*శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం* *అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు* *స్వీయారక్షణార్ధం కాలనిలలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.* *అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.* *సరైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలు గుర్తింపు.* *వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు.* జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం వేములవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో కొనరవుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామం మరియు కమ్మరి పేట తండాలల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 ద్విచక్ర వాహనాలను గుర్తించి,సంబంధిత యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అనుమానిత వ్యక్తులను (సస్పెక్ట్స్) తనిఖీ చేసి, వారి ప్రస్తుత కదలికలు, స్థితిగతులపై ఆరా తీశారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం (Sense of Security) కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కాలనిలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డిఎస్పీ గారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో చందుర్తి సర్కిల్ సి.ఐ రవీందర్, ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి, రమేష్, మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
*శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం* *అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు* *స్వీయారక్షణార్ధం కాలనిలలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.* *అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.* *సరైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలు గుర్తింపు.* *వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు.* జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం వేములవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో కొనరవుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామం మరియు కమ్మరి
పేట తండాలల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 ద్విచక్ర వాహనాలను గుర్తించి,సంబంధిత యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అనుమానిత వ్యక్తులను (సస్పెక్ట్స్) తనిఖీ చేసి, వారి ప్రస్తుత కదలికలు, స్థితిగతులపై ఆరా తీశారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం (Sense of Security) కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.ఈ కార్యక్రమం
ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కాలనిలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా
ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డిఎస్పీ గారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో చందుర్తి సర్కిల్ సి.ఐ రవీందర్, ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి, రమేష్, మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
- సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: ఎమ్మెల్యే గంగుల కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విమర్శించారు.బీఆర్‌ఎస్ హయాంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు,రూ.5 లక్షల ఉచిత ప్రమాద భీమా,చలాన్ల రద్దు అందించామని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రకటించిన రూ.12 వేల సాయం,రూ.1,000 కోట్లతో సంక్షేమ బోర్డు హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆటో కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు.2
- మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.2
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.2
- గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1
- నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పటేల్MLC, TRP పార్టీ అధ్యక్షుడు నారాయణ విద్యాసంస్థల విద్యార్థుల ర్యాంకుల అడ్వటైజ్మెంట్ పై ప్రశ్నిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. ఇది చాలా బాధాకరం MLC పదవిలో ఉన్నారు మీరు కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య మరియు నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా శాసనమండలిలో నియమ నిబంధనలతో కఠిన చట్టాలను అమలు ఆచరణలోకి తీసుకొచ్చేలా ప్రశ్నించు యుద్ధం చెయ్ ప్రభుత్వం పైన శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఎదగడానికి కోసమో ప్రయత్నించకండి దయచేసి. తిట్టడం వల్ల బెదిరించడం వల్ల తాత్కాలిక ఉపశమనం కూడా దొరకదు.1
- రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం సేవలను కొనియాడిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్‌లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.1