ఎల్ఎండిలో ఘనంగా మానసిక వికలాంగుల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు...ఆడి పాడి చూపరులను ఆకట్టుకున్న బుద్ధిమాంద్యం గల విద్యార్థులు మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకు మానవత్వం ఉన్న ప్రతిఒక్కరు సాయం చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేథో వికలాంగుల ప్రత్యేక పాఠశాల(మానసిక వికలాంగుల పాఠశాల) 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియో థెరఫీ, స్పీచ్ థెరఫీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి మానసిక విద్యార్థులతో మాట్లాడి అభినందించారు. జన్యులోపంతో పుట్టిన పిల్లలను మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందిస్తూ ఇలాంటి పాఠశాలకు ప్రతీ ఒక్కరు తమవంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకుని మోదో జ్ణానం కల్పించాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఇలాంటి పాఠశాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే, ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తనవంతు సహాకారం అందిస్తూనే, రాబోవు రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్టు సభ్యులు సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ సుమతి, కరీనంగర్ ఆర్డీవో మహేశ్వర్, ట్రస్టు ఫౌండర్ బి.వెంకటయ్య, ఇండస్ట్రీస్ జీఎం సాలమన్ రాజు, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు సదానంద గౌడ్, ట్రస్టు మెంబర్ గాజుల భగవాన్, జాప వెంకటరమణారెడ్డి, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సతీష్, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- Post by Tagore1
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకు మానవత్వం ఉన్న ప్రతిఒక్కరు సాయం చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేథో వికలాంగుల ప్రత్యేక పాఠశాల(మానసిక వికలాంగుల పాఠశాల) 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియో థెరఫీ, స్పీచ్ థెరఫీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి మానసిక విద్యార్థులతో మాట్లాడి అభినందించారు. జన్యులోపంతో పుట్టిన పిల్లలను మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందిస్తూ ఇలాంటి పాఠశాలకు ప్రతీ ఒక్కరు తమవంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకుని మోదో జ్ణానం కల్పించాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఇలాంటి పాఠశాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే, ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తనవంతు సహాకారం అందిస్తూనే, రాబోవు రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్టు సభ్యులు సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ సుమతి, కరీనంగర్ ఆర్డీవో మహేశ్వర్, ట్రస్టు ఫౌండర్ బి.వెంకటయ్య, ఇండస్ట్రీస్ జీఎం సాలమన్ రాజు, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు సదానంద గౌడ్, ట్రస్టు మెంబర్ గాజుల భగవాన్, జాప వెంకటరమణారెడ్డి, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సతీష్, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.1