logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి శుక్రవారం నాడు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మానసా దేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా, 108 శివలింగాలకు, జంట నాగులకు జలాభిషేకం నిర్వహించారు. తమ మొక్కులు నెరవేర్చుకుంటూ, ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ అమ్మవార్లకు ముడుపులు కూడా కట్టారు. కాసింపేట గ్రామంలోని మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం, మానసా దేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు.

14 hrs ago
user_Vodnala thirupthi
Vodnala thirupthi
గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
14 hrs ago

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి శుక్రవారం నాడు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మానసా దేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా, 108 శివలింగాలకు, జంట నాగులకు జలాభిషేకం నిర్వహించారు. తమ మొక్కులు నెరవేర్చుకుంటూ, ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ అమ్మవార్లకు ముడుపులు కూడా కట్టారు. కాసింపేట గ్రామంలోని మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం, మానసా దేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి శుక్రవారం నాడు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మానసా దేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా, 108 శివలింగాలకు, జంట నాగులకు జలాభిషేకం నిర్వహించారు. తమ మొక్కులు నెరవేర్చుకుంటూ, ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ అమ్మవార్లకు ముడుపులు కూడా కట్టారు. కాసింపేట గ్రామంలోని మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం, మానసా దేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు.
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి శుక్రవారం నాడు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మానసా దేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా, 108 శివలింగాలకు, జంట నాగులకు జలాభిషేకం నిర్వహించారు. తమ మొక్కులు నెరవేర్చుకుంటూ, ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ అమ్మవార్లకు ముడుపులు కూడా కట్టారు.

కాసింపేట గ్రామంలోని మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం, మానసా దేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • కరీంనగర్ నగరపాలక సంస్థ మరియు జిల్లా యువజన, క్రీడా శాఖ (DYSO) సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. మే 11న అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 12 వరకు విజయవంతంగా కొనసాగింది. దాదాపు 17 క్రీడాంశాలలో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారని మేయర్ తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులు మానసికంగా బలంగా మారతారని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు నగరపాలక సంస్థ పాలు, గుడ్లు, అరటిపండ్లు, తాగునీరు వంటి పౌష్టికాహార సదుపాయాలను అందించడమే కాకుండా, కోచ్‌లకు తగిన గౌరవ వేతనం కూడా అందజేసినట్లు వివరించారు. భవిష్యత్తులో కరీంనగర్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన ప్రోత్సాహం, వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని మేయర్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు రాబోయే రోజుల్లో 3 నుంచి 5 ప్రధాన క్రీడాంశాలలో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిబిరాన్ని విజయవంతం చేసిన జిల్లా క్రీడా శాఖ అధికారులను, కోచ్‌లను, తల్లిదండ్రులను, పాల్గొన్న విద్యార్థులను, మరియు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్ రవీందర్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సువార్త మరియు మహమ్మద్ ఆయాజ్, DYSO శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ జనార్ధన్ రెడ్డి, SGF సెక్రెటరీ వేణు గోపాల్, నగరపాలక సంస్థ అధికారులు, కో-ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు సహా పలువురు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ నగరపాలక సంస్థ మరియు జిల్లా యువజన, క్రీడా శాఖ (DYSO) సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. మే 11న అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 12 వరకు విజయవంతంగా కొనసాగింది. దాదాపు 17 క్రీడాంశాలలో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారని మేయర్ తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులు మానసికంగా బలంగా మారతారని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు నగరపాలక సంస్థ పాలు, గుడ్లు, అరటిపండ్లు, తాగునీరు వంటి పౌష్టికాహార సదుపాయాలను అందించడమే కాకుండా, కోచ్‌లకు తగిన గౌరవ వేతనం కూడా అందజేసినట్లు వివరించారు.

భవిష్యత్తులో కరీంనగర్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన ప్రోత్సాహం, వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని మేయర్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు రాబోయే రోజుల్లో 3 నుంచి 5 ప్రధాన క్రీడాంశాలలో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిబిరాన్ని విజయవంతం చేసిన జిల్లా క్రీడా శాఖ అధికారులను, కోచ్‌లను, తల్లిదండ్రులను, పాల్గొన్న విద్యార్థులను, మరియు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్ రవీందర్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సువార్త మరియు మహమ్మద్ ఆయాజ్, DYSO శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ జనార్ధన్ రెడ్డి, SGF సెక్రెటరీ వేణు గోపాల్, నగరపాలక సంస్థ అధికారులు, కో-ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు సహా పలువురు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    14 hrs ago
  • తెలంగాణలో రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతు జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు అన్ని పంటలకు ₹500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని, రైతు కూలీలకు ₹12,000, కౌలు రైతులకు ₹15,000 ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని రామారావు ఆరోపించారు. రుణమాఫీని అరకొరగా చేసి వదిలేసిందని, ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్, యాసంగి సీజన్ ముగిసినా కంటి తుడుపుగా కేవలం రెండు ఎకరాలకు మాత్రమే భరోసా డబ్బులు ఇచ్చి, 80 శాతం నిధులను విడుదల చేయక చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేస్తుండగా, ఖరీఫ్ రైతు భరోసా నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, ప్రైవేట్ దళారులకు మేలు చేసిందని విమర్శించారు. తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి ₹1,200 కోట్ల రూపాయలను నిలువు దోపిడీ చేసిందని ఆరోపించారు. ఎరువుల పంపిణీలో యాప్ పేరుతో రైతులను దగా చేస్తోందని, విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోందని పోలాడి రామారావు అన్నారు. రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినేషన్ పద్ధతి దారుణమని, రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కనీస దృష్టి పెట్టకుండా మూలన పడేశారని కూడా విమర్శించారు. తమ డిమాండ్ల సాధనకు కరీంనగర్‌లో తలపెట్టిన రైతు సమర భేరిని విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. త్వరలో లక్షలాది మందితో పార్టీలకు అతీతంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వంపై సమర రణ భేరి గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ఉద్యమిస్తామని రామారావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కరివేద సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహా రావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణలో రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతు జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

రైతులకు అన్ని పంటలకు ₹500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని, రైతు కూలీలకు ₹12,000, కౌలు రైతులకు ₹15,000 ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని రామారావు ఆరోపించారు. రుణమాఫీని అరకొరగా చేసి వదిలేసిందని, ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్, యాసంగి సీజన్ ముగిసినా కంటి తుడుపుగా కేవలం రెండు ఎకరాలకు మాత్రమే భరోసా డబ్బులు ఇచ్చి, 80 శాతం నిధులను విడుదల చేయక చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేస్తుండగా, ఖరీఫ్ రైతు భరోసా నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, ప్రైవేట్ దళారులకు మేలు చేసిందని విమర్శించారు. తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి ₹1,200 కోట్ల రూపాయలను నిలువు దోపిడీ చేసిందని ఆరోపించారు.

ఎరువుల పంపిణీలో యాప్ పేరుతో రైతులను దగా చేస్తోందని, విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోందని పోలాడి రామారావు అన్నారు. రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినేషన్ పద్ధతి దారుణమని, రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కనీస దృష్టి పెట్టకుండా మూలన పడేశారని కూడా విమర్శించారు.

తమ డిమాండ్ల సాధనకు కరీంనగర్‌లో తలపెట్టిన రైతు సమర భేరిని విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. త్వరలో లక్షలాది మందితో పార్టీలకు అతీతంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వంపై సమర రణ భేరి గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ఉద్యమిస్తామని రామారావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కరివేద సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహా రావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఔట్‌సోర్సింగ్ సానిటేషన్ సిబ్బందితో ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎల్. రమాదేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, వేసవి సెలవుల సమయంలో ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, భక్తుల వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంగణాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, అంకితభావంతో పనిచేసి పరిశుభ్రతను కాపాడిన సానిటేషన్ సిబ్బంది సేవలను ఆమె ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈవో రమాదేవి ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు, క్రిమికీటకాల నివారణకు బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, సోఫా ఆయిల్, హిట్, ఆల్ అవుట్ వంటి సామగ్రిని అవసరమైన మేరకు వినియోగించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా సూచించారు. సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, అనవసరంగా సెలవులు పెట్టకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించి నిర్ణీత డ్రెస్ కోడ్‌ను పాటించాలని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, సిబ్బందికి ఏవైనా సమస్యలు, అవసరాలు లేదా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. సానిటేషన్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి నెల నాలుగు సెలవులు (ఆఫ్‌లు) మంజూరు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ఈ సందర్భంగా ప్రకటించారు. దేవస్థానానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని ఈవో చివరిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, ఏఈఓ అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పూజిత, ఆలయ ఉద్యోగులు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఔట్‌సోర్సింగ్ సానిటేషన్ సిబ్బందితో ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎల్. రమాదేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, వేసవి సెలవుల సమయంలో ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, భక్తుల వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంగణాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, అంకితభావంతో పనిచేసి పరిశుభ్రతను కాపాడిన సానిటేషన్ సిబ్బంది సేవలను ఆమె ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈవో రమాదేవి ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు, క్రిమికీటకాల నివారణకు బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, సోఫా ఆయిల్, హిట్, ఆల్ అవుట్ వంటి సామగ్రిని అవసరమైన మేరకు వినియోగించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా సూచించారు. సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, అనవసరంగా సెలవులు పెట్టకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించి నిర్ణీత డ్రెస్ కోడ్‌ను పాటించాలని ఆమె స్పష్టం చేశారు.

అదేవిధంగా, సిబ్బందికి ఏవైనా సమస్యలు, అవసరాలు లేదా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. సానిటేషన్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి నెల నాలుగు సెలవులు (ఆఫ్‌లు) మంజూరు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ఈ సందర్భంగా ప్రకటించారు. దేవస్థానానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని ఈవో చివరిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, ఏఈఓ అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పూజిత, ఆలయ ఉద్యోగులు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 hrs ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించగా, వానాకాలం ఆరంభంలో తొలకరి పలకరింపుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుకు సన్నద్ధమయ్యారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన ఈ భారీ వర్షం ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం కల్పించింది. అయితే, కరీంనగర్ నగరంలో కుండపోతగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లగా, రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన ఈ జోరు వాన ప్రజలను, ముఖ్యంగా ఎండ వేడిమి నుండి ఉపశమనం కోరుతున్న వారిని సంతోషపెట్టగా, వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులలో ఆనందాన్ని నింపింది.
    2
    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించగా, వానాకాలం ఆరంభంలో తొలకరి పలకరింపుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుకు సన్నద్ధమయ్యారు.

కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన ఈ భారీ వర్షం ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం కల్పించింది. అయితే, కరీంనగర్ నగరంలో కుండపోతగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లగా, రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మొత్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన ఈ జోరు వాన ప్రజలను, ముఖ్యంగా ఎండ వేడిమి నుండి ఉపశమనం కోరుతున్న వారిని సంతోషపెట్టగా, వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులలో ఆనందాన్ని నింపింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • రామాయంపేట్‌లో ప్రస్తుతం ఎస్.ఎస్.ఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తహశీల్దార్ రజని కుమారి రామాయంపేట్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆమె సూచనల ప్రకారం, 2002 తర్వాత జన్మించిన మహిళలు తమ తండ్రి ఓటర్ కార్డ్‌ను స్థానిక బీఎల్ఓకు సమర్పించి, తమ కుటుంబ ఓటును అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందుతాయని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, పురుషులు కూడా తమ ఓటును భద్రపరచుకోవడానికి బీఎల్ఓ వద్ద ఓటర్ లిస్ట్‌ను సరిచూసుకోవాలని తహశీల్దార్ రజని కుమారి కోరారు.
    1
    రామాయంపేట్‌లో ప్రస్తుతం ఎస్.ఎస్.ఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తహశీల్దార్ రజని కుమారి రామాయంపేట్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు.

ఆమె సూచనల ప్రకారం, 2002 తర్వాత జన్మించిన మహిళలు తమ తండ్రి ఓటర్ కార్డ్‌ను స్థానిక బీఎల్ఓకు సమర్పించి, తమ కుటుంబ ఓటును అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందుతాయని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, పురుషులు కూడా తమ ఓటును భద్రపరచుకోవడానికి బీఎల్ఓ వద్ద ఓటర్ లిస్ట్‌ను సరిచూసుకోవాలని తహశీల్దార్ రజని కుమారి కోరారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • కామారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఒక విలేకరుల సమావేశం జరిగింది. భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, మోదీ సుపరిపాలనపై తన హర్షం వ్యక్తం చేశారు. శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించి సరికొత్త రికార్డు సృష్టించిన మహోన్నత నాయకుడని కొనియాడారు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన ఏకైక ప్రధాని మోదీ గారేనని ఆయన అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ‘విశ్వగురువు’గా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని శ్రీ వెంకటరమణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి బాటలు వేస్తున్న నరేంద్ర మోదీకి కామారెడ్డి ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేన రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, కౌన్సిలర్లు లక్ష్మారెడ్డి, భాను, వంశీ, అరవింద్ తో పాటు నాయకులు రవీందర్, సంతోష్ రెడ్డి, వేణు, లింగారావు తదితరులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఒక విలేకరుల సమావేశం జరిగింది. భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, మోదీ సుపరిపాలనపై తన హర్షం వ్యక్తం చేశారు.

శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించి సరికొత్త రికార్డు సృష్టించిన మహోన్నత నాయకుడని కొనియాడారు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన ఏకైక ప్రధాని మోదీ గారేనని ఆయన అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ‘విశ్వగురువు’గా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు.

ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని శ్రీ వెంకటరమణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి బాటలు వేస్తున్న నరేంద్ర మోదీకి కామారెడ్డి ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేన రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, కౌన్సిలర్లు లక్ష్మారెడ్డి, భాను, వంశీ, అరవింద్ తో పాటు నాయకులు రవీందర్, సంతోష్ రెడ్డి, వేణు, లింగారావు తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం, గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు, అలాగే రైతు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అన్నాడి మల్లారెడ్డి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బాలకిషన్, వారికి తన సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులైన పాకాల, మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, అన్నాడి సత్యనారాయణ రెడ్డి, ఎలా శేఖర్ బాబు, రామ్ లింగా రెడ్డి కూడా పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం, గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు, అలాగే రైతు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అన్నాడి మల్లారెడ్డి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బాలకిషన్, వారికి తన సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులైన పాకాల, మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, అన్నాడి సత్యనారాయణ రెడ్డి, ఎలా శేఖర్ బాబు, రామ్ లింగా రెడ్డి కూడా పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.