బంజారాలతో కలిసి నృత్యం చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బంజారాలతో కలిసి నృత్యం చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది
బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కోన లక్ష్మి(72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ లో నివాసం ఉండే లక్ష్మీ గొంతులో కత్తి ఘాట్లు ఉండడంతో హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. గతంలో వృధ్ధురాలిపై దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చి చూసేసరికి, రక్తం మడుగులో పడిఉన్న తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహం ఏరియా ఆసుపత్రికి తరలించారు.3
- గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.1
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.4
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం. మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.1
- నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.1