సత్యసాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎంపిక కార్యక్రమం బుక్కపట్నం మండలంలోని జానకంపల్లిలో పల్లి గ్రామంలో జరిగింది బుక్కపట్నం మండలం జానకంపల్లి వద్ద నిర్వహించిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ సత్య సాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పుట్టపర్తి శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఈలూరు లక్ష్మయ్య, సత్యసాయి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. శ్రీ సత్య సాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోలేపల్లి ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయగా సత్యసాయి జిల్లాలోని పలువురికి కమిటీలో చోటు కల్పించారు. కోశాధికారిగా ధర్మవరం పట్టణానికి చెందిన బండ్లపల్లి రంగనాథం, మీడియా కమిటీ చైర్మన్ గా గ్రంధే శ్రీనివాసులు, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్గా పోడమల కృష్ణ కుమార్, జాయింట్ సెక్రటరీగా బండ్లపల్లి రంగనాథ్, రేపాకుల సుబ్బయ్య, బద్రీనాథ్ గుప్తా, ఆర్వేట్ కిషోర్, రామకృష్ణ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎంపిక కార్యక్రమం బుక్కపట్నం మండలంలోని జానకంపల్లిలో పల్లి గ్రామంలో జరిగింది బుక్కపట్నం మండలం జానకంపల్లి వద్ద నిర్వహించిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ సత్య సాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పుట్టపర్తి శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఈలూరు లక్ష్మయ్య, సత్యసాయి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. శ్రీ సత్య సాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోలేపల్లి ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయగా సత్యసాయి జిల్లాలోని పలువురికి కమిటీలో చోటు కల్పించారు. కోశాధికారిగా ధర్మవరం పట్టణానికి చెందిన బండ్లపల్లి రంగనాథం, మీడియా కమిటీ చైర్మన్ గా గ్రంధే శ్రీనివాసులు, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్గా పోడమల కృష్ణ కుమార్, జాయింట్ సెక్రటరీగా బండ్లపల్లి రంగనాథ్, రేపాకుల సుబ్బయ్య, బద్రీనాథ్ గుప్తా, ఆర్వేట్ కిషోర్, రామకృష్ణ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱94928871161
- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.1
- కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.1
- రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.1
- వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.2
- పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.1