారణంగా అగ్ని మరింత వేగంగా వ్యాపించింది. మంటల గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలోని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న ఈత వనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈదురు గాలుల కారణంగా అగ్ని మరింత వేగంగా వ్యాపించింది. మంటల గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.