ధర్మారావుపేటలో కోటి గోటి తలంబ్రాల శోభయాత్రకు ఏర్పాట్లు అధికారులను ఆహ్వానించిన శ్రీ రామదాసు సేవ సమితి ప్రతినిధులు గణపురం:మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శ్రీ రామదాసు సేవ సమితి, శ్రీ రామదాసు భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోటి గోటి తలంబ్రాల శోభయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ధర్మారావుపేట గ్రామంలో శ్రీ భద్రాచల సీతారాముల కల్యాణ కోటి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మార్చి 12వ తేదీ గురువారం కోటి గోటి తలంబ్రాల శోభయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ ఎల్. భాస్కర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రావు, సబ్ ఇన్‌స్పెక్టర్ రేఖ అశోక్‌లను శ్రీ రామదాసు సేవ సమితి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించినట్లు సమితి ఉమ్మడి జిల్లా బాధ్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారావుపేట సేవ సమితి అధ్యక్షులు బెనికి రాజేందర్, భజన మండలి అధ్యక్షులు ఆకుల దామోదర్, ఉపాధ్యక్షులు దూలం శంకర్, పనికేలా శివకృష్ణ, సమితి సభ్యులు కురిమిళ్ల తిరుపతి, గందే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మారావుపేటలో కోటి గోటి తలంబ్రాల శోభయాత్రకు ఏర్పాట్లు అధికారులను ఆహ్వానించిన శ్రీ రామదాసు సేవ సమితి ప్రతినిధులు గణపురం:మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శ్రీ రామదాసు సేవ సమితి, శ్రీ రామదాసు భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోటి గోటి తలంబ్రాల శోభయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ధర్మారావుపేట గ్రామంలో శ్రీ భద్రాచల సీతారాముల కల్యాణ కోటి గోటి
తలంబ్రాల కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మార్చి 12వ తేదీ గురువారం కోటి గోటి తలంబ్రాల శోభయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ ఎల్. భాస్కర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రావు, సబ్ ఇన్‌స్పెక్టర్ రేఖ అశోక్‌లను శ్రీ రామదాసు సేవ సమితి
ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించినట్లు సమితి ఉమ్మడి జిల్లా బాధ్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారావుపేట సేవ సమితి అధ్యక్షులు బెనికి రాజేందర్, భజన మండలి అధ్యక్షులు ఆకుల దామోదర్, ఉపాధ్యక్షులు దూలం శంకర్, పనికేలా శివకృష్ణ, సమితి సభ్యులు కురిమిళ్ల తిరుపతి, గందే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
- వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.1
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.3
- *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది1
- Shabbir Arts 81216816861
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.2
- ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో “సర్పంచ్ అంటే ఇలా ఉండాలి” అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తన పనితీరుతో గ్రామంలో “సంథింగ్ స్పెషల్”గా నిలుస్తున్నారు.1