*"స్టేట్ టు బూత్,ప్రతి సమాచారం,లీడర్ టు క్యాడర్" పోస్టర్ విడుదల* _'మై టీడీపీ' యాప్ డౌన్లోడ్ చేసుకోండి_ _మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు_ *గొల్లపూడి, ఫిబ్రవరి 18,* తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరరూ మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు.విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో "స్టేట్ టు బూత్, ప్రతి సమాచారం,లీడర్ టు క్యాడర్" పోస్టర్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ప్రతి టీడీపీ కార్యకర్తకు ఉపయోగపడేలా ఈ యాప్ రూపొందించినట్టు చెప్పారు.కూటమి ప్రభుత్వ పథకాలు,పనులకు సంబంధించిన వివరాలు మొత్తం ఇందులోనే తెలుస్తాయని పేర్కొన్నారు.రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి సమాచారం వరకూ ఇందులో అందుబాటులో ఉంటుందన్నారు.పార్టీకి,ప్రభుత్వానికి సంభందించిన తాజా వార్తలు,సమగ్ర సమాచారంతో "మై టీడీపీ" యాప్ మీ ముందుకు వచ్చిందన్నారు.పార్టీకి సంబంధించి ప్రతి అప్డేట్‌ను ఇందులో మీరు పొందవచ్చు.అలాగే మీకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు.పార్టీ కొరకు మీరు చేసే ప్రతి పని, సోషల్ మీడియా ద్వారా గ్రౌండ్ లెవెల్‌లో మీ యాక్టివిటీస్ అన్ని ఈ యాప్ ద్వారా అధిష్టానానికి తెలుస్తుంది.కావున ప్రతి ఒక్క కార్యకర్త,తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు అందరూ కింద ఇచ్చిన లింక్ ద్వారా మై టీడీపీ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు.ప్రతి గ్రామ,మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఈ పోస్టర్లను ప్రదర్శించాలన్నారు.కుటుంబ సాధికార సారథులు,బూత్ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు,యూనిట్ ఇంచార్జిలు,క్లస్టర్ ఇంఛార్జిలు,మండల పార్టీ అధ్యక్షులు,అనుబంధ విభాగాల ప్రతినిధులు ఈ యాప్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొనగలరు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- Post by ఉంగరాల కార్తీక్1
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- గుంటూరు జిల్లా ః *అంబటి రాంబాబు కు బెయిల్ మంజూరు* సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అరెస్టు అయిన అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న అంబటి. అంబటి కు కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన జడ్జి1