కన్నెపల్లి మండల కేంద్ర సంఘ భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు కన్నెపల్లి మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘ భవన ఆవరణలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణులు గురువారం ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ. సృష్టికి మూల పురుషుడు శిల్పకళకు ఆదిగురువు విశ్వకర్మ భగవానుడని.ఆయన ఆశీస్సులతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు విశ్వబ్రాహ్మణుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పుసాల వెంకటనరసయ్యచారి భీమోజు మురళిచారి గిరిబాబుచారి కిరణ్ చారి పొనగంటి స్వామిచారి రంగు మనోహర్ చారి దొంతుల విష్ణువర్ధన్ చారి పూసాల మహేష్ చారి రాములు చారి బ్రహ్మయ్య చారి ముమ్మడి లక్ష్మీనారాయణ చారి జంబోజు సత్యనారాయణ చారి శ్రీనివాస్ చారి చంద్రశేఖర్ చారి యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కన్నెపల్లి మండల కేంద్ర సంఘ భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు కన్నెపల్లి మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘ భవన ఆవరణలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణులు గురువారం ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ. సృష్టికి మూల పురుషుడు శిల్పకళకు ఆదిగురువు విశ్వకర్మ భగవానుడని.ఆయన ఆశీస్సులతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు విశ్వబ్రాహ్మణుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పుసాల వెంకటనరసయ్యచారి భీమోజు మురళిచారి గిరిబాబుచారి కిరణ్ చారి పొనగంటి స్వామిచారి రంగు మనోహర్ చారి దొంతుల విష్ణువర్ధన్ చారి పూసాల మహేష్ చారి రాములు చారి బ్రహ్మయ్య చారి ముమ్మడి లక్ష్మీనారాయణ చారి జంబోజు సత్యనారాయణ చారి శ్రీనివాస్ చారి చంద్రశేఖర్ చారి యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.3
- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.1
- కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- 56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1