logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీగా తిరుపతికి ఎమ్మెల్యే అభినందనలు తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీగా నియమితులైన కే.తిరుపతి బుధవారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. నియామకాపత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా తిరుపతి అందుకున్నారు. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి తెలియజేశారు

1 hr ago
user_Bellampalli news
Bellampalli news
Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago
3ff35057-4943-45aa-b160-0f8f002b5700

టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీగా తిరుపతికి ఎమ్మెల్యే అభినందనలు తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీగా నియమితులైన కే.తిరుపతి బుధవారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. నియామకాపత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా తిరుపతి అందుకున్నారు. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి తెలియజేశారు

More news from తెలంగాణ and nearby areas
  • ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    1
    ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు 
గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను:
1)	పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
2)	మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు.
ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన
ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్‌లో దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్తో పాటు పలువురు ముఖ్య నేతలు పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య అందించిన సేవలను నాయకులు, కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
    4
    కరీంనగర్‌లో దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్తో పాటు పలువురు ముఖ్య నేతలు పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య అందించిన సేవలను నాయకులు, కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
    1
    టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు
అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.
    1
    కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం**
*కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు*
*బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్*
ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు.
పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    23 hrs ago
  • డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? ​జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ​ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ​ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ​ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ​కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు?
​జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు.
​ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు 
​ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది.
​ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
​కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Sriramula srinivas
    Sriramula srinivas
    Local News Reporter జగిత్యాల రూరల్, జగిత్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
    1
    ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.